India vs England 5th T20 Match Highlights: భారత్‌ విజయకేతనం… ఐదు టీ20ల సిరీస్‌ కైవసం చేసుకున్న టీమిండియా… ‌‌

uppula Raju

| Edited By: Narender Vaitla

Updated on: Mar 20, 2021 | 11:26 PM

India vs England 5th T20 Highlights: భారత్, ఇంగ్లండ్‌ జట్ల మధ్య హోరాహోరీగా సాగిన 5 మ్యాచ్‌ల టీ20 సిరీస్‌ చివరికి చేరింది. అహ్మదాబాద్‌ వేదికగా జరిగిన ఈ పోరులో ఇరు జట్లు 2–2తో సమంగా ఉండగా...

India vs England 5th T20 Match Highlights: భారత్‌ విజయకేతనం... ఐదు టీ20ల సిరీస్‌ కైవసం చేసుకున్న టీమిండియా... ‌‌
Virat Kohli Eoin Morgan

India vs England 5th T20 Highlights: మొతేరాలో భారత్‌ మోత మోగించింది. నువ్వా… నేనా అన్నట్లు సాగిన ఐదో టీ20లో విజయకేతనం ఎగరేసిన భారత్‌ సిరీస్‌ను కైవసం చేసుకుంది. గత మ్యాచ్‌లో విఫలమైన భారత్‌ బ్యాట్స్‌మెన్‌ ఐదో టీ20లో మాత్రం చెలరేగారు. టీమిండియా కెప్టెన్‌ కోహ్లీ (80), రోహిత్‌ (64) పరుగులతో రాణించడంతో ఇంగ్లాండ్‌ ముందు 224 పరుగుల భారీ లక్ష్యాన్ని ఉంచింది. అయితే భారీ లక్ష్యంతో బరిలోకి దిగిన ఇంగ్లాండ్‌ను 188/8కి పరిమితం చేశారు టీమిండియా బౌలర్లు. ఇంగ్లాండ్‌ బ్యాట్స్‌మెన్‌లో జోస్‌ బట్లర్‌ (52), డేవిడ్‌ మలన్‌ (68)లు మాత్రమే రాణించారు. మిగతా బ్యాట్స్‌మెన్‌ చేతులేత్తేయడంతో ఇండియా గెలుపు ఖాయమైంది.

టాస్ ఓడి బ్యాటింగ్ దిగిన భారత్ 20 ఓవర్లు ముగిసేసరికి 2 వికెట్లు కోల్పోయి 224 పరుగులు చేసింది. టీమిండియా కెప్టెన్‌ విరాట్‌ కోహ్లీ చాలా రోజుల తర్వాత చెలరేగిపోయాడు. హాఫ్ సెంచరీ సాధించి అదరగొట్టాడు. 52 బంతుల్లో 80 పరుగులు చేశాడు. ఇందులో ఏడు ఫోర్లు, రెండు సిక్స్‌లు ఉన్నాయి. హిట్‌మ్యాన్‌ రోహిత్‌ శర్మ 34 బంతుల్లో 64 పరుగులు చేసి ఓపెనర్లుగా తమ బాధ్యత నిర్వర్తించారు. హార్దిక్‌ పాండ్య 39 పరుగులతో విరాట్‌ కోహ్లీకి జత కలిసాడు. చివర్లో వేగంగా ఆడటం వల్ల భారత్ 200 పరుగులు దాటింది. కాగా ఇంగ్లాండ్‌పై భారత్‌కి ఇదే అత్యధిక స్కోరు.

భారత్‌: కోహ్లి (కెప్టెన్‌), రోహిత్, సూర్యకుమార్‌, పంత్, అయ్యర్, హార్దిక్, సుందర్, శార్దుల్, భువనేశ్వర్, రాహుల్‌ చాహర్, నటరాజన్‌‌‌.

ఇంగ్లండ్‌: మోర్గాన్‌ (కెప్టెన్‌), రాయ్, బట్లర్, మలాన్, బెయిర్‌స్టో, స్టోక్స్, వుడ్‌, సామ్‌ కర్రన్‌, ఆర్చర్, రషీద్, జోర్డాన్‌.

