Tokyo Olympics: భారతదేశ తొలి ‘స్కేటర్‌ గర్ల్‌’… అతితా వర్గీస్! నెట్‌ఫ్లిక్స్‌లో ట్రెండ్ అవుతోన్న ఆమె స్ఫూర్తి గాధ!

టోక్యో ఒలింపిక్స్‌లో స్కేట్ బోర్డ్ ఈవెంట్ ప్రవేశపెట్టిన సంగతి తెలిసిందే. ఈ సందర్భంగా ఇండియాలో మొదటి మహిళా స్కేట్ బోర్డర్ అతితా వర్గీస్ గురించి, ఈమె భారత్‌లో ఈ క్రీడకు ప్రాణం ఎలా పోసిందో చూద్దాం..

Tokyo Olympics: భారతదేశ తొలి 'స్కేటర్‌ గర్ల్‌'... అతితా వర్గీస్! నెట్‌ఫ్లిక్స్‌లో ట్రెండ్ అవుతోన్న ఆమె స్ఫూర్తి గాధ!
Atita Verghese
Follow us

|

Updated on: Jun 16, 2021 | 4:17 PM

Tokyo Olympics: టోక్యో ఒలింపిక్స్‌లో స్కేట్ బోర్డ్ ఈవెంట్ ప్రవేశపెట్టిన సంగతి తెలిసిందే. ఈ సందర్భంగా ఇండియాలో మొదటి మహిళా స్కేట్ బోర్డర్ అతితా వర్గీస్ గురించి, ఈమె భారత్‌లో ఈ క్రీడకు ప్రాణం ఎలా పోసిందో చూద్దాం. నెట్‌ఫ్లిక్స్‌లో తాజాగా విడుదలైన, స్కేటర్‌ గర్ల్‌ సినిమా.. భారతదేశం నుంచి స్కేట్‌ బోర్డింగ్‌పై వచ్చిన మొట్టమొదటి సినిమాగా గుర్తింపు తెచ్చుకొంది. రాజస్థాన్‌ లోని ఒక గ్రామానికి చెందిన ఓ అమ్మాయి జీవితాన్ని ఈ సినిమాలో చూపించారు. స్కేట్‌ బోర్డింగ్‌లో ప్రతిభ కలిగిన ఈ అమ్మాయి జాతీయ టోర్నమెంట్‌లో పాల్గొనేందుకు పేదరికంతో పాటు లింగ వివక్షతో పోరాడుతుడడం చక్కగా చూపించారు. ఈ స్ఫూర్తితో ప్రస్తుతం దేశ వ్యాప్తంగా 3,000 నుంచి 4,000 మంది పిల్లలు, యువత ఈ గేమ్‌ ఆడేందుకు ఆసక్తి చూపిస్తున్నారనండంలో సందేహం లేదు.

గర్ల్స్‌ స్కేట్ ఇండియా అనే ప్రోగ్రాంతో అనేక మంది బాలికలను తయారు చేసేందుకు ప్రయత్నాలు చేస్తోంది అతితా వర్గీస్. ఈమె భారత దేశం యొక్క మొట్టమొదటి ప్రొఫెషనల్ మహిళా స్కేట్‌ బోర్డర్. బెంగళూరుకు చెందిన అతితా.. చిన్నప్పటినుంచి ఈ ఆటపై ఇష్టంతో ముందుకు సాగుతోంది. ఇందులోనే తన ఆనందాన్ని వెతుక్కొంటోంది. ఈమె ఎంతో మంది అమ్మాయిలను స్కేటింగ్ క్రీడలో రాణించేలా శిక్షణ ఇస్తోంది. ఈమె జీవితం ఆధారంగానే ‘స్కేటర్ గర్ల్‌’ సినిమా తీశారు.

‘స్కేటర్ గర్ల్‌ వర్గీస్‌ కథ కాదని, ఈ సినిమాలో చాలామంది స్కేటర్లతో కలిసి అతిధి పాత్రలో నటించానని’ అతితా వర్గీస్ పేర్కొంది. అమ్మాయిలు ఈ క్రీడలో రాణించేందుకు మన దేశంలో సరైన సదుపాయాలు లేవని, అమ్మాయిలకు సరైన ప్రోత్సాహం కూడా లభించడం లేదని వాపోయింది ఈ 27 ఏళ్ల బెంగళూరు యువతి.

