T20 World Cup 2021: నాలుగేళ్ల వనవాసం ముగిసింది.. ఆనాటి పరిస్థితులెంతో కఠినం: భావోద్వేగానికి గురైన భారత స్టార్ బౌలర్..!

R Ashwin: పాకిస్థాన్‌తో జరిగిన ఛాంపియన్స్ ట్రోఫీ 2017 ఫైనల్‌లో అశ్విన్ విఫలమయ్యాడు. అప్పటి నుంచి వన్డే, టీ20 ఫార్మాట్‌లలో టీమ్ ఇండియాలో స్థానం కోల్పోయాడు.

T20 World Cup 2021: నాలుగేళ్ల వనవాసం ముగిసింది.. ఆనాటి పరిస్థితులెంతో కఠినం: భావోద్వేగానికి గురైన భారత స్టార్ బౌలర్..!
R Ashwin
Follow us
Venkata Chari

|

Updated on: Nov 04, 2021 | 7:22 PM

R Ashwin: గురువారం భారత జట్టు విలేకరుల సమావేశానికి రవిచంద్రన్ అశ్విన్ హాజరయ్యాడు. మీడియా విస్తృతంగా ఆయనపై ఎన్నో ప్రశ్నలు సంధించింది. అందులో మొదటిది- ఆఫ్ఘనిస్తాన్‌పై అతని బౌలింగ్, రెండవది- శుక్రవారం స్కాట్లాండ్‌తో మ్యాచ్‌కు సంబంధించింది. ఆస‌క్తిక‌ర‌మైన విష‌యం ఏంటంటే.. మొత్తానికి విలేక‌రుల స‌మావేశంలో మొద‌టి ప్రశ్నదే ఆధిపత్యంగా నిలిచింది. నాలుగు సంవత్సరాల తర్వాత అంతర్జాతీయ క్రికెట్‌లోకి తిరిగి వచ్చాడు. అసలు అతను ఏమి చెప్పాలనుకుంటున్నాడు? వాస్తవానికి, కెప్టెన్ విరాట్ కోహ్లి, కోచ్ రవిశాస్త్రి మొదటి ఎంపిక ఆర్ అశ్విన్ కాదని డ్రెస్సింగ్ రూమ్ మూలాలలో చాలా సాధారణ చర్చలా మారింది. భారత జట్టు ప్రస్తుత మెంటార్ మహేంద్ర సింగ్ ధోనీ (ఎంఎస్ ధోని) కూడా అశ్విన్‌ని మునుపటిలా ఇష్టపడడం లేదంటూ వార్తలు వచ్చాయి.

ఇంకాస్త లోతుల్లోకి వెళితే.. నిలకడగా మంచి ప్రదర్శన చేసినా త్వరితగతిన క్రికెట్‌లో ఆర్‌ అశ్విన్‌ ప్లేయింగ్‌-11లో చోటు దక్కించుకోలేకపోయాడన్నది నిజం. యుజ్వేంద్ర చాహల్, కుల్దీప్ యాదవ్‌ల మంచి ప్రదర్శన కారణంగా వారు కూడా చాలా కాలం వేచి ఉండాల్సి వచ్చింది. తర్వాత రవీంద్ర జడేజా కూడా తిరిగి జట్టులోకి వచ్చినా.. అశ్విన్ అదృష్టం కోసం ఎదురుచూడాల్సి వచ్చింది. టీ20 ప్రపంచ కప్ 2021 జట్టులో కూడా ఎంపికయ్యాడు. పాకిస్తాన్, న్యూజిలాండ్‌లతో జరిగిన ముఖ్యమైన మ్యాచ్‌లో విరాట్ కోహ్లీ వరుణ్ చక్రవర్తికి ప్రాధాన్యత ఇచ్చాడు. అయితే రెండు మ్యాచుల్లోనూ భారత్ భారీ తేడాతో ఓడిపోవాల్సి వచ్చింది.

విలేకరుల సమావేశాన్ని ప్రారంభించిన అశ్విన్, టీ20 ప్రపంచకప్ జట్టులోకి ఎంపికైనప్పుడు, అది తనకు ప్రత్యేకమైన క్షణమని తెలిపాడు. అశ్విన్ మాట్లాడుతూ- ‘‘జీవితం ఒక ‘వృత్తం’ లాంటిది. కొందరికి ఈ ‘వృత్తం’ చిన్నదయితే.. మరికొందరికి మాత్రం చాలా పెద్దది. చెడ్డ దశలో సంయమనం పాటించడం నేర్చుకున్నాను. నా ఉపయోగం నాకు కాకుండా మరొకరికి నిరూపించుకోవాల్సి వచ్చింది. నేను కష్టపడి పని చేస్తూనే ఉన్నాను.