LIVE NEWS & UPDATES

The liveblog has ended.
  • 20 Mar 2021 10:52 PM (IST)

    భారత్‌ ఘన విజయం… టీ20 సిరీస్‌ కైవసం

    ఇంగ్లాండ్‌తో టెస్ట్‌ సిరీస్‌ గెలిచిన తర్వాత జరిగిన టీ20 మ్యాచ్‌లో కూడా టీమిండియా సమిష్టిగా రాణించింది. దీంతో ఐదు టీ20ల సిరీస్‌ను 3-2తో కైవసం చేసుకుంది భారత్. 36 పరుగుల తేడాతో ఘన విజయం సాదించింది.

  • 20 Mar 2021 10:50 PM (IST)

    ఒత్తిడిలో ఇంగ్లాండ్‌ బ్యాట్స్‌మెన్‌ వెనువెంటనే రెండు వికెట్లు కోల్పోయిన ఇంగ్లిష్‌ జట్టు..

    మ్యాచ్‌ చేజారి పోతోన్న క్రమంలో టీమిండియా బ్యాట్స్‌మెన్‌ తీవ్ర ఒత్తిడికి గురవుతున్నారు. ఈ క్రమంలోనే వరుసగా రెండు వికెట్లు కోల్పోయింది. స్టోక్స్‌, ఆర్చర్‌ పెవిలియన్‌ బాట పట్టారు. ప్రస్తుతం ఇంగ్లాండ్‌ విజయం కోసం 4 బంతుల్లో 51 పరుగులు చేయాల్సి ఉంది. దీంతో భారత్‌ విజయం దాదాపు ఖాయమైనట్లో.

  • 20 Mar 2021 10:43 PM (IST)

    కష్టాల్లో ఇంగ్లాండ్‌… గెలుపునకు చేరువలో భారత్‌..

    ఐదు టీ20ల సీరీస్‌లో భారత్‌ విజయకేతనం ఎగరవేసే దిశగా దూసుకెళుతోంది. ఒకానొక సమయంలో ఇంగ్లాండ్‌ బ్యాట్స్‌మెన్‌ దూకుడుగా ఆడడంతో మ్యాచ్ చేజారిపోతుందేమోననే అనుమానాలు వ్యక్తమవుతోన్న సమయంలో టీమిండియా బౌలర్లు చెలరేగిపోవడంతో ఇంగ్లాండ్‌ చతికిల పడింది. వెంట వెంటనే నాలుగు వికెట్లు కోల్పోయి ఓటమి దిశగా పయనిస్తోంది. ఇంగ్లాండ్‌ విజయానికి 10 బంతుల్లో 60 పరుగులు చేయాల్సి ఉంది.

  • 20 Mar 2021 10:35 PM (IST)

    మైకేల్‌ వాన్‌ జోస్యం ఫలించేలా లేదుగా… ఈ లెక్కన టీ20 వరల్డ్‌ కప్ భారత్‌దే..

    ఇంగ్లాండ్‌ జట్టు మాజీ కెప్టెన్‌ మైకేల్‌ వాన్‌ అహ్మాదాబాద్‌ వేదికగా జరుగుతోన్న ఐదో టీ20 గురించి ఆసక్తికరమైన ట్వీట్ చేశాడు. ‘నేటి టీ20 ఫైనల్‌ మ్యాచే.. రానున్న 8 నెలల్లో ఇదే వేదికపై జరుగనున్న.. టీ20 వరల్డ్ కప్‌ ఫైనల్‌ వంటిది. ఇక ఈ మ్యాచ్‌లో ఇంగ్లండ్‌ గెలుస్తుంది’ అని ట్వీట్‌ చేశాడు. అయితే మైకేల్‌ ఇంగ్లాండ్‌ గెలిచేస్తుందని కాస్త ఓవర్‌ కాన్ఫిడేంట్‌తో ట్వీట్ చేశాడు. కానీ మ్యాచ్‌ పరిస్థితి చూస్తుంటే భారత్‌ గెలిచేలా ఉంది. ఈ లెక్కన చూసుకుంటే.. మైకేల్‌ చెప్పినట్లు.. రానున్న టీ20 భారత్‌ గెలుస్తుందని అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.

  • 20 Mar 2021 10:26 PM (IST)

    మలన్, మోర్గాన్‌ అవుట్‌… మ్యాచ్‌పై పట్టుబిగిస్తోన్న భారత్‌..

    ఒకానొక సమయంలో ఇంగ్లాండ్‌ మ్యాచ్‌ గెలిచేస్తోందా అనుకుంటోన్న సమయంలో భారత్‌ బౌలర్లు ఒక్కసారిగా రెచ్చిపోయారు. వరుస వికెట్లు పడకొడుతూ మ్యాచ్‌పై పట్టు బిగిస్తున్నారు. తాజాగా మలన్‌, మోర్గాన్‌ పెవిలియన్‌ బాట పట్టారు. ప్రస్తుతం ఇంగ్లాండ్‌ 25 బంతుల్లో 82 పరుగులు సాధించాల్సి ఉంది.