మొదటిసారి అతితా వర్గీస్ స్కేట్ బోర్డుపై అడుగుపెట్టినప్పుడు ఆమె వయసు 19 సంవత్సరాలు. అది కూడా ఆమె స్నేహితురాలు ఇచ్చిన స్కేటింగ్ బోర్డుపై చక్కర్లు కొట్టి, తన కోరిక నెరవేర్చుకొంది. దీంతో ఇక స్కేటింగే తన లైఫ్‌ గా ఫిక్సయింది. ఆ టైంలో భారతదేశంలో కనీసం 10 మంది మహిళా స్కేటర్లు కూడా లేరు.

ప్రస్తుతం వర్గీస్ స్కేట్ బోర్డింగ్‌లో బాలికలు రాణించేందుకు చాలా ప్రయత్నాలు చేస్తోంది. ఇండియాలో ప్రస్తుతం నాలుగు స్కేట్ పార్కులతో పాటు మరికొన్ని స్కేట్ స్పాట్లను నిర్మించింది. కొత్తవారికి ఈ గేమ్‌ను నేర్పిస్తోంది. భూగర్భంలో కూరుకపోయిన ఈ ఆటను అతితా వర్గీస్ బాలికల చెంతకు తెచ్చేందుకు కీలక పాత్రను పోషిస్తోంది. ఈమె చేస్తున్న కృషికి గాను 2018లో అమెరికన్‌ స్కేట్ బోర్డింగ్ బ్రాండ్ వాన్స్‌ అథ్లెట్ల జట్టులో చోటు దక్కింది. ఈ జట్టులో చేరిన మొట్టమొదటి భారతీయురాలు కూడా అతితా వర్గీసే కావడం విశేషం.

ఈమె 2015 నుంచి, గర్ల్ స్కేట్ ఇండియా అనే ఆన్‌లైన్ ప్లాట్‌ఫామ్‌ను నడిపిస్తోంది. ఇందులో స్కేట్ బోర్డింగ్‌ వర్క్‌షాపులపై ప్రత్యేక క్లాసులు నిర్వహిస్తోంది. అలాగే వేర్వేరు నేపథ్యాల నుంచి వచ్చిన బాలికలు, యువతుల కోసం స్పెషల్ టూర్స్‌ చేపడుతోంది. ఐటీ నగరమైన బెంగళూరులో, అలాగే మురికి రోడ్లతో నిండిన మధ్యప్రదేశ్‌లోని గ్రామమైన జాన్వర్‌లో కూడా అతితా వర్గీస్ అమ్మాయిలకు వర్క్ షాపులు నిర్వహిస్తోంది. ఎంతోమంది అమ్మాయిలను ఈ క్రీడలోకి తీసుకొచ్చేందుకు ప్లాన్ చేస్తోంది.

“బెంగళూరులో అమ్మాయిలను స్కేట్ పార్కులకు పంపేందుకు తల్లిదండ్రులు బాగానే ఆసక్తి చూపిస్తున్నారు. కానీ, స్కేట్ పార్కుల్లో ఎక్కువ సమయం గడిపేందుకు మాత్రం ఒప్పుకోవడం లేదు. ఈ ఆటలో ప్రాక్టీస్ చాలా అవసరం. ప్రాక్టీస్ లేకుండా ఈ ఆటలో రాణించడం చాలా కష్టమని” వర్గీస్ పేర్కొంది. వర్గీస్ ప్రస్తుతం గోవాలో ఉంది.

” మేము జాన్వార్‌లోని ప్రతి ఇంటికీ వెళ్లి బాలికలను స్కేల్ పార్క్‌కు పంపించమని తల్లిదండ్రులను ఒప్పించేందుకు ప్రయత్నిచాం. వాస్తవానికి చెప్పాలంటే వారిని వేడుకున్నాం. కానీ, ‘ఇంట్లో రోటీలు ఎవరు చేస్తారని?’ వారు మమ్మల్నే ప్రశ్నించారు. ఎలాగోలా కొంతమంది తల్లిదండ్రులను ఒప్పించి 40 మంది అమ్మాయిలను స్కేట్ పార్కులోకి తీసుకొచ్చాం. దాదాపు రెండు గంటలపాటు స్కేట్ పార్కులో గడిపేలా చేశాం. అయితే, అమ్మాయిల స్కేటింగ్ చూసేందుకు చాలామంది తల్లిదండ్రులు పార్క్ వద్దకు చేరుకోవడం మేం గమనించాం. చెక్క పలకలపై అమ్మాయిలు గాలిలో తేలిపోవడం చూసి వారు ఎంతో సంతోషించా”రని వర్గీస్ పేర్కొంది.

కేరళలోని కోవలం స్కేట్ క్లబ్‌లో కూడా ఇలాంటి పరిస్థితే ఎదురైంది. ఇక్కడికి వర్గీస్ 2015లో మొట్టమొదటి మహిళా స్కేట్ బోర్డింగ్ పర్యటనలో భాగంగా యువతులకు శిక్షణనిచ్చేందుకు వచ్చింది. అయితే ఇక్కడి వారు ఒకరి చెవిలో ఇంకొకరు ఏవో చెప్పుకుంటే వ్యగ్యంగా నవ్వడం కనిపించిందని వర్గీస్ వెల్లడించింది. వారిని ఆపడం కూడా చాలా కష్టమైందని ఈ సందర్భంగా గుర్తు చేసుకుంది.

అయితే, సమీపంలోని ఒక ఫిషింగ్ కమ్యూనిటీ నుంచి ఇద్దరు టీనేజ్ అమ్మాయిలు ఈ క్లబ్‌లో చేరారు. వారి కోచ్‌ వినీత్‌ విజయన్‌తోపాటు వారు చాలా కష్టపడ్డారని, అనంతరం వీరు జాతీయ స్థాయిలో బంగారు పతకాలు కూడా సాధించారని ఆమె పేర్కొంది. అలాగే వీరు స్కేటర్ గర్ల్ సినిమాలో కూడా కనిపిస్తారని తెలిపింది.

అయితే బాలికల భవిష్యత్ పై వారి కోచ్ విజయన్ ఆందోళన చెందుతున్నాడు. కారణం, బాలికల తల్లిదండ్రులు వారిని ఎంతకాలం స్కేటింగ్ చేసేందుకు ఒప్పుకుంటారో అతనికి కూడా ఖచ్చితంగా తెలియదు. ఈ ఇద్దరు అమ్మాయిలు జాతీయ స్థాయి బంగారు పతకాలు సాధించినప్పటికీ.. వారి తల్లిదండ్రులు ఏమంటారోనని ఆందోళన వ్యక్తం చేస్తున్నాడు. “బాలికలు యుక్తవయసుకు వచ్చారని, ప్రస్తుతం వారు ఇంట్లో ఉండి వంటగదిలో సహాయం చేస్తారని భావిస్తున్నామని, ఇలాగే వారు ఆటలంటూ తిరిగితే వారికి భర్తను వెతకడం చాలా కష్టమవుతుందని” బాలికల తల్లిదండ్రులు చెప్పినట్లు ఆయన పేర్కొన్నారు.

మరోవైపు, వర్గీస్ తల్లి క్రీడలను ప్రేమిస్తోంది. అందుకే వర్గీస్‌ను ఎంతగానో ప్రోత్సహించి ఈ స్థాయికి చేర్చింది. ఓటమి చెందినా.. కుమార్తెను కౌగిలించుకుని ధైర్యం చెబుతోంది.

తొమ్మిదేళ్లుగా స్కేటింగ్‌లో వర్గీస్ కొనసాగుతోంది. కానీ, ఏ టోర్నమెంట్‌లో ఆమె పోటీచేయడం మనం వినలేదు. ” నేను స్కేటింగ్ మొదలుపెట్టినప్పుడు భారత్‌లో ఇటువంటి క్రీడల్లో టోర్నమెంట్స్‌ నిర్వహించలేదు. అందుకే ఈ గేమ్‌ను నేను ఎప్పుడూ పోటీగా అనుకోలేదు. నా ఆనందం కోసమే ఈ ఆటలో కొనసాగుతున్నాను. అలాగే స్కేటింగ్‌ను ఇండియాలో అభివృద్ధి చేసేందుకు పలు రకాలుగా ప్రయత్నాలు మొదలు పెట్టాను” అని వర్గీస్ పేర్కొంది.

