Katie Boulter: టెన్నిస్ బెట్టింగ్ గ్యాంబ్లర్లు నన్ను చంపుతామని బెదిరిస్తున్నారు- యుకె క్రీడాకారిణి కీలక వ్యాఖ్యలు!
బ్రిటిష్ టెన్నిస్ క్రీడాకారిణి కేటీ బౌల్టర్ కీలక వ్యాఖ్యలు చేశారు. తాజాగా జరిగిన ఫ్రెంచ్ ఓపెన్ సమయంలో తనతో పాటు తన కుటుంబ సభ్యులకు బెదిరింపులు వచ్చాయని తెలిపారు. బౌల్టర్ వ్యాఖ్యల నేపథ్యంలో ప్రపంచ మహిళల టెన్నిస్ అసోసియేషన్ (WTA), ఇంటర్నేషనల్ టెన్నిస్ ఫెడరేషన్ (ITF)లు మంగళవారం తమ చర్యల్లో భాగంగా ఆన్‌లైన్ బెట్టింగ్ సంస్థలు మరింత జాగ్రత్తలు తీసుకోవాలని, సోషల్ మీడియాలో ప్లేయర్లపై వస్తున్న దాడులను తగ్గించేలా చర్యలు తీసుకోవాలని తెలిపారు.

28 ఏళ్ల బ్రిటీష్ టెన్నిస్ ప్లేయర్ కేటీ బౌల్టర్ ఫ్రెంచ్ ఓపెన్ సందర్భంగా ఆన్‌లైన్ బెదిరింపులను ఎదుర్కొన్నట్టు బీబీసీకి ఇచ్చిన ఓ ఇంటర్వ్యూలో తెలిపింది. ఓ మ్యాచ్ తర్వాత కొందరు బెట్టింగ్ గ్యాంబర్లు తనను, తన కుటుంబ సభ్యులను బెదిరింపులకు గురిచేసే మెసేజ్‌లు చేశారని తెలిపింది. ప్రస్తుత రోజుల్లో సోషల్ మీడియా దుర్వినియోగం సాధారణమైపోయిందని ఆమె చెప్పుకొచ్చారు. తనకు వచ్చే మెసేజ్‌లలో ఎక్కువ శాతం టెన్నిస్ మ్యాచ్‌లపై పందెం వేసే వ్యక్తుల నుంచే ఉంటున్నాయని తెలిపారు. ఈ మెసేజ్‌లలో తనతో పాటు, తన కుటుంబాన్ని టార్గెట్‌గా చేసుకొని వారు తీవ్ర వ్యాఖ్యలు చేసినట్టు ఆమె ఆరోపించారు.
WTA, ITF సంస్థలు నివేదిక ప్రకారం, 2024లో సుమారు 458 మంది టెన్నిస్ క్రీడాకారులు సోషల్ మీడియాలో 8,000కిపైగా దుర్వినియోగకరమైన వ్యాఖ్యలు, పోస్టులు ఎదుర్కొన్నట్లు తెలిపింది. ఈ పోస్ట్‌లలో సుమారు 40 శాతం కామెంట్లు టెన్నిస్ బెట్టింగ్ లో డబ్బులు కోల్పోయిన వారి నుండి వచ్చాయని ఆమె తెలిపారు.
అయితే ఫ్రెంచ్ ఓపెన్ సిరీస్ సందర్భంగా మే 29న క్యారోల్ మొనెట్‌తో జరిగిన మొదటి రౌండ్ మ్యాచ్ సందర్భంగా ఆమె బెదిరింపులు ఎదుర్కొన్నాట్టు తెలిపారు. ఈ మ్యాచ్‌లో కేటీ బౌల్టర్ మొదటి సెట్‌ను టై బ్రేక్‌లో గెలిచి, తర్వాత మ్యాచ్‌ను 6-4, 6-1 తేడాతో ముగించింది. అయితే మ్యాచ్ తర్వాత సోషల్ మీడియాలో తాను టార్గెట్‌గా వచ్చిన కామెంట్స్‌పై ఆమె అసంతృప్తి వ్యక్తం చేసింది.
మ్యాచ్ తర్వాత కొందరు బెట్టింగ్ గ్యాంబ్లర్లు చేసిన మెసేజెస్ తనను తీవ్రంగా కలిచివేశాయని ఆమె తెలిపిపారు. ఆమెకు వచ్చిన మెసేజ్‌లు పరిశీలిస్తే.. నీకు క్యాన్సర్ రావాలని ఆశిస్తున్నానని ఒకరు మెసేజ్ చేయగా..”రేపటిలోపు మీ అమ్మమ్మ సమాధిని ధ్వంసం చేస్తామని మరోకరు రాసుకొచ్చినట్టు ఆమె తెలిపారు. మరో మీ కుటుంబం మొత్తాన్ని సెవపేటికలో వేయాలని కోరుకుంటున్నానని రాసుకొచ్చినట్టు ఆమె తెలిపారు. ఈ మెసేజ్‌లకు సంబంధించిన స్క్రీన్ షాట్‌లను ఆమెకు మీడియా వేదికగా అందరికీ చూపించారు. ఈ తరహా ఆన్‌లైన్ బెదిరింపుల వల్ల యువ క్రీడాకారులపై పడే ప్రభావం తీవ్రంగా ఉంటుందని, ఇది వారిని మానసిక ఒత్తిడికి గురిచేస్తుందని ఆమె తెలిపారు.
మరిన్ని అంతర్జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..
