Cricket News: బౌల్ట్‌కు విశ్రాంతి.. ఐదుగురు స్పిన్నర్లతో బరిలోకి.. ఇండియాతో టెస్ట్ సిరీస్‌కు కివీస్ జట్టు ఎంపిక..
దుబాయి వేదికగా ప్రస్తుతం జరుగుతున్న టీ20 ప్రపంచకప్ ముగిసిన వెంటనే న్యూజిలాండ్ క్రికెట్ జట్టు భారత్‌లో పర్యటించనుంది...
దుబాయి వేదికగా ప్రస్తుతం జరుగుతున్న టీ20 ప్రపంచకప్ ముగిసిన వెంటనే న్యూజిలాండ్ క్రికెట్ జట్టు భారత్‌లో పర్యటించనుంది. టీమిండియాతో మొత్తం మూడు టీ20లు, రెండు టెస్ట్‌లు ఆడనుంది. ఈ మేరకు టెస్ట్, టీ 20 సిరీస్‌ల్లో భారత్‌ను ఎదుర్కొనే కివీస్ జట్టును న్యూజిలాండ్ బోర్డు ప్రకటించింది. ఆశ్చర్యకరంగా స్టార్ బౌలర్ ట్రెండ్ బౌల్ట్, మేటి ఆల్‌రౌండర్ కొలిన్ డీ గ్రాండ్‌హోమ్‌లకు విశ్రాంతినిచ్చింది. వీరు గత కొన్ని నెలలుగా బయోబబుల్‌లో ఉంటూ అలుపు లేకుండా క్రికెట్ ఆడుతున్నారని.. అందుకే విశ్రాంతినిచ్చినట్లు బోర్డు తెలిపింది. ఇక భారత బ్యాటర్లను ఇబ్బంది పెట్టేందుకుగాను ఏకంగా ఐదుగురు స్పిన్నర్లకు జట్టులో చోటు కల్పించడం విశేషం.
భారత్- కివీస్ షెడ్యూల్ ఇదే.. 1. మొదటి టీ 20 మ్యాచ్ – నవంబర్ 17 – జైపూర్ 2. రెండో టీ 20 – నవంబర్ 19 – రాంచీ 3. మూడో టీ 20 – నవంబర్ 21- కోల్‌కతా 4. మొదటి టెస్ట్ మ్యాచ్ – నవంబర్(25-29) – కాన్పూర్ 5. రెండో టెస్ట్ మ్యాచ్ – డిసెంబర్ (3-7) – ముంబయి
న్యూజిలాండ్ టెస్ట్ జట్టు: కేన్ విలియమ్సన్ (కెప్టెన్), టామ్ బ్లండెల్(వికెట్ కీపర్), డెవాన్ కాన్వే, కైల్ జేమీసన్, టామ్ లాథమ్, హెన్రీ నికోలస్, అజాజ్ పటేల్, గ్లెన్ ఫిలిప్స్, రచిన్ రవీంద్ర, మిచెల్ సాంట్నర్, విల్ సోమర్‌విల్లే, టిమ్ సౌథీ, రాస్‌టేలర్, విల్ యంగ్
టీ20 జట్టు: కేన్ విలియమ్సన్ (కెప్టెన్), టిమ్ సీఫెట్ (వికెట్ కీపర్), టాడ్ ఆస్టిల్, ట్రెంట్ బౌల్ట్, మార్క్ చాప్‌మన్, డెవాన్ కాన్వే, మార్టిన్ గుప్తిల్, కైల్ జేమీసన్, డారిల్ మిచెల్, జిమ్మీ నీషమ్, గ్లెన్ ఫిలిప్స్, మిచెల్ సాంట్నర్, ఇష్ సోధి, టిమ్ సౌధీ, ఆడమ్ మిల్నే
Also Read: