Team India: ‘ప్రపంచకప్ ఫైనల్‌లో ఓడిపోయిన కెప్టెన్ అతను..’: రోహిత్ శర్మపై కీలక వ్యాఖ్యలు చేసిన యూవీ..

Yuvraj Sing on Rohit Sharma Captaincy: టీ20 ప్రపంచకప్‌నకు యువరాజ్‌సింగ్‌ బ్రాండ్‌ అంబాసిడర్‌గా నియమితులైన సంగతి తెలిసిందే. ప్రస్తుతం అతను టీ20 ప్రపంచకప్‌ను నిరంతరం ప్రమోట్ చేస్తున్నాడు. 2007 టీ20 ప్రపంచకప్ గెలవడంలో యువరాజ్ సింగ్ కీలక పాత్ర పోషించాడు. ఆ టోర్నీలో అతను ఒకే ఓవర్‌లో ఆరు సిక్సర్లు బాదిన సంగతి తెలిసిందే. 2011 ప్రపంచకప్ విజయంలో యువరాజ్ కూడా చాలా ముఖ్యమైన పాత్ర పోషించాడు.

Team India: 'ప్రపంచకప్ ఫైనల్‌లో ఓడిపోయిన కెప్టెన్ అతను..': రోహిత్ శర్మపై కీలక వ్యాఖ్యలు చేసిన యూవీ..
Yuvi On Rohit
Follow us
Venkata Chari

|

Updated on: May 07, 2024 | 12:29 PM

Yuvraj Sing on Rohit Sharma Captaincy: మాజీ వెటరన్ ఆల్ రౌండర్ యువరాజ్ సింగ్ టీ 20 ప్రపంచ కప్ 2024 కోసం టీమ్ ఇండియా కెప్టెన్ రోహిత్ శర్మపై కీలక కామెంట్స్ చేశాడు. ఈ టీ20 ప్రపంచకప్‌లో రోహిత్ శర్మ లాంటి కెప్టెన్ మనకు అవసరమని చెప్పుకొచ్చాడు. యువరాజ్ సింగ్ ప్రకారం, 2023 ప్రపంచ కప్ ఫైనల్‌లో భారత్ ఓడిపోయినప్పుడు, రోహిత్ శర్మ కెప్టెన్‌గా ఉన్నాడు. అయినప్పటికీ మనకు అతనిలాంటి కెప్టెన్ అవసరం అంటూ తెలిపాడు.

నిజానికి, విరాట్ కోహ్లీ రాజీనామా తర్వాత, రోహిత్ శర్మ భారత జట్టుకు కెప్టెన్‌గా నియమితుడయ్యాడు. ఐపీఎల్‌లో అతని అద్భుతమైన రికార్డును దృష్టిలో ఉంచుకుని, అతనికి కెప్టెన్సీ బాధ్యతలు అప్పగించారు. కానీ, ఇప్పటివరకు రోహిత్ శర్మ నాయకత్వంలో టీమిండియా ఒక్క ఐసీసీ టైటిల్ కూడా గెలవలేకపోయింది. గతేడాది ప్రపంచకప్ ఫైనల్‌లో ఆస్ట్రేలియా చేతిలో ఓటమి చవిచూడాల్సి వచ్చింది.

రోహిత్ శర్మ లాంటి కెప్టెన్ కావాలి: యువరాజ్ సింగ్

రోహిత్ శర్మ T20 ప్రపంచ కప్ 2024 కోసం భారత జట్టుకు కెప్టెన్‌గా కూడా నియమించారు. యువరాజ్ సింగ్ అతని గురించి బహిరంగంగా తన అభిప్రాయాన్ని వ్యక్తం చేశాడు. ఐసీసీతో మాట్లాడిన సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. రోహిత్ శర్మ ఉనికి చాలా కీలకం కానుంది. నా అభిప్రాయం ప్రకారం, ఒత్తిడిలో మెరుగైన నిర్ణయాలు తీసుకోగల అద్భుతమైన, తెలివైన కెప్టెన్ కావాలి. రోహిత్ శర్మ ఈ పనిని బాగా చేయగలడు. 50 ఓవర్ల ప్రపంచకప్ ఫైనల్‌లో ఓడిపోయినప్పుడు రోహిత్ శర్మ కెప్టెన్‌గా ఉన్నాడు. కెప్టెన్‌గా ఐదుసార్లు ఐపీఎల్ ట్రోఫీని గెలుచుకున్నాడు. అతనిలాంటి కెప్టెన్ మనకు అవసరమని నేను భావిస్తున్నాను. ప్రపంచ కప్ ట్రోఫీ, ప్రపంచ కప్ పతకంతో నేను అతనిని చూడాలనుకుంటున్నాను’ అంటూ తెలిపాడు.

ఇవి కూడా చదవండి

టీ20 ప్రపంచకప్‌నకు యువరాజ్‌సింగ్‌ బ్రాండ్‌ అంబాసిడర్‌గా నియమితులైన సంగతి తెలిసిందే. ప్రస్తుతం అతను టీ20 ప్రపంచకప్‌ను నిరంతరం ప్రమోట్ చేస్తున్నాడు. 2007 టీ20 ప్రపంచకప్ గెలవడంలో యువరాజ్ సింగ్ కీలక పాత్ర పోషించాడు. ఆ టోర్నీలో అతను ఒకే ఓవర్‌లో ఆరు సిక్సర్లు బాదిన సంగతి తెలిసిందే. 2011 ప్రపంచకప్ విజయంలో యువరాజ్ కూడా చాలా ముఖ్యమైన పాత్ర పోషించాడు.

మరిన్ని క్రీడా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..