Watch Video: పార్టీలో రచ్చ చేసిన సిక్సర్ల కింగ్.. ఖరీదైన చీర్‌లీడర్ అంటూ కామెంట్స్.. వైరల్ వీడియో
Road Safety World Series: యువరాజ్ సింగ్ ప్రస్తుతం రోడ్ సేఫ్టీ వరల్డ్ సిరీస్‌లో బిజీగా ఉన్నాడు. ఈ సందర్భంగా పార్టీలో అద్భుత డ్యాన్స్ చేశాడు.
Yuvraj Singh: భారత దిగ్గజాలు ప్రస్తుతం రోడ్ సేఫ్టీ వరల్డ్ సిరీస్ కోసం బరిలోకి దిగారు. వీరంతా మరోసారి కలిసి డ్రెస్సింగ్ రూమ్‌ను పంచుకోవడంతో అభిమానులు సంతోషంలో మునిగిపోయారు. సచిన్ టెండూల్కర్, యువరాజ్ సింగ్ , ఇర్ఫాన్ పఠాన్, సురేశ్ రైనా వంటి దిగ్గజాలు కలిస్తే అభిమానుల వినోదం రెట్టింపు కావడం ఖాయం అనడంలో ఎలాంటి సందేహం లేదు. రోడ్ సేఫ్టీ వరల్డ్ సిరీస్ మ్యాచ్ తర్వాత పార్టీ మూడ్ లోకి వచ్చిన యువరాజ్ సింగ్ సోషల్ మీడియాలో హల్ చల్ చేస్తున్నాడు.
సింగర్స్ గా మారిన రైనా, పఠాన్..
పార్టీలలో భారతీయ వెటరన్లు చాలా సరదాగా గడుపుతున్నారు. అయితే, యువరాజ్ మాత్రం ఈ పార్టీలో హైలెట్ గా మారాడు. ప్రస్తుతం అతని సిక్స్‌ల కంటే, డ్యాన్స్ గురించి ఎక్కువ చర్చలు మొదలయ్యాయి. పాత పాటలు వింటూ స్టెప్పులు ఆపుకోలేక భీకరంగా డాన్స్ చేశాడు. అతని డ్యాన్స్‌ని చూసిన యూజర్లు కామెంట్ల వర్షం కురిపిస్తున్నారు.
Having fun with two legendary singers ? @IrfanPathan @ImRaina ? and of course the legend of legends @sachin_rt ? @munafpa99881129 @ManpreetGony @pragyanojha #roadsafetyworldseries #indialegends pic.twitter.com/wjP31UcYVZ
— Yuvraj Singh (@YUVSTRONG12) September 12, 2022
And we had the most expensive cheerleader in Yuvraj Singh. What a night ?
— Irfan Pathan (@IrfanPathan) September 12, 2022
ఖరీదైన చీర్‌లీడర్‌కి..
ఈ వీడియోపై ఇర్ఫాన్ పఠాన్ అద్భుతమైన కామెంట్ చేశాడు. యువరాజ్ సింగ్‌లో మాకు అత్యంత ఖరీదైన చీర్‌లీడర్ కనిపిస్తున్నాడని ఇర్ఫాన్ చెప్పుకొచ్చాడు. అద్భుతమైన రాత్రి. ఈ సిరీస్ గురించి మాట్లాడితే, కాన్పూర్, ఇండోర్, డెహ్రాడూన్, రాయ్‌పూర్‌లలో మ్యాచ్‌లు జరుగుతాయి. టోర్నమెంట్ మొదటి మ్యాచ్ కాన్పూర్‌లో ఇండియా లెజెండ్స్ వర్సెస్ సౌత్ ఆఫ్రికా లెజెండ్స్ మధ్య జరిగింది. ఇందులో సచిన్ టెండూల్కర్ నేతృత్వంలోని భారతదేశం 61 పరుగుల తేడాతో గెలిచింది.
తొలుత బ్యాటింగ్ చేసిన ఇండియా లెజెండ్స్ నిర్ణీత ఓవర్లో 4 వికెట్ల నష్టానికి 217 పరుగులు చేసింది. జవాబుగా దక్షిణాఫ్రికా జట్టు 156 పరుగులు మాత్రమే చేయగలిగింది. స్టువర్ట్ బిన్నీ 42 బంతుల్లో అజేయంగా 82 పరుగులు చేసి విజయం సాధించాడు. ఈ మ్యాచ్‌లో యువరాజ్ సింగ్ 6 పరుగులు మాత్రమే చేయగలిగాడు . అక్కడ ఒక వికెట్ కూడా తీశాడు. వీరితో పాటు సచిన్ 16 పరుగులు, రైనా 33, యూసుఫ్ పఠాన్ 35 పరుగులు చేశారు.