ఈ ఏడాది టోక్యోలో జరిగే సమ్మర్ ఒలింపిక్స్‌లో స్కేట్‌బోర్డింగ్ ఆటను చేర్చారు. “ఒలింపిక్స్ లో చాలా పోటీ ఉంటుంది. ఇప్పటికీ మన దేశంలో సరైన మౌళిక సదుపాయాలు లేవని” వర్గీస్ ఆవేదన వ్యక్తం చేసింది.

“నేను మరిన్ని ఉచిత స్కేట్‌ బోర్డింగ్ వర్క్‌షాప్‌లను నిర్వహించాలనుకుంటున్నాను. కానీ, నగరాలు, పట్టణాల్లో సరైన స్కేట్ పార్కులు లేవు. కొన్ని ఉన్నా వాటి అద్దె చాలా ఖరీదుతో కూడుకుంది. ఈ ఖర్చును స్పాన్సర్‌షిప్ లేకుండా నేను భరించలేను ”అని వర్గీస్ వెల్లడించింది.

రోలర్ స్కేటింగ్ ఫెడరేషన్‌ ఆఫ్ ఇండియా (ఆర్‌ఎస్‌ఎఫ్‌ఐ) తరపును అథ్లెట్లను అయోవా, రోమ్‌ లో జరిగే ఒలింపిక్‌ క్వాలిఫయర్స్‌కు పంపాల్సి ఉంది. కానీ, కరోనా మహమ్మారితో అదీ జరగలేదు.

ఏప్రిల్‌ 2021లో ఛండీగడ్‌లో జరిగిన జాతీయ క్వాలిఫైయర్స్‌కు న్యాయమూర్తిగా పనిచేసిన స్కేట్‌ బోర్డింగ్‌ కోచ్‌ అనుభావ్‌ విజయవర్గియా మాట్లాడుతూ..” దాదాపు 120 మంది స్కేట్ బోర్డర్లు జాతీయ క్వాలిఫైయర్స్‌లో పాల్గొనేందుకు వచ్చారు. వీరిలో 9 నుంచి 26 సంవత్సరాల మధ్య వయస్సుగలవారు ఉన్నారు. ప్రస్తుతం కరోనా సెకండ్ వేవ్‌ తో విమానాలు నిలిపేశార”ని అన్నాడు.

కరోనా సెకండ్‌ వేవ్‌తో ఇండియాలో బహిరంగంగా క్రీడలు ఆడేందుకు బ్రేకులు పడ్డాయి. దీంతో స్కేట్ బోర్డింగ్‌ సంఘం చాలా ఆందోళన చెందుతోంది. ” కోవిడ్‌తో మేము కోవలం స్కేట్ క్లబ్‌ను రెండు లేదా మూడు నెలలు మాత్రమే ఓపెన్ చేశామ”ని విజయవర్గియా ఆవేదన చెందాడు.

మరోవైపు “స్కేట్ బోర్డింగ్‌లో మెరుగ్గా ఆడేందుకు వేర్వేరు ప్రదేశాలు ప్రయాణించాలి. అలాగే వేర్వేరు స్కేట్‌ బోర్డర్లతో స్కేటింగ్ చేయాలి” అని వర్గీస్ పేర్కొంది. అమ్మాయిలు తమను తాము విశ్వసించాలని కోరుకుంటున్నానని వర్గీస్ తెలిపింది.

క్రీడలలో బాలికలు..

2020 బీబీసీ ఓ సర్వే నిర్వహించింది. ఈ సర్వేలో 30% కంటే తక్కువ మంది భారతీయ మహిళలు ఏ క్రీడలైనా ఆడేందుకు ఆసక్తి చూపగా, 69 శాతం మంది పాఠశాల తర్వాత క్రీడలను పూర్తిగా వదిలేశారు. ఒంటరిగా ఉన్న మహిళలతో పోలిస్తే.. వివాహం, విడాకులు తీసుకున్న మహిళలు చాలా తక్కువ ఆసక్తి చూపిస్తున్నట్లు తెలుస్తోంది.

