IND vs PAK: ‘ఆ హైపే ఆసియా కప్ లో కొంపముంచింది.. గురి పెట్టాల్సింది పాక్ పై మాత్రమే కాదు’..
ఆసియా కప్ అంటే .. ఇండియా-పాకిస్థాన్, ఇండియా-పాకిస్థాన్, ఇండియా-పాకిస్థాన్ ఇలా రెండు జట్లే అని అందరూ మాట్లాడుకున్నారు.. అయితే, శ్రీలంక 6వ సారి (ఆసియా కప్) గెలుపొంది, అందర్నీ ఆశ్చర్యపరిచింది.
ఆసియా కప్‌లో ఓటమి పాలైన భారత జట్టుపై సునీల్ గవాస్కర్ మండిపడ్డారు. పాకిస్థాన్‌ను ఓడించడమే కాకుండా ప్రపంచకప్ గెలవడమే భారత్ లక్ష్యంగా పెట్టుకోవాలని సూచించారు. ఆసియా కప్ సందర్భంగా భారత్ వర్సెస్ పాకిస్థాన్ మ్యాచ్ అంటూ జరిగిన ప్రచారంపై భారత మాజీ కెప్టెన్ సునీల్ గవాస్కర్ మండిపడ్డారు. కాంటినెంటల్ టోర్నమెంట్‌లో విజయం సాధించడం ద్వారా శ్రీలంక భారత జట్టుకు తగిన సమాధానం అందించిందని ఆయన అన్నారు.
“ఆసియా కప్ అంటే .. ఇండియా-పాకిస్థాన్, ఇండియా-పాకిస్థాన్, ఇండియా-పాకిస్థాన్ ఇలా రెండు జట్లే అని అందరూ మాట్లాడుకున్నారు.. అయితే, శ్రీలంక 6వ సారి (ఆసియా కప్) గెలుపొంది, అందర్నీ ఆశ్చర్యపరిచింది. టీమిండియా అవకాశాల గురించి మాట్లాడేటప్పుడు, శ్రీలంకను విస్మరించకూడదని చాటి చెప్పింది. ఇది భారతదేశం వర్సెస్ పాకిస్తాన్ ఫైనల్ అని చెప్పడానికి ప్రయత్నించిన వారందరికీ శ్రీలంక వాసులు ఇచ్చిన చక్కని ఎదురుదెబ్బ” అని మాజీ ప్లేయర్ అభిప్రాయపడ్డారు.
2022 ఆసియా కప్‌లో ఆఫ్ఘనిస్థాన్‌తో జరిగిన తొలి మ్యాచ్‌లో శ్రీలంక ఘోర పరాజయం పాలైంది. గ్రూప్ దశలో డూ-ఆర్ డై మ్యాచ్‌లో బంగ్లాదేశ్‌ను లంక ఓడించింది. టోర్నమెంట్‌లోని సూపర్ 4 దశల్లో మిగిలిన జట్లపై తన సత్తా చాటి, ట్రోఫిని అందుకుంది. పాకిస్తాన్‌తో జరిగిన చివరి మ్యాచ్‌లో, శ్రీలంక అద్భుతంగా ఆకట్టుకుంది. టాస్ ఓడితే మ్యాచ్ ఓడినట్లే అనే సంప్రాదాయానికి ముగింపు పలికింది. 23 పరుగుల తేడాతో పాకిస్తాన్ జట్టును మట్టికరిపించి, ఆరోసారి ట్రోఫిని ముద్దాడింది.
టీ20 ప్రపంచకప్ గురించి మాట్లాడుతూ, “నా ఉద్దేశ్యం.. ఇది కేవలం ఒక మ్యాచ్ (పాకిస్థాన్‌పై) గెలవడం మాత్రమే కాదు, ప్రపంచ కప్ గెలవడం. స్పష్టంగా, పాకిస్తాన్‌ను ఓడించడం గొప్ప ముందడుగు అవుతుంది. ఎందుకంటే అది చాలా ఆత్మవిశ్వాసాన్ని ఇస్తుంది. ఎందుకంటే ఇప్పుడు ఇతర జట్లను బలంగా ఎదుర్కోవచ్చు. అయితే, టీమిండియా 5 మ్యాచ్‌లలో కనీసం 4 గెలవాలని నేను భావిస్తున్నాను. ఎందుకంటే అప్పుడే నాకౌట్‌కు అర్హత సాధిస్తాం ” అని గవాస్కర్ అభిప్రాయపడ్డారు.