ICC T20 World Cup 2021: గోరంత ఆశలో కోహ్లీసేన.. కాలం కలిసి వస్తుందా?.. కప్ పోరులో నిలుస్తుందా?..
ICC T20 World Cup 2021: గోరంత ఆశలో కోహ్లీసేన.. కాలం కలిసి వస్తుందా?.. కప్ పోరులో నిలుస్తుందా?..
ICC T20 World Cup 2021: టీ20 వరల్డ్ కప్‌లో భారత్ సెమీస్ చేరేందుకు ఇప్పటికీ అవకాశాలు ఉన్నాయి. అయితే, పెద్ద మిరాకిల్ జరిగితే గానీ అది సాధ్యపడదని చెప్పాలి. ఇప్పటికే రెండు మ్యాచ్‌ల్లో ఓడి.. ఒక దాంట్లో మాత్రమే గెలిచిన టీమిండియా.. పాయింట్ల పట్టికలో నాలుగో స్థానంలో నిలిచింది. ఇలాంటి తరుణంలో సెమీస్ బెర్‌పై కోహ్లీసేనకు గోరంత ఆశ.. ఊరిస్తోంది. అదెలాగో ఇప్పుడు చూద్దాం.. గ్రూప్ 2లో పాకిస్తాన్ ఇప్పటికే సెమీస్ బెర్త్ ఖాయం చేసుకుంది. గ్రూప్‌లో మిగిలిన రెండో సెమీస్ బెర్త్ కోసం న్యూజిలాండ్, ఆఫ్ఘనిస్తాన్, భారత్ పోరాడుతున్నాయి. ఇవాళ స్కాట్లాండ్‌తో భారత్ తలపడనుంది. అయితే, పాయింట్ల పట్టికలో నాలుగో స్థానంలో ఉన్న భారత్.. మీస్ చేరాలంటే తాను ఆడాల్సిన రెండు మ్యాచుల్లో మెరుగైన రన్ రేట్‌తో విజయం సాధించాలి. అంతేకాదు.. న్యూజిలాండ్ పై ఆఫ్ఘనిస్తాన్ టీమ్ గెలిచి తీరాలి. న్యూజిలాండ్ ఇంకా రెండు మ్యాచులు ఆడాల్సి ఉంది. ఈ రోజు నమీబియా జట్టుతో న్యూజిలాండ్ తలపడనుంది. చిన్న జట్టైన నమీబియాపై న్యూజిలాండ్ తేలికగా గెలిచే ఛాన్సెస్ ఎక్కువగా ఉన్నాయి. ఒకవేళ అదే జరిగితే.. న్యూజిలాండ్ జట్టు 6 పాయింట్లతో నిలుస్తుంది. ఇక ఈనెల 7న జరిగే న్యూజిలాండ్- ఆఫ్ఘనిస్తాన్ మ్యాచ్ ఆ జట్ల తోపాటు భారత్ కు సైతం కీలకంగా మారనుంది. ఈ మ్యాచ్‌లో ఆప్ఘనిస్తాన్ గెలిచి.. భారత్ తాను ఆడే స్కాట్లాండ్, నమీబియా మ్యాచుల్లో గెలిస్తే.. అప్పుడు న్యూజిలాండ్, ఆఫ్ఘనిస్తాన్, భారత్ లు తలా ఆరు పాయింట్లతో సమానంగా నిలుస్తాయి.
ఈ పరిస్థితిలో రెండో సెమీస్ బెర్త్ ఖరారు కావాలంటే రన్ రేటే కీలకం. భారత్ ప్రస్తుత రన్ రేట్ ప్లస్ 0.073 గా ఉంది. మరి భారత్ సెమీస్ చేరాలంటే ఆఫ్ఘనిస్తాన్ రన్ రేట్ ప్లస్ 1.481 మించి రన్ రేట్ సాధించాలి. ప్రస్తుతం గ్రూప్-2 పాయింట్ల పట్టికలో ఆయా జట్ల స్థానాలు మనం అనుకున్నట్లు జరుగుతాయా అంటే.. నవంబర్ 7న ఆఫ్ఘన్- కివీస్ మ్యాచ్ వరకు ఓపిక పట్టాల్సిందే. క్రికెట్‌లో ఏదైనా సంభవమే అంటున్నారు ఆశావహులు.
టీ20 వరల్డ్ కప్ గ్రూప్ పాయింట్ల పట్టిక వివరాలు.. పాకిస్తాన్: ఆడిన మ్యాచ్‌లు – 4, గెలిచినవి – 4, ఓడినవి – 0 , పాయింట్లు – 8, రన్ రేట్ – + 1.065 ఆఫ్ఘనిస్తాన్: ఆడిన మ్యాచ్‌లు – 4, గెలిచినవి – 2, ఓడినవి – 2, పాయింట్లు – 4, రన్ రేట్ – +1.481 న్యూజిలాండ్: ఆడిన మ్యాచ్‌లు – 3, గెలిచినవి – 2, ఓడినవి – 1, పాయింట్లు – 4, రన్ రేట్ – +0.816 భారత్: ఆడిన మ్యాచ్‌లు – 3, గెలిచినవి – 1, ఓడినవి – 2, పాయింట్లు – 2, రన్ రేట్ – +0.073 నమీబియా: ఆడిన మ్యాచ్‌లు – 3, గెలిచినవి – 1, ఓడినవి – 2, పాయింట్లు – 2, రన్ రేట్ – -1.600 స్కాట్లాండ్: ఆడిన మ్యాచ్‌లు – 3, గెలిచినవి – 0, ఓడినవి – 3, పాయింట్లు – 0, రన్ రేట్ – -2.645
Also read:
Delhi Pollution: దేశ రాజధాని ఢిల్లీలో ఉక్కిరిబిక్కిరి.. ప్రమాదకర స్థాయికి చేరిన వాయు కాలుష్యం..