Ind vs Sco: న్యూజిలాండ్‌ను భయపెట్టిన స్కాట్లాండ్.. మరి భారత్ ఎలా ఆడనుందో.. సెమీఫైనల్ చేరాలంటే కోహ్లీసేన ముందున్న టార్గెట్ ఏంటంటే?

T20 World Cup 2021 Points Table: సెమీ ఫైనల్స్‌పై టీమిండియాకు ఎలాంటి ఆశలున్నాయి. కోహ్లీ సేన టాప్-4కి చేరాలంటే ఏం చేయాలో చూద్దాం..

Ind vs Sco: న్యూజిలాండ్‌ను భయపెట్టిన స్కాట్లాండ్.. మరి భారత్ ఎలా ఆడనుందో.. సెమీఫైనల్ చేరాలంటే కోహ్లీసేన ముందున్న టార్గెట్ ఏంటంటే?
Ind
Follow us
Venkata Chari

|

Updated on: Nov 04, 2021 | 9:03 PM

T20 World Cup 2021: అఫ్గానిస్థాన్‌పై భారత్ 66 పరుగులతో అద్భుత విజయం సాధించడంతో టీమిండియా సెమీఫైనల్ అవకాశాలను పునరుద్ధరించుకుంది. టీ20 ప్రపంచకప్‌లో భారత్ తొలి రెండు మ్యాచ్‌ల్లోనూ ఓడిపోయింది. తొలుత పాకిస్థాన్, ఆ తర్వాత న్యూజిలాండ్ భారత జట్టును ఓడించాయి. ఇప్పుడు విరాట్ సైన్యం బుధవారం అబుదాబిలో ఆఫ్ఘనిస్తాన్‌ను ఓడించడం ద్వారా అద్భుతమైన పునరాగమనం చేసింది.

ఈ విజయంతో టీమ్ ఇండియా నెట్ రన్ రేట్ చాలా మెరుగుపడింది. ఇంతకుముందు భారతదేశం రన్ రేట్ -1.9గా ఉంది. ప్రస్తుత విజయంతో రన్ రేట్ +0.073గా మారింది. భారత గ్రూప్‌లో ఆఫ్ఘనిస్తాన్ అత్యుత్తమ రన్ రేట్ (+1.481) కలిగి ఉంది. సెమీఫైనల్‌కు చేరుకోవడానికి భారత్‌కు ఎన్ని అవకాశాలు ఉన్నాయో చూద్దాం.

మొదట స్కాట్లాండ్-నమీబియాపై భారీ విజయాలు కావాలి.. మొదట టీమ్ ఇండియా స్కాట్లాండ్, నమీబియాలను భారీ తేడాతో ఓడించాలి. దీంతో ఆఫ్ఘనిస్తాన్, ఇండియా మధ్య రన్ రేట్ తేడాను కవర్ చేస్తుంది. గ్రూప్‌లో నాలుగు విజయాలు, ఎనిమిది పాయింట్లతో, పాకిస్తాన్ పట్టికలో నంబర్ వన్ స్థానంలో ఉంది. ఇప్పటికే సెమీ-ఫైనల్‌కు చేరుకుంది. సూపర్ 12లో ప్రతి గ్రూప్ నుంచి మొదటి రెండు జట్లు మాత్రమే సెమీ-ఫైనల్‌కు వెళ్లగలవు. ప్రస్తుతం టీమ్ ఇండియా తన గ్రూప్‌లో నాలుగో స్థానంలో ఉంది.

న్యూజిలాండ్‌పై.. అఫ్గానిస్థాన్ టీంపై భారత్ ఆశలు పెట్టుకుంది. న్యూజిలాండ్‌ టీంపై అఫ్గానిస్థాన్ గెలుస్తుందని టీమ్ ఇండియా కూడా కోరుకుంటుంది. ఇలాంటి పరిస్థితుల్లో భారత్‌కు సెమీఫైనల్‌కు చేరే అవకాశాలు పెరుగుతాయి. ఆఫ్ఘనిస్థాన్ కూడా అదే చేయగలదు. పాకిస్థాన్‌పై అద్భుతమైన ఆటతీరు కనబరిచింది. ఒకవేళ న్యూజిలాండ్ ఓడిపోతే ఆ జట్టుతో పాటు టీమిండియాకు 6 పాయింట్లు ఉంటాయి. ఈ పరిస్థితిలో అత్యుత్తమ నెట్ రన్ రేట్ ఉన్న జట్టు సెమీఫైనల్‌కు చేరుకుంటుంది. ఆఫ్ఘనిస్తాన్ టీం న్యూజిలాండ్‌ను ఓడించగలిగితే, భారత్‌కు అనుకూలంగా మారేది ఏమిటంటే, నమీబియాతో భారత్‌ మ్యాచ్‌లో సెమీ-ఫైనల్‌కు చేరుకోవడానికి నమీబియాను ఏ మార్జిన్‌తో ఓడించాలో వారికి తెలుస్తుంది.

