- Telugu News Photo Gallery Business photos Keep safe your pan card aadhaar card and important documents in digilocker
Digilocker: మీ పాన్ కార్డ్, ఆధార్ కార్డ్ భద్రంగా దాచుకోండిలా.. ఒక్క యాప్‌తో ఎన్నో సదుపాయాలు
Digilocker:ఆధార్ కార్డు, పాన్ కార్డు ఈ రోజుల్లో తప్పనిసరి అయిపోయింది. ప్రతిదానికి ఆధార్ తప్పకుండా ఉండాల్సిందే. దాదాపు అన్ని రకాల లావాదేవీలకు తప్పకుండా..
Updated on: Mar 21, 2021 | 1:58 PM

Digilocker:ఆధార్ కార్డు, పాన్ కార్డు ఈ రోజుల్లో తప్పనిసరి అయిపోయింది. ప్రతిదానికి ఆధార్ తప్పకుండా ఉండాల్సిందే. దాదాపు అన్ని రకాల లావాదేవీలకు తప్పకుండా అవసరమే. మరి ఈ ఆధార్, పాన్ కార్డులు ఒక్క సమయంలో అవసరానికి దొరకవు. అప్పుడు ఇబ్బందులు పడాల్సి ఉంటుంది. అత్యవసరం ఉన్న సమయంలోనే ఒక్కడ వెతికినా దొరకవు. ఇంట్లో దాచుకున్నట్లయితే అవసరానికి అందుబాటులో ఉండవు. ఇలాంటి ఇబ్బందులు పడకుండా కేంద్ర ప్రభుత్వం ఐదు సంవత్సరాల కిందటనే వర్చువల్ లాకర్‌ను ప్రారంభించింది. కేంద్ర ఎలక్ట్రానిక్స్ అండ్ ఐటీ మంత్రిత్వశాఖ డిజిటల్ ఇండియా ప్రోగ్రామ్‌లో భాగంగా డిజీలాక్ అనే ప్లాట్‌ఫామ్‌ను రూపొందించింది.

ఇందులో మీ ముఖ్యమైన డాక్యుమెంట్స్ అన్నింటిని భద్రంగా ఉంచుకోవచ్చు. మీ పాన్ కార్డు, ఓటర్ ఐడీకార్డ్, డ్రైవింగ్ లైసెన్స్, పాస్ పోర్టుతో పాటు మీ సర్టిఫికేట్లను కూడా అందులో భద్రంగా ఉంచుకోవచ్చు. మీ డాక్యుమెంట్లను దాచుకోవాలంటే ముందుగా డిజీలాకర్‌లో మీ అకౌంట్ క్రియేట్ చేసుకోవాలి. https://digilocker.gov.in/ వెబ్‌సైట్ లేదా డిజీలాకర్ ఆండ్రాయిడ్, ఐఓఎస్ యాప్‌లో అకౌంట్ క్రియేట్ చేసుకోవచ్చు.

మీ యూజర్ నేమ్, పాస్‌వర్డ్ ద్వారా అకౌంట్ చేసుకుని డాక్యుమెంట్లన్నీ దాచుకోవచ్చు. అంతేకాదు జేపీఈజీ, పీడీఎఫ్,పెన్‌జీ లాంటి ఫార్మాట్‌లో ఉన్న డాక్యుమెంట్లను సైతం స్మాన్ చేసి అప్‌లోడ్ చేసుకోవచ్చు కూడా. పాన్ కార్డు, ఆధార్ కార్డు, డ్రైవింగ్ లైసెన్స్ మాత్రమే కాకుండా ప్రభుత్వం జారీ చేసిన వివిధ రకాలా సర్టిఫికేట్లు, ఇతర డాక్యుమెంట్లను ఈ డీజీలాకర్‌లో భద్రంగా పెట్టుకోవచ్చు.

మీ స్మార్ట్ ఫోన్‌లో డీజీలాకర్ యాప్ ఉంటే అందులో డాక్యుమెంట్లన్నీ సులభంగా భద్రంగా ఉంచుకునే సదుపాయం ఉంటుంది. రైలులో ప్రయాణించేటప్పుడు లేదా ట్రాఫిక్ పోలీసులు మీ వాహనాలను తనిఖీ చేసిన సమయంలో మీ ఆధార్, డ్రైవింగ్ లైసెన్స్ లాంటివి ఈ డీజీలాకర్‌లో చూపించుకోవచ్చు.

దీని వల్ల మీకు సమయానికి ఉపయోగడపతాయి. ఎవరైన ఈ వాహనం తనిఖీ చేసిన సమయంలో గానీ, ఎక్కడైన ఒరిజినల్ సర్టిఫికేట్లు చూపించాలని అడిగిన సమయంలో గానీ ఇది ఎంతగానో ఉపయోగపడుతుంది. మీ స్మార్ట్ ఫోన్‌లో ఈ యాప్ లేని వారు డౌన్‌లోడ్ చేసుకుంటే ఎంతో ఉపయోగకరంగా ఉంటుంది.




