Pakistan vs West Indies: పాకిస్తాన్‌కు గుడ్‌న్యూస్ చెప్పిన వెస్టిండీస్.. అదేంటో తెలుసా?
West Indies Tour Of Pakistan: వెస్టిండీస్ క్రికెట్ బోర్డు పాకిస్తాన్‌కు శుభవార్తను అందించింది. ఇప్పటికే పలు టీంలు భద్రతా కారణాలతో పాక్ పర్యటను రద్దు చేసుకుంటున్న సంగతి తెలిసిందే.
West Indies Tour Of Pakistan: వెస్టిండీస్ క్రికెట్ బోర్డు పాకిస్తాన్‌కు శుభవార్తను అందించింది. ఇప్పటికే పలు టీంలు భద్రతా కారణాలతో పాక్ పర్యటను రద్దు చేసుకుంటున్న సంగతి తెలిసిందే. ఇలాంటి తరుణంలో కరేబీయన్ టీం పాక పర్యటనకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. దీంతో పాక్ క్రికెట్ బోర్డు ఆనందం వ్యక్తం చేసింది. ఈ మేరకు విండీస్ బోర్డు ఓ ప్రకటనను విడుదల చేసింది. అలాగే పర్యటనకు సంబంధించిన వివరాలను పాక్ క్రికెట్ బోర్డు విడుదల చేసింది. వచ్చే నెలలో కరేబీయన్ టీం పాకిస్తాన్ పర్యటనకు వెళ్లనుంది. ఇందులో భాగంగా 3 టీ20లు, 3 వన్డే మ్యాచ్‌ల సీరీస్ ఆడనున్నటట్లు పాకిస్తాన్ క్రికెట్ బోర్డు ప్రకటించింది. డిసెంబరు 9న వెస్టిండీస్ టీం పాక్ చేరుకుంటుంది. డిసెంబర్ 13న తొలి టీ20లో ఇరుజట్లు తలపడనున్నాయి. ఇక చివరగా వన్డే సిరీస్‌లో మూడో మ్యాచును డిసెంబర్ 22న ఆడనున్నాయి. అయితే కరేబీయన్ టీం 2018 తరువాత పాక్ పర్యటనకు వెళ్లనుంది.
మరోవైపు 18 ఏళ్ల తర్వాత పాక్ టూర్‌కు వచ్చిన కివీస్ టీం తొలి వన్డే ప్రారభంకానికి కొద్ది గంటల్లోనే భద్రతా కారణాలతో పర్యటనను క్యాన్సిల్ చేసుకుంది. ఇదే కారణంతో ఇంగ్లీష్ టీం కూడా తన పర్యటనను రద్దు చేసుకుంది. దీంతో పాకిస్తాన్ క్రికెట్ బోర్డుతో పాటు మాజీ ఆటగాళ్లు కివీస్, ఇంగ్లండ్ క్రికెట్ బోర్డులపై ఆగ్రహం వ్యక్తం చేస్తూ విమర్శలు చేశారు.
దీంతో ఈ టీంలపై ప్రస్తుతం జరుగుతున్న టీ20 ప్రపంచ కప్‌లో ప్రతీకారం తీర్చుకోవాలని పాక్ మాజీ ఆటగాళ్లు కోరారు. అలాగే న్యూజిలాండ్ టీం అద్భుతంగా ఆడుతూ వరుస విజయాలు సాధించి సెమీస్ చేరుకుంది. ఈ క్రమంలోనే న్యూజిలాండ్ టీంను దారుణంగా ఓడించారు.
పాకిస్తాన్ వర్సెస్ వెస్టిండీస్ మ్యాచుల వివరాలు: డిసెంబర్ 13- తొలి టీ20 డిసెంబర్ 14- రెండవ టీ20 డిసెంబర్ 16- మూడవ టీ20 డిసెంబర్ 18- తొలి వన్డే డిసెంబర్ 20- రెండవ వన్డే డిసెంబర్ 22- మూడవ వన్డే అన్ని మ్యాచులు కరాచీలో జరుగుతాయని పాకిస్తాన్ క్రికెట్ బోర్డు ప్రకటించింది.
“West Indies tour will formally kick-off of an exciting and entertaining season of men’s international cricket in Pakistan with HBL Pakistan Super League 2022 and Australia’s first full series to follow,” says PCB Chairman Ramiz Raja
Details here: https://t.co/QUxMNap2gH#PAKvWI
— PCB Media (@TheRealPCBMedia) November 4, 2021
Also Read: Virat Kohli Dance Video: మైదానంలో కేక పుట్టించిన విరాట్ కోహ్లీ.. వైరలవుతోన్న వీడియో..