  • 20 Mar 2021 10:21 PM (IST)

    మరో వికెట్‌ కోల్పోయిన ఇంగ్లాండ్‌.. బరిస్టో అవుట్‌..

    లక్ష్య చేధనలో దూకుడుగా వ్యవహరిస్తోన్న ఇంగ్లాండ్‌ను భారత్‌ బౌలర్లు వరుసగా దెబ్బకొడుతున్నారు. మంచి ఫామ్‌తో హాఫ్‌ సెంచరీ చేసిన బట్లర్‌ను భువీ అవుట్ చేయగా… థాకూర్‌ బరిస్టోను పెవిలియన్‌ బాట పట్టించాడు. సూర్యకుమార్‌ యాదవ్‌కు క్యాచ్‌ ఇచ్చిన బరిస్టో వెనుదిరిగాడు. ప్రస్తుతం క్రీజులో మోర్గాన్‌ (0), మలర్‌ (68) పరుగులతో ఉన్నారు. ఇంగ్లాండ్‌ 31 బంతుల్లో 83 పరుగులు చేయాల్సి ఉంది.

  • 20 Mar 2021 10:17 PM (IST)

    భువీ చేతులో బట్లర్‌ ఎన్నిసార్లు అవుట్‌ అయ్యాడో తెలుసా..?

    గడిచిన ఐదు మ్యాచ్‌ల్లో ఇంగ్లాండ్‌ బ్యాట్స్‌మెన్‌ బట్లర్‌.. భువనేశ్వర్‌ వేసిన 25 పరుగుల ఎదుర్కోగా వీటిలో 26 పరుగులు సాధించాడు.. మూడు సార్లు అవుట్‌ అయ్యాడు. ప్రస్తుతం ఇంగ్లాండ్‌ 14 ఓవర్లకు రెండు వికెట్ల నష్టానికి 136 పరుగుల వద్ద కొనసాగుతోంది. ఇంగ్లాండ్‌ 35 బంతుల్లో 89 పరుగులు చేయాల్సి ఉంది.

  • 20 Mar 2021 10:10 PM (IST)

    భీకర భాగస్వామ్యాన్ని విడగొట్టిన భువనేశ్వర్‌.. పెవిలియన్‌ బాట పట్టిన బట్లర్‌..

    జట్టును స్కోరును వేగంగా పరుగులెత్తిస్తూ.. విధ్వంసర బ్యాటింగ్‌తో ఇంగ్లాండ్‌ను విజయతీరాలను చేర్చే క్రమంలో కొనసాగుతోన్న బట్లర్‌, భువనేశ్వర్‌ భాగస్వామ్యానికి భువనేశ్వర్‌ చెక్‌ పెట్టాడు. కేవలం 34 బంతుల్లో 52 పరుగులు సాధించిన బట్లర్‌ హార్ధిక్‌ పాండ్యాకు క్యాచ్‌ ఇచ్చి వెనుతిరిగాడు. ప్రస్తుతం ఇంగ్లాండ్‌ విజయం కోసం 42 బంతుల్లో 95 పరుగులు చేయాల్సి ఉంది.

  • 20 Mar 2021 10:05 PM (IST)

    అద్భుత భాగస్వామ్యంతో… జట్టు స్కోరును పరుగులెత్తిస్తోన్న బట్లర్‌, మలన్‌..

    టీమిండియా ఇచ్చిన భారీ అధిక్యాన్ని చేధించే క్రమంలో ఇంగ్లాండ్‌ బ్యాట్స్‌మెన్‌ దూసుకెళుతున్నారు. 128 పరుగుల భారీ భాగస్వామ్యాన్ని అందించిన బట్లర్‌, మలన్‌ జట్టు స్కోరును పరిగెత్తించే పనిలో పడ్డారు. ప్రస్తుతం ఇంగ్లాండ్‌ స్కోర్‌ 12 ఓవర్లకు 128/1 వద్ద కొనసాగుతోంది.

  • 20 Mar 2021 10:00 PM (IST)

    హాఫ్ సెంచరీలు చేసిన మలన్‌, బట్లర్‌..

