Team India: టీమిండియా విజయంతో బీసీసీఐపై నిందలు.. పాక్ నటికి ధీటుగా కౌంటర్ ఇచ్చిన భారత మాజీ క్రికెటర్
Ind vs Afg: అబుదాబిలో బుధవారం జరిగిన టీ20 ప్రపంచకప్‌లో ఆఫ్ఘనిస్థాన్‌ను 66 పరుగుల తేడాతో ఓడించిన టీమ్ ఇండియా.. తన తొలి విజయాన్ని నమోదు చేసింది.
T20 World Cup 2021: అబుదాబిలో బుధవారం జరిగిన టీ20 ప్రపంచకప్‌లో ఆఫ్ఘనిస్థాన్‌ను 66 పరుగుల తేడాతో ఓడించిన టీమ్ ఇండియా.. తన తొలి విజయాన్ని నమోదు చేసింది. అయితే ఆఫ్ఘనిస్తాన్‌తో జరిగిన టీ20 ప్రపంచకప్ గేమ్‌ను భారత క్రికెట్ కంట్రోల్ బోర్డు (BCCI) “కొనుగోలు” చేసిందని పాకిస్థాన్ టెలివిజన్ నటి ఆరోపించింది. అయితే దీనికి భారత మాజీ క్రికెటర్ ఆకాష్ చోప్రా బుధవారం తగిన కౌంటర్ ఇచ్చారు.
టీ20 ప్రపంచకప్‌లో తమ తొలి రెండు మ్యాచ్‌ల్లో పాకిస్థాన్, న్యూజిలాండ్‌ల చేతిలో ఓడిపోయిన టీమ్ ఇండియా బుధవారం 66 పరుగుల తేడాతో ఆఫ్ఘనిస్తాన్‌ను ఓడించిన సంగతి తెలిసిందే. రోహిత్ శర్మ, కేఎల్ రాహుల్ తుఫాన్ ఇన్నింగ్స్‌తో భారత్ రెండు వికెట్ల నష్టానికి 210 పరుగులు చేసింది. అనంతరం ఆఫ్ఘనిస్తాన్ ఛేజింగ్‌లో మంచి ఆరంభాన్ని పొందడంలో విఫలమైంది. దీంతో నిర్ణీత 20 ఓవర్లలో ఏడు వికెట్లకు 144 పరుగులకే పరిమితమైంది. ఈ క్రమంలోనే వరుసగా వికెట్లు కోల్పోయింది. ఈ విజయం సెమీస్‌లో స్థానం కోసం పోటీలో నిలవడానికి టీమిండియాకు దోహదపడనుంది.
“టీమిండియా.. టీమిండియాలానే ఆడింది” అని ఆకాష్ మ్యాచ్ ముగిసిన తర్వాత ట్వీట్ చేశాడు. అయితే, ‘బీసీసీఐ మంచి మ్యాచ్‌ని కొనుగోలు చేసింది’ అని నటి సెహర్ షిన్వారీ ఆకాష్ చోప్రా ట్వీట్‌కు రిప్లై ఇచ్చింది. ఆ వెంటనే ఆకాష్ బదులిచ్చాడు.. “వక్రబుద్ది గల మనస్సుల నుంచి ఇలాంటి నెగిటివ్ మాటలే వస్తాయి” అంటూ కౌంటర్ ఇచ్చాడు.
ఆఫ్ఘనిస్తాన్ టీం న్యూజిలాండ్‌ను ఓడించాలని ఆశించగా, గ్రూప్ 2లోని మిగిలిన గేమ్‌లలో భారత జట్టు నమీబియా, స్కాట్‌లాండ్‌లను భారీ తేడాతో ఓడించాల్సి ఉంటుంది. తమ నాలుగు గ్రూప్ గేమ్‌ల్లోనూ గెలిచి సెమీస్‌లో బెర్త్‌ను ఖాయం చేసుకున్న ఏకైక జట్టుగా పాకిస్థాన్ నిలిచింది.
BCCI bought a good match ? https://t.co/2SWhLRbAig
— Sehar Shinwari (@SeharShinwari) November 3, 2021
? https://t.co/ezg5o98KOh pic.twitter.com/KnxQkIDjQi
— Aakash Chopra (@cricketaakash) November 3, 2021
Also Read: Sooryavanshi: ‘సూర్యవంశీ’లో ఎంఎస్ ధోని.. ఆసక్తి రేకిత్తిస్తోన్న గుల్షన్ గ్రోవర్ సీక్రెట్ పోస్ట్
Rahul Dravid: ‘టీ20లకు తర్వాతి కెప్టెన్ అతడే’.. రాహుల్ ద్రవిడ్ ఏమన్నాడంటే..