Paul Pogba: మీడియా సమావేశంలో స్పాన్సరర్ హీనెకెన్ బీర్ బాటిల్ పక్కన పెట్టిన ఫ్రెంచ్ స్టార్ పాల్ పోగ్బా
Paul Pogba: యూరో కప్ సందర్భంగా నిర్వహిస్తున్న మీడియా సమావేశాలు ఇప్పుడు వైరల్ అవుతున్నాయి. అందుకు కారణం ఒక్కటే. ఈవెంట్ స్పాన్సరర్స్ గా ఉన్న కంపెనీల డ్రింక్ బాటిల్స్.
Paul Pogba: యూరో కప్ సందర్భంగా నిర్వహిస్తున్న మీడియా సమావేశాలు ఇప్పుడు వైరల్ అవుతున్నాయి. అందుకు కారణం ఒక్కటే. ఈవెంట్ స్పాన్సరర్స్ గా ఉన్న కంపెనీల డ్రింక్ బాటిల్స్. మొన్న రోనాల్డో కోకాకోలా బాటిల్స్ ను మీడియా సమావేశం సమయంలో తన టేబుల్ నుంచి తీసి పక్కకు పెట్టారు. ఈ వీడియో వైరల్ కావడమే కాకుండా కోకాకోలా కంపెనీకి వేలాది కోట్ల షేర్ మార్కెట్ నష్టాన్ని తెచ్చింది. ఇది ఇంకా సోషల్ మీడియాలో నలుగుతూనే ఉంది. ఈలోగా మరో క్రీడాకారుడు అటువంటి పని చేశాడు. ఫ్రెంచ్ స్టార్ మిడ్‌ఫీల్డర్ పాల్ పోగ్బా మీడియా సమావేశంలో తన ముందు ఉన్న హీనెకెన్ బీరు బాటిల్‌ను తీసి పక్కన పెట్టాడు. ఈ వీడియోను విని జానీ అనే ఆయన ట్విట్టర్ లో షేర్ చేశారు. దీంతో ఈ వీడియో వైరల్ గా మారింది. పాల్ పోగ్బా ఇస్లాంను అనుసరిస్తారు. దీంతో అతని ముందు ఉంచిన బీరు బాటిల్ పై ఆయన విముఖత ప్రదర్శించారు. అందుకే దానిని అక్కడి నుంచి తీసివేశారు. నిజానికి ఈ బాటిల్ ప్రసిద్ధ బీర్ బ్రాండ్ యొక్క ఆల్కహాల్ లేని వెర్షన్. అయినా 28 ఏళ్ల పాల్ పోగ్బా దానిని తీసివేశారు.
విని జానీ షేర్ చేసిన వీడియో ఇదే..
paul pogba hates heineken Don’t give Paul Pogba Heineken pic.twitter.com/4inexnnO3J
— Vini Johny28 (@ViniJohny28) June 15, 2021
”పాల్ పోగ్బా హీనెకెన్‌ను ద్వేషిస్తాడు పాల్ పోగ్బా హీనెకెన్‌ను ఇవ్వవద్దు” అంటూ ఈ వీడియో పోస్ట్ చేసిన విని జానీ దానికి క్యాప్షన్ ఇచ్చారు. అయితే, ఈ వీడియో పట్ల నెటిజన్లు రకరకాలుగా కామెంట్లు చేస్తున్నారు.
Putting an alcoholic beverage in front of a Muslim is straight disrespect… You can’t blame Pogba here
— يس (@Yassinov_Y) June 16, 2021
ఒక ముస్లిం ముందు ఆల్కహాల్ పానీయం పెట్టడం సూటిగా అగౌరవం … మీరు ఇక్కడ పోగ్బాను నిందించలేరు అని ఒకరు స్పందించారు.
Another silly stunt. More disregard for sponsors…
— Nurudeen Obalola (@NurudeenObalola) June 16, 2021
మరో వెర్రి స్టంట్. స్పాన్సర్‌లను మరింత విస్మరించడం … అంటూ ఒకాయన కామెంట్ పెట్టారు
ఇక రోనాల్డో కోకాకోలా విషయంలో కోకాకోలా స్పందించింది.. “ప్రతి ఒక్కరూ వారి పానీయ ప్రాధాన్యతలకు అర్హులు” అని కంపెనీ పేర్కొంది. మరి ఇప్పుడు హీనెకెన్ కంపెనీ ఈ ఫ్రెంచ్ స్టార్ చేసిన పనికి ఏ రకంగా స్పందిస్తుంది అనేది వేచి చూడాలి. ప్రస్తుతం ఈ వీడియో వైరల్ గా మారింది. కాగా, యూరోపియన్ ఛాంపియన్‌షిప్‌లో జర్మనీతో జరిగిన చివరి మ్యాచ్‌లో, పోగ్బా తన అద్భుతమైన గోల్ తొ జట్టుకు విజయాన్ని అందించారు. దీంతో ఆయనకు మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డ్ లభించింది.
రోనాల్డో వాటర్ బాటిల్ చూపించిన వీడియో ఇదే..
Aqua only. That’s right @Cristiano. Coke ugh ? pic.twitter.com/rTTs7jqrku
— ????? ??????? (@ayshardzn) June 15, 2021