పట్టుమని పది వికెట్లు తీసేసరికి పొగరెక్కినట్టు ఉంది.. నువ్వేమైనా కోహ్లీ అనుకుంటివా మావ.!

మైదానంలో ప్రత్యర్ధి జట్టు ఆటగాళ్లతో గొడవ జరుగుతుండటం సర్వసాధారణం. కానీ సొంత జట్టు ఆటగాళ్లు ఒకరినొకరు గొడవపడితే.. ఆ సీన్ వెస్టిండీస్, ఇంగ్లాండ్ జట్ల మధ్య జరిగిన మూడో వన్డేలో చోటు చేసుకుంది.

పట్టుమని పది వికెట్లు తీసేసరికి పొగరెక్కినట్టు ఉంది.. నువ్వేమైనా కోహ్లీ అనుకుంటివా మావ.!
Alzarri Joseph
Follow us

|

Updated on: Nov 07, 2024 | 4:46 PM

సాధారణంగా మైదానంలో ప్రత్యర్థి జట్టు బ్యాటర్లు లేదా బౌలర్లపై ఆగ్రహావేశాలు చూపించడం సర్వసాధారణం. అయితే విండీస్ ఆల్‌రౌండర్ అల్జారీ జోసెఫ్ తన సొంత జట్టు కెప్టెన్‌తోనే గొడవకు దిగాడు. వీరిద్దరి మధ్య గొడవ తీవ్రతరం కావడంతో.. ఆ తర్వాత మైదానం విడిచి వెళ్లిపోయాడు జోసెఫ్. బార్బడోస్ వేదికగా ఇంగ్లాండ్‌తో జరిగిన మూడో వన్డేలో ఈ అనూహ్య పరిణామం చోటు చేసుకుంది. మ్యాచ్ నాలుగో ఓవర్‌ వేసేందుకు జోసెఫ్ సిద్దం కాగా.. ఆ సమయంలో కెప్టెన్ హోప్ పెట్టిన ఫీల్డింగ్‌.. అతనికి నచ్చలేదు. ఫీల్డింగ్ విషయంలో కొన్ని మార్పులు చెప్పినా.. కెప్టెన్ పట్టించుకోకపోవడంతో.. జోసెఫ్ అసంతృప్తికి లోనయ్యి.. మైదానం వదిలి వెళ్లాడు.

ఇది చదవండి: ట్రైన్ ఏసీ భోగీ వెలుపల ఏదో వింత వాసన.. డౌట్ వచ్చి.. ఓ ప్రయాణీకుడి లగేజి చెక్ చేయగా!

ఇవి కూడా చదవండి

ఇక జోసెఫ్ వేసిన ఓ బౌన్సర్‌ను తప్పించపోయి.. వికెట్ల వెనుక షాయ్ హోప్‌కు చిక్కాడు ఇంగ్లాండ్ బ్యాటర్ జోర్డాన్ కాక్స్(1). మరోవైపు నాలుగో ఓవర్ ముగిసేసరికి మైదానం వీడిన అల్జారీ జోసెఫ్.. ఆ తర్వాత కొద్దిసేపటికి తిరిగి వచ్చాడు. 10 ఓవర్లు పూర్తి చేసి రెండు వికెట్లు పడగొట్టాడు. అటు విండీస్ కోచ్ డారెన్ సామీ కూడా బౌండరీ లైన్ వెలుపల ఆటగాళ్లను నియంత్రిస్తూ కనిపించాడు. ఇక ఈ జోసెఫ్ సంఘటనకు సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది. ఇక ఐపీఎల్‌లో జోసెఫ్.. రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు జట్టుకు ప్రాతినిధ్యం వహించిన సంగతి తెలిసిందే. అతడ్ని ఐపీఎల్ మెగా వేలానికి ముందుగా ఆ ఫ్రాంచైజీ విడిచిపెట్టింది.

ఇది చదవండి: బాబోయ్.! ఏపీకి మరో వర్ష గండం.. ఈ ప్రాంతాలకు వర్షాలే వర్షాలు.. వెదర్ రిపోర్ట్ ఇదిగో

విండీస్ విజయం..

