Tokyo Olympics: ఒలింపిక్స్‌లో పతకం సాధించే పోటీదారులలో భారత హాకీ జట్టు ఒకటి: వెటరన్ కోచ్ రోలెంట్ ఓల్ట్‌మన్స్

జులై-ఆగస్టులో జరగబోయే టోక్యో ఒలింపిక్స్‌ లో పతకం కోసం పోటీ పడే దేశాల్లో భారత పురుషుల హాకీ జట్టు తప్పకుండా ఉంటుందని మాజీ కోచ్ రోలెంట్ ఓల్ట్‌మన్స్‌ ధీమా వ్యక్తం చేశారు.

Tokyo Olympics: ఒలింపిక్స్‌లో పతకం సాధించే పోటీదారులలో భారత హాకీ జట్టు ఒకటి: వెటరన్ కోచ్ రోలెంట్ ఓల్ట్‌మన్స్
Tokyo Olympics
Follow us
Venkata Chari

|

Updated on: Jun 16, 2021 | 5:18 PM

Tokyo Olympics: జులై-ఆగస్టులో జరగబోయే టోక్యో ఒలింపిక్స్‌ లో పతకం కోసం పోటీ పడే దేశాల్లో భారత పురుషుల హాకీ జట్టు తప్పకుండా ఉంటుందని మాజీ కోచ్ రోలెంట్ ఓల్ట్‌మన్స్‌ ధీమా వ్యక్తం చేశారు. ఒలింపిక్స్‌కు ముందు హాకీ ఇండియా ప్రారంభించిన పోడ్‌కాస్ట్ సిరీస్‌ ‘హాకీ టే చర్చా’ కార్యక్రమంలో ఆయన పాల్గొని పై విధంగా పేర్కొన్నారు. అలాగే టోక్యోలో ఏ జట్టైనా విజయం సాధించేందుకు అవకాశం ఉందని, ఇందుకోసం వారు మానసికంగా ధృడంగా ఉండాలని పేర్కొన్నారు. “టోక్యోలో పతకం సాధించేందుకు పోటీ పడే మొదటి ఐదు దేశాల్లో భారతదేశం ఉంటుంది. గత రెండేళ్లుగా ప్రపంచంలోని అత్యుత్తమ జట్లతో పోటీపడుతోంది. ప్రస్తుతం ఈ జట్టు మంచి నిలకడను ప్రదర్శిస్తోంది” అని ఆయన పేర్కొన్నారు. ఒత్తిడి కారణంగా అనవసరమైన భయాందోళనలకు గురయ్యే అవకాశం ఉందని, మ్యాచ్‌కు ముందు ప్రశాంతంగా ఉండాలని ఆటగాళ్లకు సూచించాడు. “ఆస్ట్రేలియా, బెల్జియం, నెదర్లాండ్స్ వంటి జట్లను ఓడించే సత్తా భారత్ కు ఉందని ఇప్పటికే రుజువైంది. అయితే, ఒలింపిక్స్‌లో ఆయా దేశాలను ఓడించడంపై సమాలోచనలు చేయాలని’ ఆయన పేర్కొన్నారు.

ఆటలో ప్రతీక్షణం చాలా ముఖ్యమని, ఆటలో వెనుకపడితే ముందుకు వెళ్లలేరు. అందుకే ప్రతీ పరిస్థితిని అదుపులో ఉంచుకోవాలని ఆయన కోరారు. టోక్యోలోని వాతావరణ పరిస్థితులు భిన్నంగా ఉంటాయని, త్వరగా అక్కడి వాతావరణానికి అలవాటు పడేందుకు ప్రయత్నించాలని సూచించారు. ఇతర దేశాలతో పోల్చితే వాతావరణ పరిస్థితులు భారతదేశానికి ఎంతో అనుకూలంగా ఉంటాయని ఆయన వెల్లడించాడు. 2016 రియో ​​ఒలింపిక్స్‌లో భారత్ క్వార్టర్ ఫైనల్‌కు చేరుకున్నప్పుడు ఓల్ట్‌మన్స్ ప్రధాన కోచ్‌గా ఉన్నారు. అప్పటి నుంచి జట్టు బాగా రాణిస్తోందని ఆయన అభిప్రాయపడ్డారు. కాగా, 1980 నుంచి భారతదేశం హాకీలో ఒలింపిక్ పతకం సాధించలేదు.

Also Read:

Tokyo Olympics: భారతదేశ తొలి ‘స్కేటర్‌ గర్ల్‌’… అతితా వర్గీస్! నెట్‌ఫ్లిక్స్‌లో ట్రెండ్ అవుతోన్న ఆమె స్ఫూర్తి గాధ!

Olympic Games: సమ్మర్ ఒలింపిక్స్‌ మొత్తం పతకాల్లో భారత్ గెలిచింది కేవలం 0.17 శాతమే!