వరల్డ్ కప్ 2019: ఇండియా టీం సెమీస్ ఓటమిపై ప్రధాని స్పందన

ఢిల్లీ: వరల్డ్ కప్‌లో న్యూజిలాండ్‌తో జరిగిన సెమీ ఫైనల్‌లో చివరిదాకా పోరాడిన భారత్‌ ఓటమికి తలవంచక తప్పలేదు. ఈ అపజయం భారత క్రికెట్ అభిమానులందరికి బాధను కలిగించింది. కాగా ఈ మ్యాజ్‌పై ప్రధాని మోదీ స్పందించారు. ఈ మ్యాచ్‌ ఫలితం తనకు నిరాశ కలిగించిందని, కానీ.. విజయం కోసం భారత్‌ చివరివరకూ పోరాడి తన స్ఫూర్తిని ప్రదర్శించిందని అన్నారు. ఈ మేరకు ప్రధాని ట్విటర్‌లో స్పందించారు. ప్రపంచకప్‌లో బ్యాటింగ్‌, బౌలింగ్‌, ఫీల్డింగ్‌ విభాగాల్లో భారత్‌ ఆకట్టుకుందని ఆయన […]

వరల్డ్ కప్ 2019: ఇండియా టీం సెమీస్ ఓటమిపై ప్రధాని స్పందన
Follow us
Ram Naramaneni

|

Updated on: Jul 10, 2019 | 9:22 PM

ఢిల్లీ: వరల్డ్ కప్‌లో న్యూజిలాండ్‌తో జరిగిన సెమీ ఫైనల్‌లో చివరిదాకా పోరాడిన భారత్‌ ఓటమికి తలవంచక తప్పలేదు. ఈ అపజయం భారత క్రికెట్ అభిమానులందరికి బాధను కలిగించింది. కాగా ఈ మ్యాజ్‌పై ప్రధాని మోదీ స్పందించారు. ఈ మ్యాచ్‌ ఫలితం తనకు నిరాశ కలిగించిందని, కానీ.. విజయం కోసం భారత్‌ చివరివరకూ పోరాడి తన స్ఫూర్తిని ప్రదర్శించిందని అన్నారు. ఈ మేరకు ప్రధాని ట్విటర్‌లో స్పందించారు. ప్రపంచకప్‌లో బ్యాటింగ్‌, బౌలింగ్‌, ఫీల్డింగ్‌ విభాగాల్లో భారత్‌ ఆకట్టుకుందని ఆయన గుర్తుచేసుకున్నారు. జీవితంలో గెలుపు, ఓటములు సహజమేనన్న ప్రధాని..భవిష్యత్‌లో మరిన్ని విజయాలు సాధించాలని ఆకాంక్షించారు.