ధోని కళ్లల్లో నీళ్లు..ఫ్యాన్స్ భావోద్వేగం

కివీస్‌తో జరిగిన సెమీ ఫైనల్‌లో భారత్ పోరాడి ఓడింది. టాప్ ఆర్డర్ మొత్తం కుప్పకూలిన వేళ.. కివీస్ నిర్దేశించిన 240 పరుగుల లక్ష్యాన్ని చేరుకునేందుకు జడేజా, ధోని తీవ్రంగా శ్రమించాడు. వర్షం కారణంగా పిచ్ బౌలర్లకు అనుకూలించడంతో..న్యూజిలాండ్ బౌలర్లు నిప్పులు చెరిగారు. కానీ జడేజా, ధోని మాత్రం ఆత్మవిశ్వాసం కోల్పోలేదు. జడేజా తన కెరీర్‌లోనే నిలిచిపోయే ఇన్నింగ్స్ ఆడాడు. 77 పరుగులు చేసిన జడ్డూ ఔటయ్యాక.. చివరి రెండు ఓవర్లలో భారత్ విజయానికి 31 పరుగులు అవసరం […]

ధోని కళ్లల్లో నీళ్లు..ఫ్యాన్స్ భావోద్వేగం
కివీస్‌తో జరిగిన సెమీ ఫైనల్‌లో భారత్ పోరాడి ఓడింది. టాప్ ఆర్డర్ మొత్తం కుప్పకూలిన వేళ.. కివీస్ నిర్దేశించిన 240 పరుగుల లక్ష్యాన్ని చేరుకునేందుకు జడేజా, ధోని తీవ్రంగా శ్రమించాడు. వర్షం కారణంగా పిచ్ బౌలర్లకు అనుకూలించడంతో..న్యూజిలాండ్ బౌలర్లు నిప్పులు చెరిగారు. కానీ జడేజా, ధోని మాత్రం ఆత్మవిశ్వాసం కోల్పోలేదు. జడేజా తన కెరీర్‌లోనే నిలిచిపోయే ఇన్నింగ్స్ ఆడాడు. 77 పరుగులు చేసిన జడ్డూ ఔటయ్యాక.. చివరి రెండు ఓవర్లలో భారత్ విజయానికి 31 పరుగులు అవసరం అయ్యాయి. ఓ ఎండ్‌లో ధోనీ ఉండటంతో.. గెలుస్తాంలే అన్న ధీమా అభిమానుల్లో కనిపించింది. కానీ దురదృష్టం కొద్దీ.. గుప్టిల్ విసిరిన డైరెక్ట్ అద్భుతమైన త్రోకు మహీ ఔటయ్యాడు. ఇక భారత్ ఓటమి లాంఛనప్రాయంగా మారింది.
ఈ రనౌట్ పట్ల.. ధోనీ భావోద్వేగానికి లోనయ్యాడు. పెవిలియన్‌కు నడుస్తున్నప్పుడు ధోని కళ్లల్లో గ్లిట్టర్ కనిపించింది. ఎన్నో విజయాలు, అపజయాలు చూపిన మహీ…ఏనాడు ఇంత భావోద్వేగానికి లోనవ్వలేదు. ఆ సమయంలో స్టేడియంలో పలువురు అభిమానులు ధోనికి స్టాండింగ్ ఓవియేషన్ ఇచ్చారు. మరో బ్యాట్స్‌మెన్ లేకపోవడంతో జడేజాను దూకుడుగా బ్యాటింగ్ చేయమని చెప్పిన ధోని..తాను స్టైయిక్ రొటేట్ చేస్తూ జట్టు స్కోరును ముందుకు నడిపించాడు. కానీ ఇంతటి అద్భుత పోరాట పటిమ ప్రదర్శించినా కూడా కొందరు నెటిజన్లు మహీపై విమర్శలు చేయడం గమనార్హం.

Click on your DTH Provider to Add TV9 Telugu