Suryakumar Yadav Stunned: వారెవ్వా.. ఆ క్యాచ్ మ్యాచ్‌కే హైలెట్.. సూర్యకుమార్ అవుటైన తీరు అద్భుతం..
Suryakumar Yadav Stunned: ఉత్కంట పోరులో భారత్ పై చేయి సాధించింది. ఐదు టీ 20 మ్యాచ్‌ల సరీస్‌లో భాగంగా అహ్మదాబాద్‌లో జరిగిన ఆఖరి మ్యాచ్‌లో 36 పరుగులతో భారత్ జయకేతనం ఎగరేసింది.
Suryakumar Yadav Stunned: ఉత్కంట పోరులో భారత్ పై చేయి సాధించింది. ఐదు టీ 20 మ్యాచ్‌ల సరీస్‌లో భాగంగా అహ్మదాబాద్‌లో జరిగిన ఆఖరి మ్యాచ్‌లో 36 పరుగులతో భారత్ జయకేతనం ఎగరేసింది. 3–2తో సిరీస్ సొంతం చేసుకుంది. టాస్ ఓడి ముందుగా బ్యాటింగ్‌కు దిగిన భారత్ 20 ఓవర్లలో 2 వికెట్ల నష్టానికి 224 పరుగులు చేసింది. కెప్టెన్ విరాట్ కోహ్లి (52 బంతుల్లో 80 నాటౌట్; 7 ఫోర్లు, 2 సిక్సర్లు), రోహిత్ శర్మ (34 బంతుల్లో 64; 4 ఫోర్లు, 5 సిక్సర్లు) అర్ధ సెంచరీలు సాధించగా… అనంతరం ఇంగ్లండ్ 20 ఓవర్లలో 8 వికెట్లకు 188 పరుగులు చేసింది. డేవిడ్ మలాన్ (46 బంతుల్లో 68; 9 ఫోర్లు, 2 సిక్సర్లు), జోస్ బట్లర్ (34 బంతుల్లో 52; 2 ఫోర్లు, 4 సిక్సర్లు) దూకుడుగా ఆడారు. వీరిద్దరు రెండో వికెట్‌కు 82 బంతుల్లోనే 130 పరుగులు జోడించినా జట్టును గెలిపించడంలో విఫలమయ్యారు.
ఇదిలా ఉంటే టీమిండియా బ్యాట్స్‌మెన్ సూర్యకుమార్ యాదవ్ ఔటైన తీరు ప్రేక్షకులు ఇప్పటికి మరిచిపోలేరు. ఈ క్యాచ్ మ్యాచ్‌కే హైలెట్‌గా నిలిచింది. రషీద్ బౌలింగ్‌లో సూర్య డీప్ మిడ్ వికెట్ దిశగా ఆడాడు. అయితే లాంగాన్ నుంచి దూసుకొచ్చిన జోర్డాన్ ఒంటి చేత్తో క్యాచ్ అందుకున్నాడు. అయితే వేగంలో తాను బౌండరీని దాటే ప్రమాదం ఉండటంతో బంతిని రాయ్‌వైపు విసిరాడు. రాయ్ బంతిని అందుకోవడంతో సూర్య వెనుదిరిగాడు. స్కోరు బోర్డులో జోర్డాన్ పేరు లేకపోయినా ఈ క్యాచ్ అతనిదే. ఇలాంటి అద్భుత క్యాచ్‌లు క్రికెట్ చరిత్రలో చిరకాలం నిలిచిపోతాయనడంలో ఎటువంటి సందేహం లేదు.
Chris Jordan Pulling Off A Michael Jordan Lay-Up!#IndiavsEngland #INDvsENG pic.twitter.com/FrAtVCPhBf
— @TimeTravellerJofraArcher (@JofraArcher8) March 20, 2021