AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Ranji Trophy: క్రికెట్ గాడ్ కొడుకు కదా..ఆడుతాడని అనుకున్నప్పుడల్లా తుస్సుమంటున్నాడు..!

అర్జున్ టెండూల్కర్.. టీమిండియా క్రికెట్ దిగ్గజం సచిన్ టెండూల్కర్ కుమారుడిగా అందరీకి సుపరిచితమే..తన తండ్రిలాగా బాగా ఆడుతాడని క్రికెట్ అభిమానులు అనుకుంటున్న ప్రతి సారీ వారికి అర్జున్ టెండూల్కర్ షాక్ ఇస్తున్నాడు. తాజాగా కూడా ఓ మ్యాచ్‌లో విఫలమయ్యాడు.

Ranji Trophy: క్రికెట్ గాడ్ కొడుకు కదా..ఆడుతాడని అనుకున్నప్పుడల్లా తుస్సుమంటున్నాడు..!
Arjun Tendulkar Flop In Goa Vs Mizoram Ranji Trophy Match
Velpula Bharath Rao
|

Updated on: Nov 07, 2024 | 5:23 PM

Share

టీమిండియా క్రికెట్ దిగ్గజం సచిన్ టెండూల్కర్ కుమారుడు అర్జున్ టెండూల్కర్ మైదానంలోకి వచ్చినప్పుడల్లా అతని నుండి క్రికెట్ అభిమానులు మంచి ప్రదర్శన ఆశిస్తూ ఉంటారు. అద్భుతంగా బ్యాటింగ్, బౌలింగ్ చేసి తన తండ్రి సచిన్‌ను గర్వపడేలా చేస్తాడని అభిమానులు ఆశిస్తూ ఉంటారు. కానీ అలా అనుకున్నా ప్రతిసారి అర్జున్ టెండూల్కర్ వారి అంచనాలను తలకిందులు చేస్తాడు. . మిజోరంతో జరిగిన రంజీ మ్యాచ్‌లో తొలి ఇన్నింగ్స్‌లో అర్జున్ టెండూల్కర్ ఘోరంగా విఫలమయ్యాడు. స్కొరింగ్ పిచ్‌పైన కూడా ఈ లెఫ్ట్ హ్యాండర్ ఖాతా తెరవలేకపోయాడు. మిజోరామ్‌పై తొలి బంతికే అర్జున్ బౌల్డ్ అయ్యాడు.

తొలి బంతికే అర్జున్ బౌల్డ్ అయ్యాడు

ప్రపంచంలోనే అతిపెద్ద స్టేడియం అయిన నరేంద్ర మోదీ స్టేడియంలో జరుగుతున్న మ్యాచ్‌లో అర్జున్ టెండూల్కర్ 9వ స్థానంలో బ్యాటింగ్‌కు వచ్చాడు. ఈ స్టేడియం పిచ్ బ్యాటింగ్‌కు అనుకూలంగా ఉంది. కానీ అర్జున్ మోహిత్  వేసిన మొదటి బంతికే బౌల్డ్ అయ్యాడు. అర్జున్ విఫలమైనా గోవా తొలి ఇన్నింగ్స్‌లో 555 పరుగుల భారీ స్కోరు చేసింది. ఈ జట్టులోని ఇద్దరు బ్యాట్స్‌మెన్ అద్భుతంగా బ్యాటింగ్ చేశారు. మంథన్ ఖుత్కర్ 95 పరుగుల ఇన్నింగ్స్ ఆడాడు, అతను కేవలం ఐదు పరుగుల తేడాతో సెంచరీని కోల్పోయాడు. కానీ నాలుగో నంబర్‌లో బ్యాటింగ్‌కు వచ్చిన స్నేహల్ ఖుతాంకర్ 342 బంతుల్లో 250 పరుగులు చేశాడు. ఖుతాంకర్ 25 ఫోర్ల సాయంతో ఈ ఇన్నింగ్స్ ఆడాడు. గోవా తరఫున కరియప్ప, జాంగ్రా గరిష్టంగా 3-3 వికెట్లు తీశారు.

అందరి దృష్టి అతని పైనే ఉంది?

గోవా-మిజోరం మధ్య జరుగుతున్న ఈ మ్యాచ్‌లో ఇప్పుడు అందరి దృష్టి ఈ టోర్నీలో అద్భుతంగా బ్యాటింగ్ చేస్తున్న అగ్ని చోప్రాపైనే ఉంది. ఈ ఆటగాడు 8 మ్యాచ్‌ల్లో 7 సెంచరీలు సాధించాడు. అతని సగటు 99 కంటే ఎక్కువ. ఇప్పుడు గోవా బౌలింగ్ యూనిట్‌పై అగ్ని చోప్రా ఎలా రాణిస్తుండో చూడాలి. ఈ మ్యాచ్‌లో అర్జున్ టెండూల్కర్ ఎలా బౌలింగ్ చేస్తాడన్నది కూడా ఆసక్తికరంగా మారింది.

మరిన్ని క్రికెట్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి