ఆస్ట్రేలియా పర్యటన: భారత క్రికెటర్లకు బీసీసీఐ గుడ్‌న్యూస్‌

ఆస్ట్రేలియా పర్యటనకు వెళ్లనున్న క్రికెటర్లకు బీసీసీఐ గుడ్‌న్యూస్ చెప్పింది. క్రికెటర్ల వెంట వారి కుటుంబ సభ్యులకు అనుమతిని

  • Tv9 Telugu
  • Publish Date - 8:41 am, Sat, 31 October 20
ఆస్ట్రేలియా పర్యటన: భారత క్రికెటర్లకు బీసీసీఐ గుడ్‌న్యూస్‌

Good News for Team India: ఆస్ట్రేలియా పర్యటనకు వెళ్లనున్న క్రికెటర్లకు బీసీసీఐ గుడ్‌న్యూస్ చెప్పింది. క్రికెటర్ల వెంట వారి కుటుంబ సభ్యులకు అనుమతిని ఇస్తున్నట్లు శుక్రవారం వెల్లడించింది. ఈ పర్యటనలో కుటుంబ సభ్యులను కూడా అనుమతించాలని సీనియర్ క్రికెటర్లు కోరడంతో ఈ నిర్ణయం తీసుకున్నట్లు వెల్లడించింది. అయితే దీనిపై ఇంకా అధికారిక ప్రకటన రావాల్సి ఉంది. ( నవంబర్ 2 నుంచి ఏపీలో డిగ్రీ, పీజీ తరగతులు.. మార్గదర్శకాలివే)

కాగా కరోనా నేపథ్యంలో మొదట ఈ అంశాన్ని బీసీసీఐ వ్యతిరేకించింది. అయితే ప్రస్తుతం ఐపీఎల్‌ కోసం యూఏఈలో ఉన్న ఇండియన్ క్రికెటర్లు ఫైనల్ తరువాత నేరుగా ఆస్ట్రేలియా వెళ్లనున్నారు. ఈ క్రమంలో కొంతమంది క్రికెటర్లు భారత్‌కి వచ్చే సరికి దాదాపు ఆరు నెలల సమయం పట్టనుంది. దీంతో బీసీసీఐ తమ నిర్ణయాన్ని మర్చుకున్నట్లు సమాచారం. కాగా నవంబర్ 27 నుంచి ఆస్ట్రేలియాతో మ్యాచ్‌లు ప్రారంభం కానున్నాయి. జనవరి 19వరకు జరగనున్న ఈ సిరీస్‌లో భారత్‌, ఆస్ట్రేలియా మధ్య 3 టి20లు, 3 వన్డేలు, 4 టెస్టులు జరగనున్నాయి. ( Bigg Boss 4: బిగ్‌బాస్@55డేస్‌.. కంటెస్టెంట్లు ఎమోషనల్‌)