ధోనిని ప్రధానిని చేద్దాం

ఐపీఎల్‌లో భాగంగా ఆదివారం బెంగళూరుతో జరిగిన మ్యాచ్‌లో 84పరుగులతో ధోని నాటౌట్‌గా నిలిచిన విషయం తెలిసిందే. అయితే ఆయన అంతగా శ్రమించినప్పటికీ ఒక్క పరుగు తేడాతో చెన్నై ఓడిపోయింది. ఈ నేపథ్యంలో నెటిజన్లు విభిన్నంగా స్పందిస్తున్నారు. మహేంద్ర సింగ్ ధోనిని దేశానికి ప్రధాన మంత్రిని చేసేద్దాం అంటూ సరదాగా ట్వీట్ల వర్షం కురిపిస్తున్నారు. ఒకవేళ ధోని ఎన్నికల్లో పోటీ చేస్తే నా ఓటు అతడికే అంటూ కామెంట్లు చేస్తున్నారు. అయితే 162 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన […]

  • Tv9 Telugu
  • Publish Date - 5:19 pm, Mon, 22 April 19
ధోనిని ప్రధానిని చేద్దాం

ఐపీఎల్‌లో భాగంగా ఆదివారం బెంగళూరుతో జరిగిన మ్యాచ్‌లో 84పరుగులతో ధోని నాటౌట్‌గా నిలిచిన విషయం తెలిసిందే. అయితే ఆయన అంతగా శ్రమించినప్పటికీ ఒక్క పరుగు తేడాతో చెన్నై ఓడిపోయింది. ఈ నేపథ్యంలో నెటిజన్లు విభిన్నంగా స్పందిస్తున్నారు. మహేంద్ర సింగ్ ధోనిని దేశానికి ప్రధాన మంత్రిని చేసేద్దాం అంటూ సరదాగా ట్వీట్ల వర్షం కురిపిస్తున్నారు. ఒకవేళ ధోని ఎన్నికల్లో పోటీ చేస్తే నా ఓటు అతడికే అంటూ కామెంట్లు చేస్తున్నారు.

అయితే 162 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన చెన్నైకి ఆదిలోనే ఎదురుదెబ్బ తగిలింది. 28పరుగులకే నాలుగు వికెట్లను కోల్పోయింది. ఆ సమయంలో బ్యాటింగ్‌కు దిగిన ధోని.. చివరి వరకు పోరాడినా జట్టు గెలవలేకపోయింది.