కష్టపడ్డాం..కానీ..మీలాగే మేము కూడా.. !

వాల్డ్ కప్ సెమి-ఫైనల్ లో న్యూజిలాండ్ చేతిలో టీమిండియా 18 పరుగుల తేడాతో ఓటమి..భారత క్రికెట్ ప్రియులను తీవ్ర నిరాశలో ముంచేసింది. 50 ఓవర్లలో 240 పరుగుల లక్ష్యాన్ని ఛేదించడం టీమిండియా వంటి పటిష్టమైన జట్టుకు ఏమంత కష్టం కానప్పటికీ.. ప్రత్యర్థి జట్టు ధాటి బౌలింగ్ ముందు తలవంచక తప్పలేదు. (49.3) ఓవర్లలో 221 పరుగులకు కోహ్లీ సేన ఆలౌట్ అయింది). మ్యాచ్ అనంతరం కెప్టెన్ విరాట్ కోహ్లీ.. తమ వెన్నంటి ఉండి ప్రోత్సహించినందుకు ఫాన్స్ కు […]

కష్టపడ్డాం..కానీ..మీలాగే మేము కూడా.. !
Follow us

| Edited By: Ravi Kiran

Updated on: Jul 11, 2019 | 2:31 PM

వాల్డ్ కప్ సెమి-ఫైనల్ లో న్యూజిలాండ్ చేతిలో టీమిండియా 18 పరుగుల తేడాతో ఓటమి..భారత క్రికెట్ ప్రియులను తీవ్ర నిరాశలో ముంచేసింది. 50 ఓవర్లలో 240 పరుగుల లక్ష్యాన్ని ఛేదించడం టీమిండియా వంటి పటిష్టమైన జట్టుకు ఏమంత కష్టం కానప్పటికీ.. ప్రత్యర్థి జట్టు ధాటి బౌలింగ్ ముందు తలవంచక తప్పలేదు. (49.3) ఓవర్లలో 221 పరుగులకు కోహ్లీ సేన ఆలౌట్ అయింది). మ్యాచ్ అనంతరం కెప్టెన్ విరాట్ కోహ్లీ.. తమ వెన్నంటి ఉండి ప్రోత్సహించినందుకు ఫాన్స్ కు కృతజ్ఞతలు చెబుతూ ట్వీట్ చేశాడు. ‘ మేము మా శాయశక్తులా పోరాడాం.. కానీ ఫలితం మరోలా ఉంది. మీ లాగే మేమూ ఎమోషన్స్ ని పంచుకుంటున్నాం ‘ అని పేర్కొన్నాడు. మా మీద మీరు కురిపించిన ప్రేమాభిమానానికి ధన్యవాదాలని అన్నాడు. ఇక ప్రెస్ కాన్ఫరెన్స్ లో మాట్లాడిన కోహ్లీ.. షాట్ సెలెక్షన్ అన్నది మరింత బెటర్ గా ఉండి ఉంటే బాగుండేదని అభిప్రాయపడ్డాడు. మా టీమ్ విచారంగా ఉంది. కానీ మనోనిబ్బరం కోల్పోలేదు అని అన్నాడు. మ్యాచ్ గెలవకపోతే ఎవరైనా బాధ పడడం సహజమని, న్యూజిలాండ్ బౌలర్లు బాగా బౌలింగ్ చేశారని కితాబిచ్చాడు. రిషబ్ పంత్ కు మరికొంత సమయం ఇవ్వాల్సి ఉండిందని, కుర్రాడైన పంత్..హార్దిక్ తో మంచి పార్ట్ నర్ షిప్ ఇచ్చాడని కోహ్లీ ప్రశంసించాడు. నా కెరీర్ లో నేనూ ఎన్నో పొరబాట్లు చేశాను.. కానీ ఎప్పటికప్పుడు వాటిని సరిదిద్దుకుంటూ రావడానికి ప్రయత్నించాను..పంత్ టాలెంట్ ఏంటో చూశాను అని వ్యాఖ్యానించాడు. ఇక బర్మింగ్ హామ్ లో ఇవాళ ఆస్ట్రేలియా-ఇంగ్లండ్ మధ్య సెమి ఫైనల్ రెండో మ్యాచ్ జరగనుంది.

దిన ఫలాలు (ఏప్రిల్ 26, 2024): 12 రాశుల వారికి ఇలా..
దిన ఫలాలు (ఏప్రిల్ 26, 2024): 12 రాశుల వారికి ఇలా..
SRH vs RCB: చెల్లుకు చెల్లు.. ప్రతీకారం తీర్చుకున్న బెంగళూరు..
SRH vs RCB: చెల్లుకు చెల్లు.. ప్రతీకారం తీర్చుకున్న బెంగళూరు..
మిచెల్ మార్ష్ స్థానంలో సీమ్ బౌలర్ ఆగయా.. ఢిల్లీ భారీ స్కెచ్..
మిచెల్ మార్ష్ స్థానంలో సీమ్ బౌలర్ ఆగయా.. ఢిల్లీ భారీ స్కెచ్..
అందం ఈమెతో పోటీకి రావడానికి కూడా భయపడుతుంది.. ఓడిపోతానేమో అని..
అందం ఈమెతో పోటీకి రావడానికి కూడా భయపడుతుంది.. ఓడిపోతానేమో అని..
ఆస్ట్రేలియా క్రికెటర్‌ను డామినేట్ చేసిన మహేష్‌..
ఆస్ట్రేలియా క్రికెటర్‌ను డామినేట్ చేసిన మహేష్‌..
పోకిరి సినిమాలో నటించిన ఈ అమ్మడు.. ఇప్పుడు అందాలతో..
పోకిరి సినిమాలో నటించిన ఈ అమ్మడు.. ఇప్పుడు అందాలతో..
తెలంగాణలో మరో ఎమ్మెల్సీ ఎన్నికకు గ్రీన్ సిగ్నల్.. పూర్తి షెడ్యూల్
తెలంగాణలో మరో ఎమ్మెల్సీ ఎన్నికకు గ్రీన్ సిగ్నల్.. పూర్తి షెడ్యూల్
ఈ వయ్యారి కట్టడం వల్ల ఆ చీరకె అందం వచ్చిందేమో.. తాజా లుక్స్ వైరల్
ఈ వయ్యారి కట్టడం వల్ల ఆ చీరకె అందం వచ్చిందేమో.. తాజా లుక్స్ వైరల్
రోజూ ఉదయాన్ని ఈ వాటర్‌ తాగండి.. ప్రయోజనాలు తెలిస్తే షాకవుతారు
రోజూ ఉదయాన్ని ఈ వాటర్‌ తాగండి.. ప్రయోజనాలు తెలిస్తే షాకవుతారు
ఇటలీ ప్రధాని జార్జియా మొలోనీకి పీఎం మోదీ ఫోన్.. ఈ ఆంశాలపై చర్చ
ఇటలీ ప్రధాని జార్జియా మొలోనీకి పీఎం మోదీ ఫోన్.. ఈ ఆంశాలపై చర్చ