ఆ మధుర క్షణాలను మిస్సవ్వాలనుకోవడం లేదు.. ఏది ఏమైనా ఆ సమయంలో ఆమె దగ్గరే ఉంటానంటున్న..

వ్యక్తిగత విషయాలను ఎవరితోని పంచుకోని టీం ఇండియా సారథి విరాట్ కోహ్లీ తొలిసారిగా ఆస్ట్రేలియా క్రికెటర్

ఆ మధుర క్షణాలను మిస్సవ్వాలనుకోవడం లేదు.. ఏది ఏమైనా ఆ సమయంలో ఆమె దగ్గరే ఉంటానంటున్న..
Follow us

|

Updated on: Dec 18, 2020 | 5:48 AM

వ్యక్తిగత విషయాలను ఎవరితోని పంచుకోని టీం ఇండియా సారథి విరాట్ కోహ్లీ తొలిసారిగా ఆస్ట్రేలియా క్రికెటర్ స్టీవ్ స్మిత్‌తో తన చిన్ననాటి విషయాల గురించి చర్చించాడు. ఈ సందర్భంగా భావోద్వేగానికి గురైన కోహ్లీ తన తండ్రి ప్రేమ్ కోహ్లీ కన్ను మూసినపుడే క్రికెట్‌ను కెరీర్‌గా ఎంచుకోవాలని నిర్ణయించుకున్నానని తెలిపాడు. అందుకే క్రికెట్‌ని ఎక్కువగా ప్రేమించి లక్ష్యం పైనే గురిపెట్టానని పేర్కొన్నాడు. ఏది ఏమైనా ఇండియాకు ఆడటమే ముఖ్యమని భావించానని చెప్పాడు.

అంతేకాకుండా తాను తొలిసారిగా క్రికెట్ ఆడింది తన తండ్రితోనే అని, అతడు బంతులేస్తే తాను ప్లాస్టిక్ బ్యాట్‌తో ఆడానని గుర్తు చేసుకున్నాడు. అనంతరం అజింకా రహానె కెప్టెన్సీ గురించి మాట్లాడుతూ.. అతడికి కెప్టెన్సీ చేయడమంటే చాలా ఇష్టమని చెప్పుకొచ్చాడు. తాను మొదటి టెస్ట్ తర్వాత భారత్‌కి తిరిగి వెళ్తానని చెప్పాడు. రహానె ఈ అవకాశాన్ని కచ్చితంగా వినియోగించుకుంటాడని భావిస్తున్నానని తెలిపాడు. ఇక వచ్చే నెలలో తన భార్య అనుష్క శర్మ తొలిసారిగా ఓ బిడ్డకు జన్మనివ్వబోతుందని ఈ సందర్భంగా తాను ఆమె దగ్గర ఉండాలని అనుకుంటున్నానని పేర్కొన్నాడు. ఆ మధుర క్షణాలను కోల్పోకూడదనే ఇండియాకు తిరిగి వెళుతున్నానని వెల్లడించాడు. జీవితంలో ఇదో ప్రత్యేక సందర్భమని ఎవరు ఏమనుకున్నా ఈ సమయంలో తాను అనుష్క దగ్గరే ఉంటానని స్పష్టం చేశాడు కోహ్లీ.