    చివరి మ్యాచ్‌లో ఇరు జట్లు హోరాహోరీగా పోరాడుతున్నాయి. ఆట రసవత్తరంగా మారింది. ఇంగ్లాండ్ లక్ష్యం దిశగా దూసుకెళుతుంది. టీ 20 టాప్ బ్యాట్స్‌మెన్ డేవిడ్ మలన్, బట్లర్‌ కూడా హాప్ సెంచరీ చేసి చెలరేగుతున్నారు. మలన్‌ 37 బంతుల్లో 63 పరుగులు.. బట్లర్ 30 బంతుల్లో 50 పరుగులు చేశారు.

  • 20 Mar 2021 09:50 PM (IST)

    హాఫ్ సెంచరీ దిశగా దూసుకెళుతున్న మలన్‌, బట్లర్.. 10 ఓవర్లకు ఇంగ్లాండ్ స్కోరు 104/1

    ఇంగ్లాండ్‌ ఆటగాళ్లు జోరుగా ఆడుతున్నారు. లక్ష్యాన్ని చేధించే దిశలో అడుగులు వేస్తున్నారు. డేవిడ్‌ మలన్, బట్లర్ హాప్ సెంచరీ దిశగా కొనసాగుతున్నారు. మలన్ 48 పరుగులతో బట్లర్ 47 పరుగులతో ఆడుతున్నారు.

  • 20 Mar 2021 09:34 PM (IST)

    హాఫ్ సెంచరీ దిశగా మలన్‌..

    భారీ లక్ష్యాన్ని చేధించేందుకు ఇంగ్లాండ్ బ్యాట్స్‌మెన్ జోరుగా ఆడుతున్నారు. మలన్‌ 39 పరుగులతో హాఫ్ సెంచరీ దిశగా దూసుకెళుతున్నాడు. మరో వైపు బట్లర్ కూడా 23 పరుగులతో మెరుపులు మెరిపిస్తున్నాడు. 7 ఓవర్లకు ఇంగ్లాండ్ 68/1 వికెట్‌తో కొనసాగుతోంది.

  • 20 Mar 2021 09:22 PM (IST)

    5 ఓవర్లకు ఇంగ్లాండ్ 55/1.. వేగంగా ఆడుతున్న మలన్‌, బట్లర్‌

    ఐదు ఓవర్లు ముగిసేసరికి ఇంగ్లాండ్ పరుగులతో కొనసాగుతోంది. బట్లర్, మలన్ టార్గెట్‌ చేధించే లక్ష్యంతో ఆడుతున్నారు. డేవిడ్ మలన్ 16 బంతుల్లో 27 పరుగులు, జోస్‌బట్లర్ 12 బంతుల్లో 22 పరుగులతో ఆడుతున్నారు. ఇంగ్లాండ్ విజయానికి 90 బంతుల్లో 170 పరుగులు చేయాలి.

  • 20 Mar 2021 09:11 PM (IST)

    మొదటి వికెట్ కోల్పోయిన ఇంగ్లాండ్.. 2 ఓవర్లకు 18/1

    బ్యాటింగ్‌ ప్రారంభించిన ఇంగ్లాండ్‌కు తొలి ఓవర్‌ లోనే ఎదురుదెబ్బ తగిలింది. భువనేశ్వర్ రెండో బంతికే రాయ్‌ని ఔట్ చేశాడు. కేవలం ఒక్క పరుగు మాత్రమే వచ్చింది. కాగా రెండో ఓవర్లో మలన్‌ ఫోర్ కొట్టి ఉత్సాహపరిచాడు. మూడో బంతిని సిక్స్ బాదాడు. మరో ఫోర్ కొట్టి ఈ ఓవర్లో 18 పరుగులు రాబట్టాడు.

  • 20 Mar 2021 08:46 PM (IST)

    భారత్ 20 ఓవర్లకు 224/2..

    భారత్ 20 ఓవర్లకు 224/2 భారీ స్కోరు సాధించింది. ఇంగ్లాండ్ లక్ష్యం 225 పరుగులు. విరాట్‌ కోహ్లీ 80 పరుగులు, హార్దిక్‌ పాండ్య 39 పరుగులతో క్రీజులో నిలిచారు. ఇంగ్లాండ్‌పై భారత్‌కి ఇదే అత్యధిక స్కోరు.