సర్వేలో పేర్కొన ప్రధాన కారణాలను పరిశీలిస్తే.. మనదేశంలో బాలికలను క్రీడల్లోకి పంపించేందుకు ఇంకా చాలామంది తల్లిదండ్రులు సముఖంగా లేరని ఆమె ఆందోళన వ్యక్తం చేస్తోంది. ముఖ్యంగా తల్లిదండ్రులు చెప్పే విషయాలను పరిశీలిస్తే.. బాలికలను ఆరుబయట ఉంచడం సురక్షితంగా కాదని కొందరంటే, కొన్ని నెలలు వారిని ఆటలకోసం బయటకు పంపలేమని మరికొందరు అంటున్నారు. అలాగే బాలుర కంటే బాలికలు శారీరకంగా బలహీనంగా ఉంటారనేది ప్రముఖంగా పలువురు వెల్లడిస్తున్నారు.

18 శాతం మంది మహిళల క్రీడలను చూసేందుకు ఆసక్తి చూపిస్తున్నారు. ఇక పురుషుల క్రీడల విషయానికి వస్తే.. 24 శాతం మంది ఇష్టపడుతున్నారు. అలాగే 30 శాతం మంది మహిళల క్రీడలను చూసేందుకు ఇష్టపడడంలేదు. ఎందుకంటే మహిళల గేమ్స్‌ ఆసక్తికరంగా ఉండడం లేదని తమ అభిప్రాయాలను వెల్లడించారు. 80 శాతం మంది అంతర్జాతీయ స్థాయిలో రాణించే మహిళా క్రీడాకారుల పేర్లు చెప్పలేకపోతున్నారు.

ఈ సందర్భంగా స్పోర్ట్స్‌ విలేజ్ స్కూల్స్ హెడ్ క్రిష్ అయ్యంగార్ మాట్లాడుతూ… కుటుంబాలు క్రీడల్లో విలువలను నమ్మడం ప్రారంభిస్తేనే.. ఎక్కువమంది అమ్మాయిలను గేమ్స్‌ల్లోకి తీసుకరావొచ్చు. తల్లిదండ్రులు బాలికలపై ఎక్కువగా ఆందోళన చెందడంతోనే ఇలాంటి వివక్ష కొనసాగుతోందని ఆయన అభిప్రాయపడ్డాడు. స్పోర్ట్స్‌ విలేజ్ స్కూల్స్ భారతదేశంలోని 1000 ప్రభుత్వ పాఠశాలతోపాటు 500 ప్రైవేట్ పాఠశాలలకు ఫిజికల్ ఎడ్యుకేషన్ (శారీరక విద్య) అందిస్తోంది.

పాఠశాలల స్థాయిలో క్రీడలకు సంబంధించి మౌలిక సదుపాయాలను కల్పించేందుకు పెట్టుబడులు పెట్టాలని, ఖేలో ఇండియా యూత్ గేమ్స్ వంటి కార్యక్రమాలను జరిపించాల్సిన అవసరం ఉందని అయ్యంగార్ పేర్కొన్నారు. అన్నింటికంటే ముఖ్యంగా బాలికలు శిక్షణ ఇచ్చేందుకు ఎక్కువమంది మహిళా కోచ్‌లు ఉండాల్సిన అవసరం ఉంది. వారిని రోల్ మోడల్స్‌గా చూసైనా ఎక్కువమంది బాలికలు క్రీడలపై ఆసక్తిని పెంచుకుంటారని ఆయన తెలిపారు.

Also Read:

Olympic Games: సమ్మర్ ఒలింపిక్స్‌ మొత్తం పతకాల్లో భారత్ గెలిచింది కేవలం 0.17 శాతమే!

Footwork Challenge: ‘మాలో ఎవరు బాగా చేశారని’ క్రికెటర్ చాహల్ ప్రశ్న? కపుల్ ఫుట్ వర్క్ ఛాలెంజ్‌ వీడియోతో ఆకట్టుకున్న జోడీ!