Virat Kohlis Son Akaay: బ్రిటీష్ పౌరుడిగా జూనియర్ కోహ్లీ.. రూల్స్ ఏమంటున్నాయో తెలుసా?
Virat Kohlis - Anushka Sharma: విరాట్ కోహ్లి భార్య అనుష్క లండన్‌లోని ఓ ఆస్పత్రిలో అకాయ్‌కు జన్మనిచ్చింది. అయితే, ఇప్పుడు చాలా మంది విరాట్ కొడుకు అకాయ్ బ్రిటీష్ పౌరుడని అంటున్నారు? అయితే రూల్స్ ఎలా ఉన్నాయి, మరి విరాట్ కోహ్లీ కొడుకు బ్రిటీష్ పౌరుడు అవుతాడా లేదా అనేది వివరంగా తెలుసుకుందాం..

Virat Kohlis Son Akaay: టీమిండియా స్టార్ క్రికెటర్ విరాట్ కోహ్లీ (Virat Kohli), అతని భార్య అనుష్క శర్మ (Anushka Sharma)లు రెండోసారి తల్లిదండ్రులు అయిన సంగతి తెలిసిందే. ఆ బాబుకు అకాయ్ (Akaay) అనే పెట్టినట్లు అనుష్క శర్మ సోషల్ మీడియాలో ప్రకటించింది. విరాట్ కోహ్లి కొంతకాలంగా టీమిండియాకు దూరంగా ఉన్న సంగతి తెలిసిందే. తొలుత మొదటి రెండు టెస్ట్ మ్యాచ్‌లకు దూరంగా ఉన్నాడు. ఆ తర్వాత మూడు టెస్టుల నుంచి కూడా తప్పుకున్నాడు. ఇలాంటి పరిస్థితుల్లో విరాట్ తన భార్య అనుష్కతో గడుపుతున్నాడు. వామికా తమ్ముడు అకాయ్ ఈ లోకంలోకి అడుగుపెట్టాడని మంగళవారం విరాట్, అనుష్క సోషల్ మీడియాలో ప్రకటించిన సంగతి తెలిసిందే. ఇటువంటి పరిస్థితిలో, ఈ వార్త వైరల్ అయిన వెంటనే, వారి స్నేహితులు, క్రికెటర్లు, సెలబ్రిటీలు వారిద్దరినీ అభినందించడం ప్రారంభించారు. అయితే ఇంతలో లండన్‌లో పుట్టిన వారు బ్రిటిష్ పౌరులు అవుతారు కదా, మరి విరాట్ కుమారుడు కూడా అక్కడి పౌరసత్వం వస్తుందా లేదా అనేది ప్రస్తుతం అతిపెద్ద ప్రశ్నగా మారింది.
విరాట్ కోహ్లి భార్య అనుష్క లండన్‌లోని ఓ ఆస్పత్రిలో అకాయ్‌కు జన్మనిచ్చింది. అయితే, ఇప్పుడు చాలా మంది విరాట్ కొడుకు అకాయ్ బ్రిటీష్ పౌరుడని అంటున్నారు? అయితే రూల్స్ చూస్తే అలా అవ్వడని చెబుతున్నాయి. మరి విరాట్ కోహ్లీ కొడుకు బ్రిటీష్ పౌరుడు అవుతాడా లేదా అనేది వివరంగా తెలుసుకుందాం.
నిబంధనలు ఏం చెబుతున్నాయి?
నిబంధనల ప్రకారం, ఒక బిడ్డ UK లో పుడితే, అతన్ని బ్రిటిష్ పౌరుడు అని పిలవరు. అతని తల్లిదండ్రులలో ఒకరు బ్రిటిష్ పౌరసత్వం కలిగి ఉన్నట్లయితే లేదా ఎక్కువ కాలం అక్కడ నివసించడం లేదా అక్కడ స్థిరపడిన వాళ్లు మాత్రమే బ్రిటిష్ పౌరసత్వం పొందగలరని చెబుతున్నాయి. అదే సమయంలో, పిల్లల తల్లిదండ్రులు బ్రిటిష్ పౌరులు అయితే, ఆ బిడ్డ UK వెలుపల జన్మించినట్లయితే, అతను బ్రిటిష్ పౌరుడు అవుతాడు. ఆ చిన్నారి తల్లిదండ్రులకు బ్రిటీష్ పౌరసత్వం ఎలా లభించిందనేది ఇందులో కనిపిస్తుంది. విరాట్ కోహ్లీ, అనుష్క కూడా లండన్‌లో ఇల్లు కొన్న సంగతి తెలిసిందే. అయితే ఇలా ఉన్నప్పటికీ అకాయ్ బ్రిటిష్ పౌరుడు కాలేడు. అకాయ్ పాస్‌పోర్ట్ UKలో మాత్రమే తయారు చేస్తారు. అయితే, అతన్ని మాత్రం భారతీయ పౌరుడు అని పిలుస్తారు.
View this post on Instagram
సిరీస్‌కు మొత్తం దూరమైన కోహ్లీ..
2021లో విరాట్ కోహ్లీ ఆస్ట్రేలియాలో టెస్ట్ సిరీస్ ఆడుతున్నప్పుడు విరాట్, అనుష్క శర్మలకు కుమార్తె వామిక జన్మించింది. ఆ సమయంలో, విరాట్ ఈ వార్త తెలిసిన వెంటనే నేరుగా ఇండియాకు వచ్చాడు. వామిక వయస్సు 3 సంవత్సరాలు. కానీ, ఇప్పటివరకు ఈ జంట తమ కుమార్తె ఫొటోను సోషల్ మీడియాలో షేర్ చేయలేదు. తొలి రెండు టెస్టు మ్యాచ్‌ల నుంచి విరాట్ కోహ్లికి దూరమైన సంగతి తెలిసిందే. ఆ తర్వాత అతను సిరీస్‌లోని మిగిలిన మ్యాచ్‌ల నుంచి కూడా తన పేరును ఉపసంహరించుకున్నాడు. అంటే, విరాట్ కోహ్లీని ఇంగ్లండ్‌తో మైదానంలో చూడలేం. విరాట్ చివరిసారిగా ఆఫ్ఘనిస్తాన్‌తో జరిగిన టి 20 సిరీస్‌లో మైదానంలో కనిపించాడు. ఇప్పుడు విరాట్ రాబోయే ఐపీఎల్ సీజన్‌లో రాయల్ ఛాలెంజర్స్ జెర్సీలో ఐపీఎల్‌లో చూడవచ్చు. సిరీస్‌లో పాల్గొనకూడదన్న విరాట్ నిర్ణయాన్ని బీసీసీఐ గౌరవించింది.
మరిన్ని క్రీడా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..




