జడేజా పోరాటం వృధా.. భారత్ ఓటమి!
మాంచెస్టర్: ఓల్డ్ ట్రాఫోర్డ్ స్టేడియం వేదికగా న్యూజిలాండ్‌తో జరిగిన మ్యాచ్‌లో భారత్ ఓటమి పాలైంది. ఆరంభం నుంచి ఉత్కంఠభరితంగా సాగిన ఈ మ్యాచ్‌లో టీమిండియా బ్యాట్స్‌మెన్లు చేతులెత్తేశారు. దీంతో 49.3 ఓవర్లకు భారత్ 221 పరుగులకు ఆలౌటైంది. రవీంద్ర జడేజా(77: 59 బంతుల్లో 4ఫోర్లు, 4సిక్సర్లు), మహేంద్రసింగ్ ధోనీ(50: 72 బంతుల్లో ఫోర్, సిక్స్) పోరాడినా.. కీలక తరుణంలో వికెట్లు కోల్పోవడంతో టీమిండియాకు పరాజయం తప్పలేదు. ఇక కోహ్లీసేన టోర్నీ నుంచి నిష్క్రమించగా.. న్యూజిలాండ్ రెండోసారి ఫైనల్‌కు […]
మాంచెస్టర్: ఓల్డ్ ట్రాఫోర్డ్ స్టేడియం వేదికగా న్యూజిలాండ్‌తో జరిగిన మ్యాచ్‌లో భారత్ ఓటమి పాలైంది. ఆరంభం నుంచి ఉత్కంఠభరితంగా సాగిన ఈ మ్యాచ్‌లో టీమిండియా బ్యాట్స్‌మెన్లు చేతులెత్తేశారు. దీంతో 49.3 ఓవర్లకు భారత్ 221 పరుగులకు ఆలౌటైంది. రవీంద్ర జడేజా(77: 59 బంతుల్లో 4ఫోర్లు, 4సిక్సర్లు), మహేంద్రసింగ్ ధోనీ(50: 72 బంతుల్లో ఫోర్, సిక్స్) పోరాడినా.. కీలక తరుణంలో వికెట్లు కోల్పోవడంతో టీమిండియాకు పరాజయం తప్పలేదు. ఇక కోహ్లీసేన టోర్నీ నుంచి నిష్క్రమించగా.. న్యూజిలాండ్ రెండోసారి ఫైనల్‌కు చేరింది. అటు కివీస్ బౌలర్లలో మ్యాట్ హెన్రీ మూడు వికెట్లు, బౌల్ట్, శాంట్నర్ రెండేసి వికెట్లు తీసి జట్టు విజయంలో కీలక పాత్ర పోషించారు. రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీపై ఎన్నో ఆశలు పెట్టుకున్న భారత్ అభిమానులకు తీవ్ర నిరాశే మిగిలింది.
NEW ZEALAND ARE IN THE WORLD CUP FINAL!
WHAT A GAME!#CWC19 pic.twitter.com/HKZ0VTgNVE
— Cricket World Cup (@cricketworldcup) July 10, 2019