T20 World Cup 2021: భారత్‌ ఫైనల్‌కు రావాలి.. మాకు మళ్లీ ఓడించే మౌకా ఇవ్వాలి.. అక్తర్‌ ఆసక్తికర వ్యాఖ్యలు

ప్రపంచకప్‌లో భారత్‌- పాకిస్తాన్‌ మ్యాచ్‌లకు సంబంధించి గత కొన్నేళ్లుగా 'మౌకా మౌకా ' పేరుతో ప్రకటనలు వస్తున్న సంగతి తెలిసిందే. వరల్డ్‌కప్‌ మ్యాచ్‌ల్లో టీమిండియా ఆధిపత్యాన్ని గుర్తు చేస్తూ..

T20 World Cup 2021: భారత్‌ ఫైనల్‌కు రావాలి.. మాకు మళ్లీ ఓడించే మౌకా ఇవ్వాలి.. అక్తర్‌ ఆసక్తికర వ్యాఖ్యలు
Follow us

|

Updated on: Nov 05, 2021 | 9:01 AM

ప్రపంచకప్‌లో భారత్‌- పాకిస్తాన్‌ మ్యాచ్‌లకు సంబంధించి గత కొన్నేళ్లుగా ‘మౌకా మౌకా ‘ పేరుతో ప్రకటనలు వస్తున్న సంగతి తెలిసిందే. వరల్డ్‌కప్‌ మ్యాచ్‌ల్లో టీమిండియా ఆధిపత్యాన్ని గుర్తు చేస్తూ పాక్‌కు వ్యంగ్యంగా ఈ అడ్వర్టైజ్‌మెంట్లు రూపొందేవి. మ్యాచ్‌కు ముందు సంబరాలు చేసుకోవడానికి పాక్‌ అభిమానులు బాణసంచా రడీ చేసుకోవడం, పాక్‌ ఓడిపోయాక తిరిగి వాటిని అటకమీద పెట్టడం..ఇలా యాడ్‌లు వచ్చేవి. అయితే ప్రస్తుతం దుబాయి వేదికగా జరుగుతున్న టీ 20 ప్రపంచకప్‌లో టీమిండియా మొదటిసారిగా పాక్‌ చేతిలో ఓడిపోయింది. ఈ నేపథ్యంలో పాక్‌ మాజీ ఫాస్ట్‌ బౌలర్‌ షోయబ్‌ అక్తర్‌ ‘మౌకా’ యాడ్‌పై ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు.

ఈ సందర్భంగా తన యూట్యూబ్‌ ఛానల్‌ ద్వారా మాట్లాడిన అక్తర్‌.. ‘ ప్రస్తుత ప్రపంచకప్‌లో భారత జట్టు ఫైనల్‌కు రావాలని మేం కోరుకుంటున్నాం. అక్కడ మరోసారి ఓడించాలనుకుంటున్నాం. ఇందుకుగాను టీమిండియా మాకు మరో మౌకా (అవకాశం) ఇవ్వాలని కోరుకుంటున్నాం. ఇక్కడ నేను ‘మౌకా’ అనే మాట పలకడానికి ఒక ప్రత్యేక కారణముంది. ఎందుకంటే ఈ పదం ఇప్పుడు ఇప్పుడు మా జట్టును అపహాస్యం చేసేది కాదు. సరదాగా ప్రకటనలు రూపొందించడం తప్పేమీ కాదు. కానీ ఆ యాడ్‌లు ఒక దేశాన్ని కించపరిచేవిధంగా మాత్రం ఉండకూడదు. మాది గర్వకారణమైన దేశం. ఇకపై మౌకా అనే పదం మాకు ఏ మాత్రం ఎంటర్‌టైన్‌మెంట్‌ కాదు’ అని చెప్పుకొచ్చాడు. ఇక భారత్‌ – అఫ్గాన్‌ మ్యాచ్‌పై పాక్‌ అభిమానులు చేస్తున్న పోస్టులపై స్పందిస్తూ ‘ మ్యాచ్‌ ఫిక్స్‌ అయ్యిందంటూ పోస్టులు పెట్టడం సరికాదు. అఫ్గాన్‌ జట్టును ఎవరూ నిందించరాదు. ఎందుకంటే ఆ దేశంలో ప్రస్తుతం అల్లకల్లోల పరిస్థితులు ఏర్పడ్డాయి. ‘ఫిక్సింగ్‌’ వ్యాఖ్యల వల్ల ఆ జట్టుకు మరింత ముప్పు ఏర్పడే అవకాశం ఉంది’ అని తెలిపాడు.

Also Read:

Dwayne Bravo: అంతర్జాతీయ క్రికెట్​కు వెస్టిండీస్ ఆల్​రౌండర్ డ్వేన్ బ్రావో గుడ్ బై

T20 World Cup 2021, IND vs SCO: వంద శాతం ప్రయత్నిస్తాం.. కోహ్లీసేనను ఓడిస్తాం: స్కాట్లాండ్ సారథి

T20 World Cup 2021: నాలుగేళ్ల వనవాసం ముగిసింది.. ఆనాటి పరిస్థితులెంతో కఠినం: భావోద్వేగానికి గురైన భారత స్టార్ బౌలర్..!

Latest Articles
బ్యాంకుకు వెళ్లి ఈ ఫారమ్‌ను పూరించండి.. ఖాతా నుంచి డబ్బులు కట్
బ్యాంకుకు వెళ్లి ఈ ఫారమ్‌ను పూరించండి.. ఖాతా నుంచి డబ్బులు కట్
'పేదవాడి భవిష్యత్తును మార్చే ఎన్నికలు ఇవి'.. మంగళగిరి సభలో జగన్..
'పేదవాడి భవిష్యత్తును మార్చే ఎన్నికలు ఇవి'.. మంగళగిరి సభలో జగన్..
నువ్వు ఎవడైతే నాకేంటి..!! టూరిస్ట్‌లకు సుస్సు పోయించిన గజరాజు..
నువ్వు ఎవడైతే నాకేంటి..!! టూరిస్ట్‌లకు సుస్సు పోయించిన గజరాజు..
ఈ పంటను సాగు చేస్తే ధనవంతులు అవుతారు? అద్భుతమైన బిజినెస్‌ ఐడియా!
ఈ పంటను సాగు చేస్తే ధనవంతులు అవుతారు? అద్భుతమైన బిజినెస్‌ ఐడియా!
చెన్నైపైనే బెంగళూరు ఆశలు.. ప్లేఆఫ్స్ చేరాలంటే ఇలా జరగాల్సిందే..
చెన్నైపైనే బెంగళూరు ఆశలు.. ప్లేఆఫ్స్ చేరాలంటే ఇలా జరగాల్సిందే..
హోటల్‌లో దోశ తింటుంటే పంటికి ఏదో తగిలింది.. ఏంటా అని చూడగా...
హోటల్‌లో దోశ తింటుంటే పంటికి ఏదో తగిలింది.. ఏంటా అని చూడగా...
మల్లన్నకు కానుకల వెల్లువ.. రూ.2.81 కోట్ల హుండీ ఆదాయం
మల్లన్నకు కానుకల వెల్లువ.. రూ.2.81 కోట్ల హుండీ ఆదాయం
ఎంజాయ్ పండగో..! ఓటీటీలోకి అదిరిపోయే సినిమాలు..
ఎంజాయ్ పండగో..! ఓటీటీలోకి అదిరిపోయే సినిమాలు..
మీరు గ్యాస్ సిలిండర్ కొనుగోలు చేస్తున్నారా? ఇవిగో కొత్త నిబంధనలు!
మీరు గ్యాస్ సిలిండర్ కొనుగోలు చేస్తున్నారా? ఇవిగో కొత్త నిబంధనలు!
ఇలా చేస్తే చర్మ సౌందర్యం మీ సొంతం.. అద్భుతమైన చిట్కా..
ఇలా చేస్తే చర్మ సౌందర్యం మీ సొంతం.. అద్భుతమైన చిట్కా..