జీవితంలో ప్రతి ఒక్కరికీ మంచి చెడులు వస్తాయని అశ్విన్ చెప్పాలనుకున్నాడు. అతని విజయానికి సంబంధించి షేన్ వార్న్, సచిన్ టెండూల్కర్‌ల ఉదాహరణను కూడా ఇచ్చాడు. ఆఫ్ఘనిస్తాన్‌పై విజయం, వికెట్లు తీయడం కంటే స్పిన్నర్‌గా పొదుపుగా బౌలింగ్ చేయడం అనే ప్రశ్నకు కూడా అశ్విన్ సమాధానం ఇచ్చాడు.

“నేను 2007-08 నుంచి ఈ ఫార్మాట్‌లో ఆడుతున్నాను. ఈ గేమ్ చాలా వేగంగా మారుతుంది. బ్యాట్స్‌మెన్‌పై ఒత్తిడి తెచ్చే వికెట్లు పడటం వెనుక ఎప్పుడూ ‘డాట్ బాల్స్’ ఉంటాయి. నాకు ప్రతీ మ్యాచ్ 24 బంతుల ఈవెంట్. ప్రతీసారి నేను గెలవాలనుకుంటున్నాను. ఆఫ్ఘనిస్థాన్‌తో జరిగిన మ్యాచ్‌లో విజయం నాకు ‘ప్రత్యేక రాత్రి” అంటూ పేర్కొన్నాడు.

నాలుగేళ్ల క్రితం క్రికెట్‌తో సంబంధాలు తెగిపోయాయి.. నిజానికి, 2017 ఛాంపియన్స్ ట్రోఫీ ఫైనల్‌కు ముందు అంతా బాగానే ఉంది. అశ్విన్, రవీంద్ర జడేజా స్పిన్నర్లుగా భారత జట్టులో దాదాపు క్రమం తప్పకుండా ఆడేవారు. కానీ, 2017 జూన్ 18న జరిగిన ఛాంపియన్స్ ట్రోఫీ ఫైనల్ తర్వాత పరిస్థితి పూర్తిగా మారిపోయింది. విరాట్ కెప్టెన్సీలో పాకిస్థాన్‌తో టైటిల్ పోరు సాగింది. తొలుత బ్యాటింగ్ చేసిన పాకిస్థాన్ 338 పరుగులు చేసింది. భువనేశ్వర్ కుమార్, హార్దిక్ పాండ్యా మినహా మిగతా భారత బౌలర్లందరూ ఖరీదైన వారిగా మారారు. దురదృష్టవశాత్తు, ఆ మ్యాచ్‌లో అశ్విన్‌కి గానీ, రవీంద్ర జడేజాకు గానీ వికెట్లు దక్కలేదు.

అశ్విన్ 7 ఎకానమీతో, జడేజా 8.37 ఎకానమీతో పరుగులు ఇచ్చారు. 339 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన భారత జట్టు బ్యాట్స్‌మెన్‌లు ఒత్తిడిని తట్టుకోలేకపోయారు. భారత జట్టు కేవలం 30.3 ఓవర్లలో 158 పరుగులకే కుప్పకూలింది. పాకిస్థాన్ బిగ్ టోర్నీలో అతిపెద్ద మ్యాచ్‌లో 180 పరుగులు సాధించింది.

దీని తర్వాత ఆర్ అశ్విన్ వెంటనే క్రికెట్‌కు దూరమయ్యాడు. టెస్టు జట్టులో అశ్విన్ దాదాపు స్థిరంగా ఉన్నాడు. ఈ సమయంలో భారత్ ఏ చారిత్రక విజయం నమోదు చేసినా అందులో అశ్విన్ పాత్ర ఉంది. ఆస్ట్రేలియాలో అద్భుత విజయం సాధించిన వీరుడు. కానీ అతను పొట్టి క్రికెట్‌లో మాత్రం స్థానం సంపాదించలేకపోయాడు. ఆ స్థానాన్ని కుల్దీప్, చాహల్ జోడీ చేజిక్కించుకుంది. అయితే ఇప్పుడు ఆ జోడీ కూడా సెలక్టర్లు పక్కన పెట్టారు. అయితే అశ్విన్ మళ్లీ జట్టులో చోటు సంపాదించాడు. జడేజాతో కలిసి ప్లేయింగ్ 11లో మరోసారి చోటు దక్కించుకున్నాడు. ఆర్ అశ్విన్ క్రికెట్ సర్కిల్ పూర్తయిందా అంటే మాత్రం.. ఆర్ అశ్విన్ భాషలో చెప్పాలంటే ‘సర్కిల్’ ఎప్పుడూ పూర్తి కాదు. అందులో స్టాప్‌లు కూడా చాలానే ఉన్నాయి అని అర్థం.

Also Read: Hylo Open: 32 నిమిషాల్లోనే ప్రత్యర్థిని ఓడించిన కిదాంబి శ్రీకాంత్.. రెండో రౌండ్‌లోకి ప్రవేశం..!

T20 World Cup 2021: బంగ్లాపై ఆసీస్ అద్భుత విజయం.. కేవలం 38 బంతుల్లోనే ఛేజింగ్.. దక్షిణాఫ్రికాకు చెక్ పెట్టిన ఫించ్ సేన