ధోని రనౌట్ అంపైర్ తప్పిదమా..? వీడియో వైరల్

TV9 Telugu Digital Desk

TV9 Telugu Digital Desk | Edited By:

Updated on: Jul 11, 2019 | 1:31 PM

ఇంగ్లాండ్ వేదికగా జరిగిన ప్రపంచకప్ నుంచి టీమిండియా నిష్క్రమించింది. సెమీస్‌లో భాగంగా భారత్, న్యూజిలాండ్ మధ్య జరిగిన మ్యాచ్‌లో కేవలం 18పరుగుల తేడాతో టీమిండియా ఓడిపోయింది. అయితే ఈ మ్యాచ్‌లో కోహ్లీ, రోహిత్, రాహుల్ వరుసగా ఔట్ అయినప్పటికీ.. ఆ తరువాత వచ్చిన రిషబ్ పంత్, హార్ధిక్ పాండ్యా కాసేపు నిలకడగా ఆడారు. ఇక ఈ ఇద్దరి ఔట్‌తో భారత్ జట్టు పీకల్లోతు కష్టాల్లో ఉండగా.. రవీంద్ర జడేజా, ధోని కలిసి అద్భుతంగా ఆడారు. దీంతో గెలుపుపై […]

ధోని రనౌట్ అంపైర్ తప్పిదమా..? వీడియో వైరల్

ఇంగ్లాండ్ వేదికగా జరిగిన ప్రపంచకప్ నుంచి టీమిండియా నిష్క్రమించింది. సెమీస్‌లో భాగంగా భారత్, న్యూజిలాండ్ మధ్య జరిగిన మ్యాచ్‌లో కేవలం 18పరుగుల తేడాతో టీమిండియా ఓడిపోయింది. అయితే ఈ మ్యాచ్‌లో కోహ్లీ, రోహిత్, రాహుల్ వరుసగా ఔట్ అయినప్పటికీ.. ఆ తరువాత వచ్చిన రిషబ్ పంత్, హార్ధిక్ పాండ్యా కాసేపు నిలకడగా ఆడారు. ఇక ఈ ఇద్దరి ఔట్‌తో భారత్ జట్టు పీకల్లోతు కష్టాల్లో ఉండగా.. రవీంద్ర జడేజా, ధోని కలిసి అద్భుతంగా ఆడారు. దీంతో గెలుపుపై భారత అభిమానుల్లో ఆశలు చిగురించాయి. కానీ ఈ దశలో జడేజా ఔట్ అవ్వగా.. ఆఖర్లో ధోని కూడా రనౌట్ అవ్వడంతో సెమీస్‌లో భారత్ పోరాటం ముగిసింది.

అయితే ధోని రనౌట్ విషయంలో న్యూజిలాండ్ జట్టు ఫీల్డింగ్ నిబంధనలు అతిక్రమించినట్లు ఓ వీడియో వెలుగులోకి వచ్చింది. ధోని ఆడుతున్న సమయంలో మూడో పవర్ ప్లే దశల్లో ఉండగా.. నిబంధనల ప్రకారం 30యార్డ్ సర్కిల్‌లో ఐదుగురు ఫీల్డర్లు మాత్రమే ఉండాలి. అయితే అప్పుడు న్యూజిలాండ్‌కు చెందిన ఆరుగురు ఫీల్డర్లు.. సర్కిల్ వెలుపల ఉన్నారు. దీన్ని అంపైర్లు గుర్తించి ఉంటే అది నోబాల్ అయ్యేది. ఆ తరువాత బంతికి ఫ్రీ హిట్ వచ్చే అవకాశం ఉండటంతో.. ధోనీ కూడా పరుగు కోసం ప్రయత్నించి ఉండేవాడు కాదన్నది అభిమానుల వాదన. ఏదేమైనా నోబాల్ అన్నప్పుడు క్యాచ్‌ ఔట్ అయితే దాన్ని ఔట్ కింద పరిగణించరు. కానీ రనౌట్ అయితే మాత్రం దాన్ని కచ్చితంగా ఔట్ కిందనే భావిస్తారు. అయితే అంపైర్ నిర్లక్ష్యం వల్లనే ధోని రనౌట్ అయ్యాడని క్రికెట్ అభిమానులు నెట్టింట తమ అభిప్రాయాలను వ్యక్తపరుస్తున్నారు.

https://twitter.com/i/status/1149007982388305921

అయితే ఈ వరల్డ్‌కప్‌లో అంపైర్ తప్పిదాలు చాలానే ఉన్నాయి. లీగ్ మ్యాచ్‌లో భారత్, వెస్టిండీస్ మధ్య జరిగిన పోరులో రోహిత్ శర్మ ఔట్‌పై కూడా క్రికెట్ అభిమానులు పలు అనుమానాలు వ్యక్తం చేశారు. రోహిత్ ఔట్‌.. అంపైర్ తప్పిదమే అని ఆధారాలు చూపించారు. ఇక దీనిపై రోహిత్ కూడా సోషల్ మీడియాలో ఓ ట్వీట్ చేశాడు.

ఇక ఇప్పుడు కూడా అంపైర్ తప్పిదం వల్లే ధోని ఔట్ అయ్యాడని.. లేకపోతే ఇండియా కచ్చితంగా గెలిచేదని.. క్రికెట్ గురించి అవగాహన ఉన్నవారికే ఐసీసీ అంపైర్ పొజిషన్‌ను ఇవ్వాలని పలువురు నెటిజన్లు కామెంట్లు పెడుతున్నారు.

లేటెస్ట్ న్యూస్ హైలెట్స్ చూడండి

Follow us on

Related Stories

Most Read Stories

Click on your DTH Provider to Add TV9 Telugu