వరల్డ్‌కప్ ఫైనల్: ఇంగ్లాండ్ టార్గెట్ 242

లండన్: ప్రపంచకప్‌లో ఆతిధ్య ఇంగ్లాండ్‌తో జరిగే ఫైనల్ మ్యాచ్‌లో న్యూజిలాండ్ నిర్ణీత 50 ఓవర్లకు 8 వికెట్లు నష్టపోయి 241 పరుగులు చేసింది. టాస్ గెలిచి బ్యాటింగ్ దిగిన కివీస్‌ను.. ఇంగ్లాండ్ బౌలర్ల తక్కువ స్కోర్‌కే కట్టడి చేయగలిగారు. దీంతో ఇంగ్లాండ్కు 242 పరుగుల టార్గెట్‌ను విధించింది కివీస్. ఇంగ్లాండ్ బౌలర్లలో వోక్స్, ప్లంకెట్ 3 వికెట్లు తీయగా.. వుడ్, ఆర్చర్ చెరో వికెట్ పడగొట్టారు. కివీస్ బ్యాట్స్‌మెన్లలో లాతామ్(47), విలియమ్సన్(30), నికోలస్(55) మాత్రమే చెప్పుకోదగ్గ పరుగులు […]

వరల్డ్‌కప్ ఫైనల్: ఇంగ్లాండ్ టార్గెట్ 242
Follow us
Ravi Kiran

|

Updated on: Jul 14, 2019 | 7:27 PM

లండన్: ప్రపంచకప్‌లో ఆతిధ్య ఇంగ్లాండ్‌తో జరిగే ఫైనల్ మ్యాచ్‌లో న్యూజిలాండ్ నిర్ణీత 50 ఓవర్లకు 8 వికెట్లు నష్టపోయి 241 పరుగులు చేసింది. టాస్ గెలిచి బ్యాటింగ్ దిగిన కివీస్‌ను.. ఇంగ్లాండ్ బౌలర్ల తక్కువ స్కోర్‌కే కట్టడి చేయగలిగారు. దీంతో ఇంగ్లాండ్కు 242 పరుగుల టార్గెట్‌ను విధించింది కివీస్. ఇంగ్లాండ్ బౌలర్లలో వోక్స్, ప్లంకెట్ 3 వికెట్లు తీయగా.. వుడ్, ఆర్చర్ చెరో వికెట్ పడగొట్టారు. కివీస్ బ్యాట్స్‌మెన్లలో లాతామ్(47), విలియమ్సన్(30), నికోలస్(55) మాత్రమే చెప్పుకోదగ్గ పరుగులు చేశారు.

అటు ఇంగ్లాండ్ సెమీస్‌లో దాదాపు ఇలాంటి తక్కువ స్కోర్‌ను సునాయాసంగా ఛేదించడంతో.. ఇంగ్లీష్ అభిమానులు కప్పు తమ జట్టుదేనని ధీమా వ్యక్తం చేస్తున్నారు. అయితే న్యూజిలాండ్ ఈ స్కోర్‌తోనే సెమీస్‌లో భారత్‌ను కట్టడి చేయడంతో.. వారిని తక్కువ అంచనా వేయలేం. చూడాలి ఎవరు అవతరిస్తారో విశ్వవిజేతగా..?