మరోవైపు స్కాట్లాండ్‌పై పాకిస్థాన్ భారీ తేడాతో గెలిస్తే, న్యూజిలాండ్ టీం ఆఫ్ఘనిస్థాన్‌పై విజయం సాధించింది. ఈ పరిస్థితిలో పాకిస్తాన్, న్యూజిలాండ్ అర్హత సాధించడంతో భారత్ తిరిగి ముంబైకి వెళ్లనుంది.

Also Read: భారత్ వర్సెస్ పాక్ టెస్ట్ మ్యాచ్ జరగాల్సిందే.. లేదంటే టెస్ట్ ఛాంపియన్ షిప్‌కు అర్థమే లేదంటోన్న పాక్ దిగ్గజ ప్లేయర్లు

T20 World Cup 2021: నాలుగేళ్ల వనవాసం ముగిసింది.. ఆనాటి పరిస్థితులెంతో కఠినం: భావోద్వేగానికి గురైన భారత స్టార్ బౌలర్..!

కుప్పకూలిన విమానం.. ఘటన సమయంలో విమానంలో 72 మంది.!
కుప్పకూలిన విమానం.. ఘటన సమయంలో విమానంలో 72 మంది.!
మన్యంలో మెరుస్తున్న రోడ్లు.! రోడ్ల మరమ్మతులు, నిర్మాణాలపై ఫోకస్‌!
మన్యంలో మెరుస్తున్న రోడ్లు.! రోడ్ల మరమ్మతులు, నిర్మాణాలపై ఫోకస్‌!
వాటర్‌ బాటిల్‌తో చేపలు ఇట్టే పట్టేశారే.. ఐడియా అదిరిందిగా.!
వాటర్‌ బాటిల్‌తో చేపలు ఇట్టే పట్టేశారే.. ఐడియా అదిరిందిగా.!
వీళ్లు మహా కంత్రీగాళ్లు.. నిమిషంలో లక్షలు కొల్లగొట్టారు.!
వీళ్లు మహా కంత్రీగాళ్లు.. నిమిషంలో లక్షలు కొల్లగొట్టారు.!
ఎవరీ బేబీ 81.. ఏంటా కథ.? ప్రపంచం దృష్టిని ఆకర్షించిన బేబీ 81’ కథ.
ఎవరీ బేబీ 81.. ఏంటా కథ.? ప్రపంచం దృష్టిని ఆకర్షించిన బేబీ 81’ కథ.
డిప్ చాయ్ తాగే వాళ్లకు షాకింగ్ న్యూస్.టీ కలిపేటప్పుడు చాలజాగ్రత్త
డిప్ చాయ్ తాగే వాళ్లకు షాకింగ్ న్యూస్.టీ కలిపేటప్పుడు చాలజాగ్రత్త
డ్రగ్ స్మగ్లర్ హత్య.. చంపి పగ తీర్చుకున్న బిష్ణోయ్ గ్యాంగ్.!
డ్రగ్ స్మగ్లర్ హత్య.. చంపి పగ తీర్చుకున్న బిష్ణోయ్ గ్యాంగ్.!
మీ శరీరంలో ఈ లక్షణాలు కనిపిస్తే అస్సలు నిర్లక్ష్యం చెయ్యద్దు.!
మీ శరీరంలో ఈ లక్షణాలు కనిపిస్తే అస్సలు నిర్లక్ష్యం చెయ్యద్దు.!
మౌనముని, ఆర్థిక మేధావికి అంతిమ వీడ్కోలు
మౌనముని, ఆర్థిక మేధావికి అంతిమ వీడ్కోలు
పులి రోజుకు ఎన్ని కిలోమీటర్లు పరుగెడుతోందో తెలుసా..?
పులి రోజుకు ఎన్ని కిలోమీటర్లు పరుగెడుతోందో తెలుసా..?