Video: ఇదెక్కడి భీభత్సం భయ్యా.. 5 బంతుల్లో 24.. 12 బంతుల్లో సర్వ నాశనం.. వీడియో చూస్తే బౌలర్‌పై జాలేస్తుందంతే
Andre Russell Video: బీపీఎల్ మ్యాచ్ అనంతరం రస్సెల్ మాట్లాడుతూ.. ఈ మ్యాచ్ మాకు చాలా ముఖ్యమైనదని అన్నాడు. నిన్న ఓడిపోయాం. ఇటువంటి పరిస్థితిలో, మేం హోటల్‌కి వెళ్లి ఒకరితో ఒకరు మాట్లాడటం ప్రారంభించాం. బౌలర్లు, బ్యాట్స్‌మెన్‌లు శుభారంభం చేయాలని ప్లాన్ చేశారు. మా టీమ్ చేసిన మంచి ప్రయత్నం ఇది. నేను మొదటి ఓవర్ వేసినప్పుడు నాకు బాగా అనిపించింది. 3 వికెట్లు తీసిన తర్వాత చాలా సంతోషంగా ఉందంటూ చెప్పుకొచ్చాడు.

BPL 2024: వెస్టిండీస్ స్టార్ ఆల్ రౌండర్ ఆండ్రీ రస్సెల్ తన బ్యాటింగ్‌తో మరోసారి ప్రకంపనలు సృష్టించాడు. ఈసారి బంగ్లాదేశ్ ప్రీమియర్ లీగ్‌లో ఈ బ్యాట్స్‌మెన్ తుఫాను ఇన్నింగ్స్ కనిపించింది. ఈ ప్రదర్శన ఆధారంగా కొమిల్లా విక్టోరియన్స్ టేబుల్ టాపర్ రంగ్‌పూర్ రైడర్స్‌ను ఓడించి విజయం సాధించింది. 151 పరుగుల విజయలక్ష్యంతో బరిలోకి దిగిన కొమిల్లా జట్టు 36 పరుగులకే 2 వికెట్లు కోల్పోయింది. ఆ తర్వాత లిటన్ దాస్, మహిదుల్ ఇస్లాం మధ్య మూడో వికెట్‌కు 65 పరుగుల భాగస్వామ్యం జట్టును క్లిష్ట పరిస్థితుల నుంచి గట్టెక్కించింది.
అయితే, జట్టుకు 33 బంతుల్లో 48 పరుగులు అవసరం కాగా, ఇద్దరూ నిష్క్రమించారు. అనంతరం ఆండ్రీ రస్సెల్ క్రీజులోకి వచ్చాడు. పవర్ హిట్టర్ బ్యాట్స్‌మెన్ రంగ్‌పూర్ బౌలర్లను లక్ష్యంగా చేసుకుని 12 బంతుల్లో 43 పరుగులతో చెలరేగిపోయాడు. దీంతో ఈ జట్టు 18వ ఓవర్‌లో విజయం సాధించింది.
ఒక్క ఓవర్‌లో 24 పరుగులు..
తన ఇన్నింగ్స్‌లో ఈ డేంజరస్ బ్యాట్స్‌మెన్ 4 ఫోర్లు, 4 సిక్సర్లు కొట్టి కొమిల్లాకు విజయాన్ని అందించాడు. రస్సెల్ దూకుడు బ్యాటింగ్ ఫలితమే ఈ బ్యాట్స్‌మెన్ 17వ ఓవర్లో హసన్ మహమూద్‌ను కన్నీళ్లు పెట్టించాడు. మొయిన్ అలీ మొదటి బంతి ఆడి రస్సెల్‌కి స్ట్రైక్ ఇచ్చాడు. ఆ తర్వాత ఫోర్లు, సిక్స్‌ల వర్షం ప్రారంభించాడు. రస్సెల్ రెండో బంతికి ఫోర్, మూడో బంతికి సిక్స్, మళ్లీ నాలుగో బంతికి ఫోర్, ఐదో బంతికి సిక్సర్, ఆ తర్వాత చివరి బంతికి ఫోర్ కొట్టి 5 బంతుల్లో 24 పరుగులు చేశాడు. మ్యాచ్ గెలవడానికి కొమిల్లాకు ఈ ఓవర్ సరిపోయింది. బ్యాట్‌తో పాటు, రస్సెల్ బంతితో కూడా అద్భుతాలు చేశాడు. అతని పేరు మీద మొత్తం 3 వికెట్లు పడగొట్టాడు.
It’s Russell Mania time! 43* off just 12! . .#BPL2024 #BPLonFanCode pic.twitter.com/oHqmuj9ukD
— FanCode (@FanCode) February 20, 2024
ఈ వెస్టిండీస్ బ్యాట్స్‌మెన్ ఇటీవలే ఇంగ్లండ్ జట్టుతో టీ20 సిరీస్‌కు ఎంపికయ్యాడు.. రెండేళ్ల తర్వాత రస్సెల్ మళ్లీ జట్టులోకి వచ్చాడు. ఈ ఆటగాడు ఆస్ట్రేలియాతో జరిగిన సిరీస్‌లో పాల్గొని మంచి ప్రదర్శన కనబరిచి 2-1తో సిరీస్‌ను కైవసం చేసుకోవడంలో జట్టుకు సహకరించాడు.
బీపీఎల్ మ్యాచ్ అనంతరం రస్సెల్ మాట్లాడుతూ.. ఈ మ్యాచ్ మాకు చాలా ముఖ్యమైనదని అన్నాడు. నిన్న ఓడిపోయాం. ఇటువంటి పరిస్థితిలో, మేం హోటల్‌కి వెళ్లి ఒకరితో ఒకరు మాట్లాడటం ప్రారంభించాం. బౌలర్లు, బ్యాట్స్‌మెన్‌లు శుభారంభం చేయాలని ప్లాన్ చేశారు. మా టీమ్ చేసిన మంచి ప్రయత్నం ఇది. నేను మొదటి ఓవర్ వేసినప్పుడు నాకు బాగా అనిపించింది. 3 వికెట్లు తీసిన తర్వాత చాలా సంతోషంగా ఉందంటూ చెప్పుకొచ్చాడు.
మరిన్ని క్రీడా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..




