T20 World Cup 2021: బంగ్లాపై ఆసీస్ అద్భుత విజయం.. కేవలం 38 బంతుల్లోనే ఛేజింగ్.. దక్షిణాఫ్రికాకు చెక్ పెట్టిన ఫించ్ సేన
AUS vs BAN: పాయింట్ల పట్టికలో దక్షిణాఫ్రికాను అధిగమించడానికి ఈ మ్యాచ్‌లో ఆస్ట్రేలియాకు చాలా పెద్ద విజయం అవసరం. కేవలం 38 బంతుల్లో మ్యాచ్‌ను ముగించి, కూల్‌గా పాయింట్లతో పాటు నెట్ రన్ రేట్ సాధించింది.
ICC T20 World Cup 2021: టీ20 వరల్డ్ కప్ 2021లో ఆస్ట్రేలియా తన నాలుగో మ్యాచ్‌లో బంగ్లాదేశ్‌ను 8 వికెట్ల తేడాతో ఓడించింది. సెమీ-ఫైనల్ చేరుకునే రేసులో దక్షిణాఫ్రికాతో పోటీపడుతున్న ఆస్ట్రేలియా జట్టు.. ఈ మ్యాచ్‌లో భారీ విజయం సాధించాలని భావించింది. ఆ జట్టు లెగ్ స్పిన్నర్ ఆడమ్ జంపా, దాని పునాదిని కాపాడుకుంటూ బంగ్లాదేశ్‌ను కేవలం 73 పరుగులకే కట్టడి చేశాడు. ఆ తర్వాత కెప్టెన్ ఆరోన్ ఫించ్ చెలరేగడంతో ఆస్ట్రేలియా ఈ లక్ష్యాన్ని కేవలం 38 బంతుల్లో (6.2 ఓవర్లు) సులువుగా సాధించింది.
ఈ భారీ విజయంతో ఆస్ట్రేలియా 2 పాయింట్లు సాధించి దక్షిణాఫ్రికాను సమం చేయగా, నెట్ రన్ రేట్‌లో కూడా అద్భుతంగా మెరుగుపడి ఆఫ్రికా జట్టును అధిగమించి రెండో స్థానంలో నిలిచింది. మరోవైపు సూపర్-12 రౌండ్‌లో వరుసగా 5 ఓటములతో బంగ్లాదేశ్ ప్రయాణం నిరాశాజనకంగా ముగిసింది.
అయితే ఈ మ్యాచులో ఆడం జంపా 5 వికెట్లు తీసి బంగ్లాను దారుణంగా దెబ్బకొట్టాడు. 4 ఓవర్లు వేసిన జంపా కేవలం 19 పరుగులే ఇచ్చి 5 వికెట్లు పడగొట్టాడు. ఇందులో 14 డాట్ బాల్స్ ఉన్నాయి. వరుసగా వికెట్లు కోల్పోతూ బంగ్లాదేశ్ టీం ఏ దశలోనూ కోలుకోనివ్వకుండా చేశాడు.
Australia are one step closer to the semis ?#T20WorldCup | #AUSvBAN | https://t.co/sLOukVJrmH pic.twitter.com/LEqQ4hS2TT
— ICC (@ICC) November 4, 2021
What a spell from the Australian leggie ?#T20WorldCup | #AUSvBAN | https://t.co/r00X0zOgH1 pic.twitter.com/Ie2F2RtAsl
— ICC (@ICC) November 4, 2021
Also Read: Team India: టీమిండియా విజయంతో బీసీసీఐపై నిందలు.. పాక్ నటికి ధీటుగా కౌంటర్ ఇచ్చిన భారత మాజీ క్రికెటర్
Sooryavanshi: ‘సూర్యవంశీ’లో ఎంఎస్ ధోని.. ఆసక్తి రేకిత్తిస్తోన్న గుల్షన్ గ్రోవర్ సీక్రెట్ పోస్ట్