AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

ఒకే ఒక్కడు.. సాటిలేని సాకర్‌ మాంత్రికుడు.. భాగ్యనగరంలో ‘మెస్సీ’ మెరుపు!

అర్జెంటీనా స్టార్ లియోన‌ల్ మెస్సీకి ఉన్న క్రేజ్ గురించి ఎంత చెప్పినా త‌క్కువే. గోల్ పోస్ట్‌లోకి బాల్‌ను పంపించే తీరు కళ్లు చెదిరే లెవెల్‌లో ఉంటుంది. అందుకనే అతని గేమ్‌స్టైల్‌కి వరల్డ్‌వైడ్‌గా కోట్లాది మంది ఫ్యాన్స్ ఉంటారు. ఆ రీజన్‌తోనే మెస్సీ ఏ టోర్నీలో ఆడినా సరే స్టేడియం ఇట్టే నిండిపోతుంది. అసలు టికెట్ సేల్స్ అయితే పదే పది నిమిషాల్లో హాట్ కేకుల్లా అమ్ముడుపోతాయి. ఎక్కడిదాకో ఎందుకు. మరికొన్ని గంటల్లో హైదరాబాద్‌లో ల్యాండ్ అవుతున్నారు కదా మెస్సీ. ఉప్పల్ స్టేడియంలో టికెట్ సేల్స్ మొదలయ్యాయి. మొత్తం 39వేల మంది కూర్చునే కెపాసిటీ ఉంది. ఇప్పటికే 20వేలకు పైగా టికెట్స్ అమ్ముడుపోయాయి. మిగిలినవి పాస్‌ల రూపంలో ఇచ్చేస్తున్నారు. అంటే.. గ్రౌండ్ హౌస్ ఫుల్. ఆ టికెట్ రేట్స్ కూడా కళ్లు చెదిరిపోతున్నాయి. అయినా సరే.. మెస్సీ నుంచి వచ్చే ఆ వైబ్రేషన్‌ను ఫీల్ అవడానికి కొనేస్తున్నారంతే..!

ఒకే ఒక్కడు.. సాటిలేని సాకర్‌ మాంత్రికుడు.. భాగ్యనగరంలో ‘మెస్సీ’ మెరుపు!
Messi Goat Tour Hyderabad
Balaraju Goud
|

Updated on: Dec 12, 2025 | 9:50 PM

Share

మెస్సీ వస్తున్నాడు.. మెస్సీ మన ప్లేయర్లతో ఆడబోతున్నాడు. సిటీస్ అన్నీ మెస్సీ ఫ్లెక్సీలతో నిండిపోతున్నాయ్. హూ ఈజ్ మెస్సీ. వై మెస్సీ. ఏంటీ ఫీవర్. దేనికంత క్రేజ్. ఇండియా వైడ్‌గా ఇప్పుడిదే టాపిక్. మెయిన్‌గా తెలుగు రాష్ట్రాలు.. పర్టిక్యులర్లీ హైదరాబాద్‌లో మెస్సీ మేనియాతో పూనకాలు తెచ్చుకుంటున్నారు. లిటరల్లీ.. ఇండియన్ ఫుట్‌బాల్ ఫ్యాన్స్‌కైతే ఆ పేరే ఓ వైబ్రేషన్. మెస్సీ.. నాట్ జస్ట్ ఏ నేమ్. ఇట్స్ ఏ బ్రాండ్. ఈ ఇంట్రస్టింగ్ ఫ్యాక్ట్ వినండొకసారి. 2022 ప్రపంచకప్‌లో అర్జెంటీనా టీమ్‌ను గెలిపించాడు మెస్సీ. అది డిసెంబర్ మంత్. అంతే.. ఇక ఆ నెలలో పుట్టిన ప్రతి 70 మంది పిల్లల్లో ఒకరికి మెస్సీ పేరే పెట్టుకున్నారు. దట్ మీన్స్.. వరల్డ్ వైడ్‌గా ఆ పేరు ఎంతలా కమ్మేసిందో చెప్పడానికిదో ఎగ్జాంపుల్. ఇంకో ఇంట్రస్టింగ్ ఫ్యాక్ట్.. అదే వరల్డ్‌కప్‌లో మెస్సీ వేసుకున్న ఆరు జెర్సీలను వేలానికి పెట్టారు. 65 కోట్ల రూపాయలు పెట్టి కొనుక్కున్నారు వాటిని. స్పోర్ట్స్ అండ్ గేమ్స్ హిస్టరీలో ఇదో సంచలనం. అన్‌బీటెడ్ రికార్డ్ కూడా. దటీజ్ మెస్సీ. ప్రపంచంలో ఏ దేశంలో మెస్సీ ఫుట్‌బాల్ ఆడుతున్నా సరే.. ఇసుకేస్తే రాలనంత జనం స్టేడియానికి పరిగెత్తుకొస్తారు. అదీ.. మెస్సీ లెవెల్. అలాంటి దిగ్గజ ఆటగాడు.. మరికొన్ని గంటల్లో హైదరాబాద్‌లో అడుగుపెడుతున్నారు. ఇంతకీ.. మెస్సీ రాక వెనక పర్పస్ ఏంటి? మెస్సీ టూర్‌తో మనకొచ్చే ప్రాఫిట్ ఏంటి? తెలుసుకుందాం..! ‘కింగ్ లియో’ అన్‌బిలీవబుల్ టాలెంట్.. ఇన్‌క్రెడిబుల్...

పూర్తి కథనాన్ని చదివేందుకు TV9 యాప్‌ని డౌన్‌లోడ్ చేయండి

ప్రత్యేకమైన కథనాలకు అపరిమితమైన యాక్సెస్ TV9 యాప్‌లో కొనసాగండి