SRH Player: ఫోన్ కాల్‌తో చిక్కుల్లో పడ్డ హైదరాబాద్ ప్లేయర్.. ప్రముఖ మోడల్ ఆత్మహత్య కేసులో ఊహించని ట్విస్ట్
Model Tania Singh-Abhishek Sharma: మోడల్ తానియా సింగ్ ఆత్మహత్య తర్వాత, సన్‌రైజర్స్ హైదరాబాద్ (SRH) తరపున ఆడుతున్న ఓ యంగ్ ఆల్ రౌండర్ పోలీసుల దర్యాప్తు రాడార్‌లోకి వచ్చాడు. ఈ ఆల్‌రౌండర్‌ను పోలీసులు విచారణకు పిలవడంతో.. ఈ వ్యవహరం సంచలనంగా మారింది. ఈ ప్లేయర్‌ని హైదరాబాద్ రూ. 6.5 కోట్లకు కొనుగోలు చేసిన సంగతి తెలిసిందే.

Model Tania Singh: ఇండియన్ ప్రీమియర్ లీగ్ (IPL)లో ఆడే ఓ భారత క్రికెటర్ వివాదాల్లో చిక్కుకున్నాడు. సన్‌రైజర్స్ హైదరాబాద్ (SRH) తరపున ఆడే యంగ్ ప్లేయర్ అభిషేక్ శర్మ (Abhishek Sharma IPL Cricketer)సూరత్‌కు చెందిన ప్రముఖ మోడల్ తానియా సింగ్ (Model Taniya singh) ఆత్మహత్య కేసులో నిందితుడిగా మారాడు. అతన్ని స్థానిక పోలీసులు ఇదే విషయంపై విచారించినట్లు తెలుస్తోంది. అలాగే, ఈ ప్లేయర్‌కు ఇప్పటికే సమన్లు వచ్చాయి. మోడల్ తానియా చివరిసారిగా 23 ఏళ్ల అభిషేక్‌కి కాల్ చేసినట్లు దర్యాప్తులో తేలింది. ఈ నేపథ్యంలో పోలీసులు పలు కోణాల్లో కేసు దర్యాప్తు చేస్తున్నారు.
28 ఏళ్ల తానియా ఫ్యాషన్ డిజైనింగ్, మోడలింగ్ రంగంలో పనిచేసేది. ఇన్‌స్టాగ్రామ్‌లో ఆమెకు 10,000 మందికి పైగా ఫాలోవర్లు ఉన్నారు. ఆమె డిస్క్ జాకీ, మేకప్ ఆర్టిస్ట్, మోడల్ అని ఆమె ఇన్‌స్టాగ్రామ్ బయోలో రాసుకొచ్చింది.
తానియా ఆత్మహత్య చేసుకున్న తర్వాత సూరత్‌లో పోలీసులు విచారణ ప్రారంభించారు. ఈ సమయంలో, SRH ప్లేయర్ అభిషేక్ శర్మ పేరు వెలుగులోకి వచ్చింది. అభిషేక్‌కి తానియా సింగ్‌తో పరిచయం ఉన్నట్లు విచారణలో తేలింది.
తానియా, అభిషేక్‌లు కొంతకాలంగా టచ్‌లో లేరని విచారణలో వెల్లడైంది. అయితే, అభిషేక్‌ను పోలీసులు విచారణ కోసం పిలిచారు. ఎందుకంటే వీరిద్దరు స్నేహితులు కావడమే.
మోడల్ తానియా నిన్న (ఫిబ్రవరి 20) ఆలస్యంగా ఇంటికి తిరిగి వచ్చి ఆత్మహత్య చేసుకుంది. ఆమె చనిపోవడాన్ని చూసి మోడల్ కుటుంబం శోకసంద్రంలో మునిగిపోయింది.
తానియా చివరి కాల్ అభిషేక్ శర్మకు..
ఈ కేసులో తానియా కాల్ వివరాల్లో చాలా రహస్యాలు దాగి ఉన్నాయని పోలీసు వర్గాలు చెబుతున్నాయి. ఇది కాకుండా, ఆమె చివరి కాల్ కూడా అభిషేక్ శర్మకు చేసినట్లు వెలుగులోకి వస్తోంది. అందుకే ఆత్మహత్యకు ప్రేమ వ్యవహారమే కారణమా అనే కోణంలో ప్రస్తుతం పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.
సూరత్‌లోని వెసు రోడ్‌లో తానియా నివాసం..
28 ఏళ్ల మోడల్ నిన్న ఆత్మహత్య చేసుకుంది. ఆమె గత రెండేళ్లుగా ఫ్యాషన్ డిజైనింగ్, మోడలింగ్ చదువుతోంది. మోడల్ తానియా ఆత్మహత్య చేసుకున్న తర్వాతే, పోలీసులు ప్రాథమిక ఫిర్యాదు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు.
అభిషేక్ శర్మ కెరీర్..
అభిషేక్ శర్మ ప్రస్తుతం ఐపీఎల్‌లో సన్‌రైజర్స్ హైదరాబాద్‌తో కలిసి ఉన్నాడు. అతను ఆల్ రౌండర్. ఐపీఎల్‌లో 47 మ్యాచ్‌లు ఆడి 137.38 స్ట్రైక్ రేట్‌తో 893 పరుగులు చేశాడు. అతని అత్యధిక స్కోరు 75 పరుగులు. ఐపీఎల్‌లో ఇప్పటి వరకు 4 అర్ధ సెంచరీలు, 9 వికెట్లు తీశాడు. 2022 ఐపీఎల్ వేలంలో అభిషేక్‌ను సన్‌రైజర్స్ హైదరాబాద్ రూ.6.5 కోట్లకు కొనుగోలు చేసింది.
మరిన్ని క్రీడా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..