  • 20 Mar 2021 08:40 PM (IST)

    200 పరుగులు దాటిన భారత్.. సిక్స్‌లతో చెలరేగుతున్న హార్దిక్‌

    టీమిండియా బ్యాట్స్‌మెన్ హార్దిక్‌ పాండ్య 18 ఓవర్లో మొదటి రెండు బంతులు సిక్స్‌లు బాదాడు. విరాట్ ఓ ఫోర్ సాదించాడు. భారత్ 19 ఓవర్లకు 211/2 పరుగులతో కొనసాగుతుంది.

  • 20 Mar 2021 08:29 PM (IST)

    200 పరుగుల దిశగా భారత్..

    భారత్ 200 పరుగుల దిశగా దూసుకెళుతుంది. 17 ఓవర్లు ముగిసేసరికి 181/2 పరుగులతో కొనసాగుతోంది. కెప్టెన్ విరాట్ కోహ్లీ నిలకడగా ఆడుతున్నాడు. పాండ్య 24 పరుగులతో దూకుడు పెంచాడు.

  • 20 Mar 2021 08:23 PM (IST)

    హాఫ్ సెంచరీ చేసిన కోహ్లీ.. భారీ స్కోరు దిశగా భారత్

    చాలా రోజుల తర్వాత కోహ్లీ చెలరేగిపోయాడు. 36 బంతుల్లో హాఫ్ సెంచరీ సాధించాడు. భారీ స్కోరు దిశగా భారత్ దూసుకెళుతుంది. 16 ఓవర్లకు భారత్ స్కోరు 170/2 గా ఉంది. మరోవైపు హార్దిక్‌ పాండ్య 15 పరుగులతో చక్కగా ఆడుతున్నాడు..

  • 20 Mar 2021 08:19 PM (IST)

    15 ఓవర్లకు భారత్‌ స్కోరు.. 157/2

    ఈ ఓవర్లో ఆర్చర్ 11 పరుగులు ఇచ్చాడు. సూర్యకుమార్‌ ఔట్ కావడంతో క్రీజులోకి హార్దిక్‌ పాండ్య వచ్చాడు. 7 పరుగులతో ఆడుతున్నాడు. మరోవైపు కోహ్లీ అర్ధశతకానికి చేరువలో ఉన్నాడు.

  • 20 Mar 2021 08:11 PM (IST)

    రెండో వికెట్ కోల్పోయిన భారత్.. సూర్యకుమార్ ఔట్

    భారత్ రెండో వికెట్‌ను కోల్పోయింది. సూర్యకుమార్ 37 పరుగులు ఔట్ అయ్యాడు. బౌండరీ లైన్‌ వద్ద జోర్డాన్‌ ఒంటి చేత్తో అద్భుతమైన క్యాచ్ పట్టాడు. సూర్య నిరాశగా వెనుదిరిగాడు.

  • 20 Mar 2021 08:02 PM (IST)

    12 ఓవర్లకు భారత్ స్కోరు 133/1

    సూర్యకుమార్ 31 పరుగులు, కోహ్లీ 30 పరుగులతో నిలకడగా ఆడుతున్నారు. బ్రిటీష్ బౌలర్లు నెమ్మదిగా బంతులు విసురుతున్నారు. క్రిస్‌ జోర్డాన్ వేసిన ఈ ఓవర్లో చివరి మూడుబంతులను సూర్యకుమార్‌ వరుస బౌండరీలు బాదాడు. కోహ్లీ కూడా ఓ బౌండరీ సాధించాడు.

  • 20 Mar 2021 07:50 PM (IST)

    వరుస సిక్సర్లు కొట్టిన సూర్యకుమార్ యాదవ్..

    సూర్యకుమార్ యాదవ్ వరుసగా రెండు సిక్సర్లు కొట్టాడు. ఆదిల్ రషీద్ బౌలింగ్‌లో నాలుగు, ఐదో బంతికి రెండు సిక్సర్లు బాదాడు. 10 ఓవర్లు ముగిసేసరికి టీమిండియా 110/1 పరుగులు చేసింది.

  • 20 Mar 2021 07:47 PM (IST)

    రోహిత్ శర్మ ఔట్.. మొదటి వికెట్ కోల్పోయిన భారత్..

    భారీ షాట్స్‌తో బెంబేలెత్తిస్తున్న రోహిత్ శర్మను ఎట్టకేలకు ఔట్ చేశారు. స్టోక్స్ బౌలింగ్‌లో రోహిత్ శర్మ క్లీన్ బౌల్డ్‌గా పెవిలియన్ చేరాడు. ఇక 9 ఓవర్లు ముగిసేసరికి టీమిండియా 94/1

  • 20 Mar 2021 07:39 PM (IST)

    హాఫ్ సెంచరీ చేసిన రోహిత్ శర్మ..

