Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

IPL 2025: క్రికెట్ ఫ్యాన్స్‌కు జియో బంఫర్ ఆఫర్.. రూ. 100లకే డేటాతోపాటు జియో హాట్‌స్టార్ సబ్‌స్క్రిప్షన్

IPL 2025 Jio Recharge Plan: ఐసీసీ ఛాంపియన్స్ ట్రోఫీ 2025 పూర్తయింది. ఇక ఇప్పుడు క్రికెట్ ఫ్యాన్స్ అంతా ఎదురుచూస్తోన్న ఇండియన్ ప్రీమియర్ లీగ్ అంటే ప్రపంచంలోనే రిచ్ క్రికెట్ లీగ్‌కు రంగం సిద్ధమైంది. ఈ క్రమంలో క్రికెట్ ఫ్యాన్స్ జియో ఓ గుడ్ న్యూస్ కూడా ప్రకటించింది. అదేంటో ఓసారి చూద్దాం..

IPL 2025: క్రికెట్ ఫ్యాన్స్‌కు జియో బంఫర్ ఆఫర్.. రూ. 100లకే డేటాతోపాటు జియో హాట్‌స్టార్ సబ్‌స్క్రిప్షన్
Jio Recharge Jiohotstar
Follow us
Venkata Chari

|

Updated on: Mar 11, 2025 | 1:43 PM

Jio Recharge Plan For IPL 2025: ఆదివారంతో ఐసీసీ ఛాంపియన్స్ ట్రోఫీ మజా పూర్తయింది. ఇక క్రికెట్ ఫ్యాన్స్ అంతా ఎంతగానో ఎదురుచూస్తోన్న ఐపీఎల్ అదేనండి ఇండియన్‌ ప్రీమియర్‌ లీగ్‌ మొదలుకాబోతోంది. 18వ ఎడిషన్‌ (IPL 18th Edition) మార్చి 22 నుంచి షురూ కానుంది. ఈక్రమంలో అన్ని జట్లు ఇప్పటికే తమ సన్నాహాలను ప్రారంభించాయి. 22 నుంచి మొదలుకాబోయే ఐపీఎల్ సీజన్ కోసం రిలయన్స్ జియో అద్భుతమైన ఆఫర్‌ను తీసుకొచ్చింది. ఎందుకంటే, ఐపీఎల్ 2025 సీజన్ జియో హాట్‌స్టార్‌లో ప్రత్యక్షప్రసారం కానుంది. దీంతో క్రికెట్ అభిమానుల కోసం జియో రూ. 100ల ప్లాన్‌ను తీసుకొచ్చింది. ఈ ప్లాన్‌ కేవలం డేటా కోసమే అని తెలుసుకోవాలి.

అయితే, రూ. 100లతో రీఛార్జ్‌ చేస్తే 5 జీబీ డేటాతోపాటు 90 రోజులపాటు జియో హాట్‌స్టార్ సబ్‌స్క్రిప్షన్ ‍‌(Jio Hotstar Subscription) అందిస్తోంది. ఒకవేళ మీరు ఈ ప్లాన్ రీఛార్జ్‌ చేసుకోవాలంటే మైజియో యాప్‌ లేదా Jio.comలో ఎంచక్కా చేసుకుని, ఐపీఎల్‌ను నాన్ స్టాప్‌గా చూసేయోచ్చు. సపరేటుగా జియో హాట్ స్టార్ సబ్‌స్క్రిప్షన్ తీసుకోవాలంటే ఖర్చుతో కూడుకున్నది. ఈ ప్లాన్‌తో రీఛార్జ్ చేసుకుంటే 90 రోజుల పాటు ఐపీఎల్ హంగామాకు ఢోకా ఉండదన్నమాట.

రూ.100ల జియో ప్రీపెయిడ్ ప్లాన్ బెనిఫిట్స్..

ఈ రీఛార్జ్‌తో 90 రోజులపాటు జియో హాట్ స్టార్ సబ్‌స్క్రిప్షన్ వస్తుంది. 5 జీబీ హై స్పీడ్ ఇంటర్నెట్ అందిస్తుంది. 5 జీబీ డేటా పూర్తయ్యాక ఇంటర్నెట్ స్పీడ్ 64 Kbpsకు పరిమితం అవుతుందన్నమాట. కాగా, ఇందులో కాలింగ్‌ లేదా మెసేజ్ బెనిఫిట్స్ అందించలేదు.

ఇవి కూడా చదవండి

బడ్జెట్ ఫ్రెండ్లీ ప్లాన్.. ఎందుకంటే..

రూ.149లతో మరో ప్లాన్ కూడా అందుబాటులో ఉంది. ఇందులోనూ 90 రోజుల వ్యాలిడిటీ ఉంది. కానీ, జియో హాట్ స్టార్ యాప్‌ను ఒక్క డివైజ్‌లోనూ చూడొచ్చు. ఇక బడ్జెట్ ఫ్రెండ్లీ రూ.100ల ప్లాన్‌లో స్మార్ట్‌ఫోన్‌‌తోపాటు స్మార్ట్‌టీవీలోనూ ఐపీఎల్ మ్యాచ్‌లను ఆస్వాదించొచ్చు. కేవలం ఐపీఎల్ మాత్రమే కాదండోయ్ జియో హాట్‌స్టార్‌లోని వెబ్ సిరీస్‌లు, సినిమాలను కూడా 1080p రిజల్యూషన్‌లో ఎంజాయ్ చేయోచ్చు. దీనితో పాటు రూ.299ల ప్లాన్ కూడా ఉంది. అన్నింటికన్నా రూ. 100ల ప్లాన్ మాత్రం అందరికీ సెట్ అయ్యేలా ఉందనడంలో ఎలాంటి సందేహం లేదు.

మరిన్ని క్రీడా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..