AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

ఒకే ఒక్క పంచ్.. 46 సెకన్లలో ముగిసిన మ్యాచ్.. మహిళా బాక్సర్‌తో పురుషుడి పోటీ.. ఒలింపిక్స్‌లో కొత్త వివాదం..

Paris Olympics 2024: ఇటాలియన్ బాక్సర్ ఏంజెలా కారినీ 66 కిలోల వెల్టర్ వెయిట్ విభాగంలో అల్జీరియన్ బాక్సర్ ఇమాన్ ఖలీఫ్‌తో తలపడింది. కానీ మ్యాచ్ ప్రారంభమైన కేవలం 46 సెకన్లలో ఇటలీ బాక్సర్ ఏంజెలా కారినీ పోటీ నుంచి వైదొలిగింది. పురుషుడిలా శారీరక లక్షణాలున్న ఇమాన్ ఖలీఫా మహిళా కంటెస్టెంట్‌తో పోటీకి దిగడమే ఇందుకు ప్రధాన కారణం.

ఒకే ఒక్క పంచ్.. 46 సెకన్లలో ముగిసిన మ్యాచ్.. మహిళా బాక్సర్‌తో పురుషుడి పోటీ.. ఒలింపిక్స్‌లో కొత్త వివాదం..
Italian Women Boxer Angela Carini
Venkata Chari
|

Updated on: Aug 02, 2024 | 12:36 PM

Share

Gender Eligibility Controversy: పారిస్ ఒలింపిక్స్ 2024లో బాక్సింగ్ మ్యాచ్ చాలా వివాదాలకు నిలయమైంది. మహిళల వెల్టర్‌వెయిట్‌ ప్రిక్వార్టర్‌ ఫైనల్‌లో ఇటాలియన్‌ బాక్సర్‌ ఏంజెలా కారినీ, అల్జీరియా బాక్సర్‌ ఇమాన్‌ ఖెలీఫ్‌ మధ్య పోరుతో ఈ వివాదం తలెత్తింది. వాస్తవానికి, ఏంజెలా కారిని మ్యాచ్‌ను మధ్యలోనే నిష్క్రమించింది. ఇమాన్ ఖలీఫ్ 46 సెకన్లలో మ్యాచ్‌ను గెలిచింది. ఆ తర్వాత పురుష బాక్సర్‌కు పోటీగా మహిళా బాక్సర్‌ను రంగంలోకి దింపారంటూ ఆరోపణలు వచ్చాయి. ఇప్పుడు ఈ అంశంపై అంతర్జాతీయ ఒలింపిక్ కమిటీ నుంచి కీలక ప్రకటన వెలువడింది.

మహిళా బాక్సర్‌కు పురుషుడితో మ్యాచ్ నిర్వహించారా?

వాస్తవానికి, అల్జీరియన్ బాక్సర్ ఇమాన్ ఖలీఫ్ గతంలో కూడా లింగమార్పిడి వివాదాల్లో చిక్కుకుంది. 2023 బాక్సింగ్ ప్రపంచ ఛాంపియన్‌షిప్‌లో గోల్డ్ మెడల్ మ్యాచ్‌కు కొన్ని గంటల ముందు మాన్ ఖలీఫ్ లింగమార్పిడి కారణాలతో అనర్హుడయింది. అయితే 2024 ఒలింపిక్స్‌లో ఆడేందుకు అంతర్జాతీయ ఒలింపిక్ కమిటీ అంటే ఐఓసీ ఇటీవలే అతనికి అనుమతి ఇచ్చింది. మొదటి రౌండ్ మ్యాచ్ తర్వాత, ఈ వివాదం మళ్లీ తెరపైకి వచ్చింది. మాన్ ఖలైఫ్ మహిళల విభాగంలో ఆడటం తప్పు అంటూ చాలా మంది అభిప్రాయపడ్డారు. బ్రిటన్ మాజీ బాక్సర్ ఆంథోనీ ఫౌలర్ దీనిని ఖండించారు.

అంతర్జాతీయ ఒలింపిక్ కమిటీ వివరణ..

పారిస్ 2024 ఒలింపిక్ క్రీడల బాక్సింగ్ టోర్నమెంట్‌లో పాల్గొనే అథ్లెట్లందరూ పోటీ అర్హత, ప్రవేశ నియమాలకు, అలాగే పారిస్ 2024 బాక్సింగ్ యూనిట్ (PBU) సెట్ చేసిన నిబంధనలకు లోబడి ఉంటారని ఇప్పుడు అంతర్జాతీయ ఒలింపిక్ కమిటీ ఒక ప్రకటన విడుదల చేసింది. వైద్య నియమాలను పాటించాం. మునుపటి ఒలింపిక్ బాక్సింగ్ పోటీలవలె, అథ్లెట్ల లింగం, వయస్సు వారి పాస్‌పోర్ట్‌లపై ఆధారపడి ఉంటుందని పేర్కొంది.

ఇవి కూడా చదవండి

PBU పారిస్ 2024 కోసం నియమాలను రూపొందించడానికి టోక్యో 2020 బాక్సింగ్ నియమాలను బేస్‌లైన్‌గా ఉపయోగించింది. అథ్లెట్ల సన్నాహాలపై ప్రభావాన్ని తగ్గించడం, ఒలింపిక్ క్రీడల మధ్య కొనసాగింపునకు హామీ ఇవ్వడం దీని ఉద్దేశ్యం.

ఆరోపణలను కొట్టేసిన IOC..

పారిస్ 2024 ఒలింపిక్ గేమ్స్‌లో పోటీపడుతున్న ఇద్దరు మహిళా అథ్లెట్ల గురించి కొన్ని నివేదికలలో తప్పుదారి పట్టించే సమాచారాన్ని చూశామని అంతర్జాతీయ ఒలింపిక్ కమిటీ తన ప్రకటనలో తెలిపింది. ఇద్దరు అథ్లెట్లు ఒలింపిక్ గేమ్స్ టోక్యో 2020, ఇంటర్నేషనల్ బాక్సింగ్ అసోసియేషన్ (IBA) ప్రపంచ ఛాంపియన్‌షిప్‌లు, IBA మంజూరు చేసిన టోర్నమెంట్‌లతో సహా అనేక సంవత్సరాలుగా మహిళల విభాగంలో అంతర్జాతీయ బాక్సింగ్ టోర్నమెంట్‌లలో ఆడుతున్నారు.

మరిన్ని క్రీడా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..