Team India: భారీ రికార్డ్ దిశగా టీమిండియా.. తొలిసారి చరిత్ర సృష్టించనున్న సూర్యసేన
T20 World Cup 2026: టీ20 ప్రపంచ కప్ 2026లో భారత్ తన మొదటి మ్యాచ్‌ను ఫిబ్రవరి 7న ముంబైలోని వాంఖడే స్టేడియంలో USAతో ఆడనుంది. 2026 టీ20 ప్రపంచ కప్ ఫైనల్ మార్చి 8న జరుగుతుంది. టీం ఇండియా మూడోసారి టీ20 ప్రపంచ కప్ ట్రోఫీని గెలుచుకునే అవకాశం ఉంది. ఎందుకంటే భారతదే జట్టు తన సొంత మైదానంలో ఆడే అవకాశం ఉంటుంది.

Team India: 2026లో భారత్ వర్సెస్ శ్రీలంక సంయుక్తంగా ఆతిథ్యం ఇవ్వనున్న టీ20 ప్రపంచకప్‌లో టీమ్ ఇండియా విజేతగా నిలిస్తే, క్రికెట్ చరిత్రలో ముందెన్నడూ లేని విధంగా రెండు అద్భుతమైన ప్రపంచ రికార్డులను తన సొంతం చేసుకోనుంది.
ఆ రికార్డుల వివరాలు ఏంటో ఓసారి చూద్దాం..
1. వరుసగా రెండుసార్లు టీ20 ప్రపంచకప్ గెలిచిన తొలి దేశం: టీ20 ప్రపంచకప్ ప్రారంభమైన 2007 నుంచి ఇప్పటివరకు ఏ దేశం కూడా వరుసగా రెండుసార్లు ఈ ట్రోఫీని గెలవలేదు. భారత్ ఇప్పటికే 2024లో జరిగిన ప్రపంచకప్‌లో ఛాంపియన్‌గా నిలిచింది. ఇప్పుడు 2026లో కూడా కప్పు గెలిస్తే, వరుసగా రెండు ఎడిషన్లలో విజేతగా నిలిచిన ప్రపంచంలోనే మొట్టమొదటి జట్టుగా భారత్ చరిత్ర సృష్టిస్తుంది. ఇప్పటివరకు వెస్టిండీస్, ఇంగ్లాండ్ వంటి జట్లు రెండుసార్లు కప్పు గెలిచినప్పటికీ, అవి వరుసగా సాధించినవి కావు.
2. ఆతిథ్య దేశంగా కప్పు గెలిచిన తొలి జట్టు: టీ20 ప్రపంచకప్ చరిత్రలో ఒక విచిత్రమైన సెంటిమెంట్ ఉంది. ఇప్పటివరకు ఈ టోర్నీకి ఆతిథ్యం ఇచ్చిన (Host Nation) ఏ దేశం కూడా తన సొంత గడ్డపై ట్రోఫీని గెలవలేదు. 2026లో భారత్ ఈ టోర్నీకి ఆతిథ్యం ఇస్తోంది కాబట్టి, ఈసారి విజేతగా నిలిస్తే సొంత గడ్డపై టీ20 ప్రపంచకప్ గెలిచిన తొలి దేశంగా టీమ్ ఇండియా రికార్డుకెక్కుతుంది.
టోర్నీ సమయం: 2026 ఫిబ్రవరి 7 నుంచి మార్చి 8 వరకు.
తొలి మ్యాచ్: ఫిబ్రవరి 7న ముంబైలోని వాంఖడే స్టేడియంలో అమెరికా (USA) తో భారత్ తలపడనుంది.
భారత్ లక్ష్యం: ఇప్పటికే 2007, 2024లలో విజేతగా నిలిచిన భారత్, ఈసారి గెలిస్తే అత్యధికంగా మూడుసార్లు టీ20 ప్రపంచకప్ గెలిచిన ఏకైక జట్టుగా కూడా అవతరిస్తుంది.
సూర్యకుమార్ యాదవ్ సారథ్యంలోని యువ భారత్ ఈ చారిత్రాత్మక రికార్డులను అందుకోవాలని అభిమానులు కోరుకుంటున్నారు.
మరిన్ని క్రీడా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..




