Post Office Scheme: ప్రతి నెల రూ. 1500 పెట్టుబడి పెట్టండి.. మెచ్యూరిటీ కాలానికి రూ. 35 లక్షలు పొందండి.. పూర్తి వివరాలు మీకోసం..
Post Office Scheme: ఇండియా పోస్ట్ ఆఫీస్.. పెట్టుబడిదారులకు సురక్షితమైన, నిశ్చయమైన రాబడిని అందించే అనేక పెట్టుబడి పథకాలను అందిస్తుంది. మార్కెట్-లింక్డ్ స్కీమ్‌లతో

Post Office Scheme: ఇండియా పోస్ట్ ఆఫీస్.. పెట్టుబడిదారులకు సురక్షితమైన, నిశ్చయమైన రాబడిని అందించే అనేక పెట్టుబడి పథకాలను అందిస్తుంది. మార్కెట్-లింక్డ్ స్కీమ్‌లతో పోల్చితే, పోస్ట్ ఆఫీస్ పెట్టుబడి పథకాలు ఈక్విటీ పనితీరుపై ఆధారపడనందున ఇందులో పెట్టుబడి పెట్టడం సురక్షితం అని చెప్పొచ్చు. సురక్షితమైన పెట్టుబడులు పెట్టాలనుకునే వారు, తమ భవిష్యత్తును సురక్షితంగా ఉంచుకోవడానికి పోస్ట్ ఆఫీస్ పథకాలలో పెట్టుబడి పెట్టవచ్చు.
పోస్ట్ ఆఫీస్ పథకాల్లో ‘గ్రామ సురక్ష పథకం’ ముఖ్యమైనది. ఈ పథకం గురించిన వివరాలు ఇప్పుడు తెలుసుకుందాం.. ఈ పథకంలో భాగంగా పెట్టుబడిదారులు ప్రతి నెలా కేవలం రూ. 1500 పెట్టుబడి పెట్టడం ద్వారా మెచ్యూరిటీ సమయంలో రూ. 35 లక్షల వరకు పొందవచ్చు. 19 సంవత్సరాల నుండి 55 సంవత్సరాల మధ్య వయస్సు గల భారతీయ పౌరులు ఎవరైనా ఈ పోస్ట్ ఆఫీస్ పథకంలో పెట్టుబడి పెట్టవచ్చు. ఈ పథకం కింద కనీస హామీ మొత్తం రూ. 10,000 నుండి రూ. 10 లక్షల వరకు ఉంటుంది. ఇక ఈ పథకంలో ప్రీమియంలు నెలవారీ, త్రైమాసికం, అర్ధ-సంవత్సరం లేదా వార్షికంగా కట్టుకోవచ్చు. ఇన్వెస్టర్లు ప్రీమియం చెల్లించడానికి 30 రోజుల గ్రేస్ పీరియడ్ కూడా లభిస్తుంది. అంతేకాకుండా, ఎంచుకున్న టైమ్ పిరియడ్‌లో పెట్టుబడి పెట్టిన తర్వాత పెట్టుబడిదారులు అడ్వాన్స్ కూడా తీసుకోవచ్చు.
నెలకు దాదాపు రూ.1500తో రూ. 35 లక్షల ఎలా వస్తాయి? ఒక వ్యక్తి పోస్ట్ ఆఫీస్ స్కీమ్‌లో 19 సంవత్సరాల వయస్సు నుండి పథకంలో చేరాడు. రూ. 10 లక్షల స్కీమ్‌లో చేరి పెట్టుబడి పెట్టడం ప్రారంభించాడు. అతను/ఆమె 55 సంవత్సరాల పాటు పథకంలో పెట్టుబడి పెట్టిన తర్వాత రూ. 31.60 లక్షలు పొందుతారు. మరో ఐదేళ్ల పాటు పాలసీలో ఇన్వెస్ట్ చేయడం కొనసాగిస్తే.. అప్పుడు మీరు 60 ఏళ్ల పెట్టుబడి తర్వాత రూ. 34.60 లక్షలు పొందుతారు.
Also read:
Delhi Pollution: దేశ రాజధాని ఢిల్లీలో ఉక్కిరిబిక్కిరి.. ప్రమాదకర స్థాయికి చేరిన వాయు కాలుష్యం..
Sunny Leone: సరికొత్త వ్యాపారంలోకి సన్నీలియోన్.. ఈ బిజినెస్ చేస్తున్న మొదటి భారతీయ నటి ఆమెనే..