    హిట్ మ్యాన్ రోహిత్ శర్మ ఆకాశమే హద్దుగా చెలరేగిపోతున్నాడు. వరుస సిక్సర్లతో ప్రత్యర్ధులపై విరుచుకుపడుతున్నాడు. ఈ క్రమంలోనే 30 బంతులలో తన అర్ధ శతకాన్ని పూర్తి చేసుకున్నాడు. కరన్ ఓవర్‌లో చివరి బంతికి ఫైన్ లెగ్ మీదుగా భారీ సిక్స్ కొట్టాడు. ఇక టీమిండియా 8 ఓవర్లకు 81/0 పరుగులు చేసింది.

  • 20 Mar 2021 07:36 PM (IST)

    హాఫ్ సెంచరీకి చేరువలో రోహిత్ శర్మ..

    హిట్ మ్యాన్ రోహిత్ శర్మ ఆకాశమే హద్దుగా చెలరేగిపోతున్నాడు. వరుస సిక్సర్లతో ప్రత్యర్ధులపై విరుచుకుపడుతున్నాడు. జోర్డాన్‌ బౌలింగ్ చివరి బంతికి మిడ్ వికెట్ మీదుగా అద్భుతమైన సిక్స్ కొట్టాడు. దీనితో రోహిత్ శర్మ 26 బంతుల్లో 44 పరుగులు చేశాడు. ఇక టీమిండియా 7 ఓవర్లకు 70/0 పరుగులు చేసింది.

  • 20 Mar 2021 07:34 PM (IST)

    రోహిత్, కోహ్లీ మెరుపులు.. 6 ఓవర్లకు 60/0

    టీమిండియాకు రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీ అద్భుత ఆరంభాన్ని ఇచ్చారు. ఇద్దరూ కూడా మెరపులు మెరిపిస్తున్నారు. ఆకాశమే హద్దుగా చెలరేగిపోతున్నారు. మార్క్ వుడ్ బౌలింగ్‌లో రోహిత్, కోహ్లీ చెరో సిక్స్ కొట్టారు. ఆ ఓవర్‌లో మొత్తం 16 పరుగులు రాబట్టారు. దీనితో టీమిండియా 6 ఓవర్లకు 60/0 పరుగులు చేసింది.

  • 20 Mar 2021 07:24 PM (IST)

    5 ఓవర్లకు భారత్ స్కోరు 44/0.. వేగంగా ఆడుతున్న రోహిత్..

    5 ఓవర్లకు భారత్ స్కోరు 44/0.. ఓపెనర్‌ రోహిత్ శర్మ వేగంగా ఆడుతున్నాడు. చెత్త బంతులను వదిలిపెట్టకుండా బౌండరీలకు తరలిస్తున్నాడు. విరాట్ కోహ్లీ అతడికి చక్కటి స్టైక్ అందిస్తున్నాడు. రోహిత్ 28 పరుగులు చేశాడు. ఐదు ఓవర్లో ఒక్క బౌండరీ కూడా రాలేదు.

  • 20 Mar 2021 07:19 PM (IST)

    హిట్టింగ్ ప్రారంభించిన రోహిత్..

    రోహిత్ శర్మ వేగంగా ఆడుతున్నాడు. రషీద్ వేసిన మూడో ఓవర్లో ఆఖరు బంతిని మిడ్‌ వికెట్ మీదుగా సిక్స్ బాదాడు. కోహ్లీ 7 పరుగులతో ఆడుతున్నాడు. మూడు ఓవర్లు ముగిసేసరికి భారత్ స్కోరు. 22/0

  • 20 Mar 2021 07:16 PM (IST)

    మొదటి ఓవర్లో మూడు పరుగులే..

    టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లీ , రోహిత్ శర్మ ఓపెనింగ్‌కి దిగారు. బ్రిటీష్ బౌలర్ ఆదిల్ రషీద్ చాలా వేగంగా బంతులు విసురుతున్నాడు. మొదటి ఓవర్లో కేవలం 3 పరుగులు మాత్రమే వచ్చాయి. రోహిత్‌ 2, విరాట్ 0 పరుగులతో ఆడుతున్నారు. మొదటి ఓవర్ ముగిసేసరికి భారత్ స్కోర్ 3/0

Published On - Mar 20,2021 10:52 PM

Follow us