Virat Kohli Dance Video: మైదానంలో కేక పుట్టించిన విరాట్ కోహ్లీ.. వైరలవుతోన్న వీడియో..
Virat Video: అఫ్గానిస్థాన్‌పై అద్భుత ప్రదర్శనతో భారత జట్టు 66 పరుగుల తేడాతో విజయం సాధించింది. సెమీఫైనల్‌కు చేరుకోవాలన్న ఆ జట్టు ఆశలు ఇంకా సజీవంగానే ఉన్నాయి.
T20 World Cup 2021: భారత జట్టు కెప్టెన్ విరాట్ కోహ్లీ తరచుగా నెట్టింట్లోనే ఉంటాడు. కొన్నిసార్లు అతను తన అద్భుతమైన బ్యాటింగ్ కారణంగా ప్రజల దృష్టిని ఆకర్షిస్తే.. మరికొన్నిసార్లు మైదానంలో ఉద్వేగభరితమైన వైఖరితో చర్చనీయాంశంగా మారుతాడు. అయితే, ఈసారి విరాట్ కోహ్లీ తన డ్యాన్స్‌తో సోషల్ మీడియాలో సంచలనంగా మారాడు. ఆఫ్ఘనిస్తాన్‌తో ఆడిన మ్యాచ్‌కి సంబంధించిన అతని వీడియో ఒకటి ప్రస్తుతం చాలా వైరల్‌గా మారింది.
ఆఫ్ఘనిస్థాన్ జట్టు బ్యాటింగ్ చేస్తున్నప్పటి నుంచి కోహ్లి ‘మై నేమ్ ఈజ్ లఖన్’ అంటూ కేక పుట్టించేలా మైదానంలో డ్యాన్స్ చేశాడు. ఆ తర్వాత బాలీవుడ్ నటుడు అనిల్ కపూర్ పాడిన ‘మై నేమ్ ఈజ్ లఖన్’ అనే ఫేమస్ సాంగ్ స్టేడియంలో ప్లే కావడం మొదలైంది. విరాట్ కోహ్లి బౌండరీ లైన్ దగ్గర ఫీల్డింగ్ కోసం వచ్చాడు. ఇకేముంది ఈ పాటకు డ్యాన్స్ చేస్తూ సందడి చేశాడు. ఇది చూసిన అభిమానులు కూడా కామెంట్లతో రెచ్చిపోయారు. ఈ వీడియో ఇంటర్నెట్‌లో చేరిన తరువాత వైరల్‌గా మారింది. ఇప్పటి వరకు లక్షలాది మంది ఈ వీడియోను వీక్షించి, షేర్ చేశారు.
విరాట్ కోహ్లీ మైదానంలో డ్యాన్స్‌పై చర్చించడం ఇదే మొదటిసారి కాదు. ఇంతకు ముందు కూడా చాలా వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. 2016 టీ20 ప్రపంచకప్, అదే ఏడాది జరిగిన ప్రపంచ టెస్ట్ ఛాంపియన్‌షిప్ ఫైనల్‌లోనూ విరాట్ కోహ్లీ డ్యాన్స్ చేస్తూ కనిపించాడు. విశేషమేమిటంటే 2016లో కూడా ఇదే పాటకు డ్యాన్స్ చేశాడు.
టీమ్ ఇండియా సెమీఫైనల్ ఆశలు.. భారత జట్టు బుధవారం ఆఫ్ఘనిస్తాన్‌ను 66 పరుగుల తేడాతో ఓడించి టీ 20 ప్రపంచకప్‌లో తొలి విజయాన్ని నమోదు చేసింది. ఈ మ్యాచ్‌లో రోహిత్ శర్మ 74, కేఎల్ రాహుల్ 69 పరుగులు చేశారు. దీని తర్వాత హార్దిక్ పాండ్యా, రిషబ్ పంత్ కూడా చెలరేగి బ్యాటింగ్ చేసి జట్టు స్కోరును 210కి తీసుకెళ్లారు. సెమీఫైనల్‌కు చేరుకోవాలన్న టీమిండియా ఆశలు ఇంకా సజీవంగానే ఉన్నాయి. తదుపరి రెండు మ్యాచ్‌లను భారీ తేడాతో గెలవడంతోపాటు, న్యూజిలాండ్ ఆఫ్ఘనిస్తాన్ చేతిలో ఓడిపోతేనే టీమ్ ఇండియా సెమీ ఫైనల్‌కు చేరుకుంటుంది.
❤?❤? pic.twitter.com/8yeC1Nw2Iz
— riya (@reaadubey) November 4, 2021