Paris Olympics: ఎవడ్రా సామీ.. సింపుల్‌గా వచ్చి పతకం పట్టేశాడు.. ఇంటర్నెట్ సెన్సెషన్‌గా మారిన టర్కిష్ అథ్లెట్
Turkey Athlete Won Medal Without Specialised Equipment: ప్రతి నాలుగు సంవత్సరాలకు ఒకసారి ఒలింపిక్స్ నిర్వహిస్తున్న సంగతి తెలిసిందే. అయితే, ఈ గేమ్స్‌లో అనేక స్ఫూర్తిదాయకమైన కథలు కూడా కనిపిస్తుంటాయి. ఒక ఆటగాడు పతకం గెలిస్తే ప్రపంచం మొత్తం అతనిని మెచ్చుకుంటుంది. కానీ, ఆ పతకానికి సంబంధించిన కథ కూడా ఒక్కోసారి చాలా ఆసక్తికరంగా ఉంటుందనడంలో ఎలాంటి సందేహం లేదు.

పారిస్ ఒలింపిక్స్ 2024లో రజత పతకాన్ని గెలుచుకున్న ఓ అథ్లెట్ గురించి ఇప్పుడు తెలుసుకుందాం.. ప్రస్తుతం అతను ప్రపంచ వ్యాప్తంగా చర్చనీయాంశం అవుతున్నాడు. 10 మీటర్ల ఎయిర్ పిస్టల్ మిక్స్‌డ్ టీం ఈవెంట్‌లో తన భాగస్వామి సెవ్వల్ ఇలయదా తర్హాన్‌తో కలిసి రజత పతకాన్ని గెలుచుకున్న టర్కీ షూటర్ యూసుఫ్ డికేచ్ గురించి మాట్లాడుతున్నాం..
టర్కీ షూటర్ అద్భుత ప్రదర్శన..
యూసుఫ్ డికెచ్ తన దేశం నుంచి ఈ ఒలింపిక్స్‌కు ప్రత్యేక సామగ్రిని పొందలేదనే చర్చ జరుగుతోంది. నివేదికల ప్రకారం, యూసుఫ్ డికేచ్ వద్ద షూటింగ్‌కు అవసరమైన చాలా పరికరాలు లేవు. అతనికి ప్రత్యేకమైన గాగుల్స్, పొగమంచు రాకుండా ఉండేందుకు లెన్స్‌లు, శబ్దం రాకుండా చెవికి రక్షణ కూడా లేవు. ఇవేమీ లేకుండా షూటింగ్ బరిలో నిలిచి రజత పతకాన్ని కైవసం చేసుకున్నాడు. ఈ కారణంగానే ఆయనపై ప్రశంసలు వెల్లువెత్తుతున్నాయి.
దక్షిణ కొరియా తన ఆటగాళ్లను పూర్తి కిట్‌తో షూటింగ్‌కు పంపింది. టర్కీ 51 ఏళ్ల అథ్లెట్‌ను ప్రత్యేక లెన్స్‌లు లేకుండా పంపించింది. కానీ, రజత పతకాన్ని గెలుచుకుని, సత్తా చాటాడు.
ఒలింపిక్స్‌లో అథ్లెట్ల గురించి చాలా ఆసక్తికరమైన కథనాలు వినిపిస్తున్నాయి. యూసఫ్ డికెచ్ కూడా ఈ ఫీట్‌తో తనకంటూ ఓ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నాడు. ఇంటర్నెట్‌లో అతని గురించి చాలా చర్చలు జరుగుతున్నాయి. ఈ ఈవెంట్‌లో భారత జోడీ మను భాకర్, సరబ్జోత్ సింగ్ కాంస్య పతకాన్ని గెలుచుకున్నారనే సంగతి తెలిసిందే.
మరిన్ని క్రీడా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..