ఈ మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్ చేసిన ఇంగ్లాండ్ నిర్ణీత 50 ఓవర్లలో 8 వికెట్ల నష్టానికి 263 పరుగులు చేసింది. ఇక లక్ష్యచేదనలో భాగంగా బరిలోకి దిగిన విండీస్‌కు.. బ్రాండన్ కింగ్(102), కీసీ కార్టీ(128) శతకాలతో అదరగొట్టారు. దీంతో విండీస్ 43 ఓవర్లలోనే 267 పరుగులు చేసి 8 వికెట్ల తేడాతో అద్భుత విజయం సాధించింది. దీంతో మూడు మ్యాచ్‌ల సిరీస్‌ను వెస్టిండీస్ 2-1తో కైవసం చేసుకుంది. తొలి వన్డేలో వెస్టిండీస్ 8 వికెట్ల తేడాతో విజయం సాధించగా, రెండో వన్డేలో ఇంగ్లాండ్ 5 వికెట్ల తేడాతో గెలుపొందింది. మూడో వన్డేలో విండీస్ విజయం సాధించి సిరీస్‌ను కైవసం చేసుకుంది.

ఇది చదవండి: తవ్వకాలు జరుపుతుండగా బయటపడ్డ నల్లటి ఆకారం.. ఏంటని చూడగా కళ్లు చెదిరేలా

మరిన్ని క్రికెట్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

పట్టుమని పది వికెట్లు తీసేసరికి పొగరెక్కినట్టు ఉంది..
పట్టుమని పది వికెట్లు తీసేసరికి పొగరెక్కినట్టు ఉంది..
మంటలకు జామ్‌ అయిన కిటికీలు తలుపులు.! మంటలకు పిల్లి కారణమా..
మంటలకు జామ్‌ అయిన కిటికీలు తలుపులు.! మంటలకు పిల్లి కారణమా..
ఇన్వెస్టర్లకు సెబీ హెచ్చరిక.. ఆ యాప్స్ విషయంలో జాగ్రత్తలు అవసరం
ఇన్వెస్టర్లకు సెబీ హెచ్చరిక.. ఆ యాప్స్ విషయంలో జాగ్రత్తలు అవసరం
అరుంధతి సినిమా కోసం సోనూసూద్ రెమ్యునరేషన్ తెలిస్తే మైండ్ బ్లాంకే
అరుంధతి సినిమా కోసం సోనూసూద్ రెమ్యునరేషన్ తెలిస్తే మైండ్ బ్లాంకే
రోజూ ఒక్క స్పూన్ తాగండి మీ లైఫే మారిపోతుంది.! కొబ్బరి నూనెలో పోషక
రోజూ ఒక్క స్పూన్ తాగండి మీ లైఫే మారిపోతుంది.! కొబ్బరి నూనెలో పోషక
బ్లాక్‌ కాఫీ తాగితే బరువు తగ్గుతారా.? ఇందులో నిజమెంతంటే..
బ్లాక్‌ కాఫీ తాగితే బరువు తగ్గుతారా.? ఇందులో నిజమెంతంటే..
AI టెక్నాలజీతో ఎప్పుడు చనిపోతారో తెలిసిపోతుంది.! వీడియో వైరల్..
AI టెక్నాలజీతో ఎప్పుడు చనిపోతారో తెలిసిపోతుంది.! వీడియో వైరల్..
ట్రంప్ ఫ్యాన్స్ అంటే మినిమం ఉంటది..!
ట్రంప్ ఫ్యాన్స్ అంటే మినిమం ఉంటది..!
కారు నంబర్‌ ద్వారా యజమాని పూర్తి వివరాలు తెలుసుకోవచ్చు..ఎలాగంటే..
కారు నంబర్‌ ద్వారా యజమాని పూర్తి వివరాలు తెలుసుకోవచ్చు..ఎలాగంటే..
గర్భిణీలు డ్రాగన్‌ ఫ్రూట్‌ తినొచ్చా.? నిపుణులు ఏమంటున్నారంటే..
గర్భిణీలు డ్రాగన్‌ ఫ్రూట్‌ తినొచ్చా.? నిపుణులు ఏమంటున్నారంటే..