ఛాంపియన్స్ ట్రోఫీ ఫైనల్లో ఓటమి.. కట్‌చేస్తే.. రిటైర్మెంట్ ప్లాన్‌లో కోహ్లీ జాన్ జిగిరి దోస్త్?
Kane Williamson May Retire From ODI Cricket: ఐసీసీ ఛాంపియన్స్ ట్రోఫీ 2025 ఫైనల్లో భారత్ చేతిలో ఓడిపోయిన తర్వాత న్యూజిలాండ్‌కు చెందిన కేన్ విలియమ్సన్ రిటైర్ అవుతాడంటూ ఎన్నో వార్తలు వినిపించాయి. అయితే, దీనిపై న్యూజిలాండ్‌కు చెందిన టిమ్ సౌథీ కీలక అప్‌డేట్ ఇచ్చారు.

ఐసీసీ ఛాంపియన్స్ ట్రోఫీ 2025 ఫైనల్ గెలిచిన తర్వాత టీం ఇండియా ఆటగాళ్లు సంబరాల్లో మునిగిపోయారు. న్యూజిలాండ్ కెప్టెన్ మిచెల్ సాంట్నర్ కళ్ళలో నీళ్ళు తిరిగాయి. ఈ క్రమంలో కివీస్ ఆటగాళ్లు భారతదేశం సెలబ్రేట్ చేసుకోవడం చూసి బాధపడ్డారు. ఫైనల్‌లో న్యూజిలాండ్‌ను ఓడించిన తర్వాత, టీమిండియా మాజీ కెప్టెన్ విరాట్ కోహ్లీ కూడా తన స్నేహితుడు కేన్ విలియమ్సన్ పట్ల విచారం వ్యక్తం చేశాడు. ఆ తరువాత, ఈ 34 ఏళ్ల డాషింగ్ బ్యాట్స్‌మన్ రిటైర్ కావచ్చని వార్తలు వినిపించాయి. దీనిపై న్యూజిలాండ్ మాజీ ఫాస్ట్ బౌలర్ టిమ్ సౌథీ కీలక సమాధానం ఇచ్చారు.
కేన్ విలియమ్సన్ రిటైర్మెంట్ గురించి టిమ్ సౌథీ ఏమన్నాడంటే?
కేన్ విలియమ్సన్ రిటైర్మెంట్ గురించి ESPNcricinfo తో జరిగిన సంభాషణలో 36 ఏళ్ల న్యూజిలాండ్ మాజీ ఫాస్ట్ బౌలర్ టిమ్ సౌథీ మాట్లాడుతూ, అతను ప్రస్తుతం మూడు ఫార్మాట్లలోనూ ఆడుతున్నాడు . శీతాకాలంలో కౌంటీ క్రికెట్ కాంట్రాక్ట్ కూడా కలిగి ఉన్నాడు. పరుగులు సాధించాలనే అతని దాహం ఇంకా సజీవంగా ఉందని ఇది స్పష్టంగా చూపిస్తుంది. తదుపరి వన్డే ప్రపంచ కప్‌కు ఇంకా రెండేళ్ల సమయం ఉంది. న్యూజిలాండ్ క్రికెట్ బోర్డు పరిమిత క్రికెట్ ఆడటం ద్వారా అతనిని తాజాగా ఉంచాలని కోరుకుంటుందని నేను భావిస్తున్నాను. తద్వారా అతను 2027 ODI ప్రపంచ కప్‌లో జట్టు తరపున ఉంటాడు. 34 సంవత్సరాల వయస్సులో కూడా, అతను చాలా చిన్నవాడిగా కనిపిస్తున్నాడు. అతనిలోని ఆకలి ఇంకా సజీవంగానే ఉంది” అంటూ చెప్పుకొచ్చాడు.
2025 ఛాంపియన్స్ ట్రోఫీలో గర్జించిన విలియమ్సన్ బ్యాట్..
2025 ఐసీసీ ఛాంపియన్స్ ట్రోఫీలో న్యూజిలాండ్ జట్టు అద్భుతంగా రాణించింది. కానీ, భారత జట్టుపై ఒకసారి కాదు రెండుసార్లు ఓటమిని ఎదుర్కోవలసి వచ్చింది. ఈ కారణంగా న్యూజిలాండ్ జట్టు ఖాళీ చేతులతో ఇంటికి తిరిగి వెళ్లాల్సి వచ్చింది. కివీస్ తరపున, కేన్ విలియమ్సన్ ఐదు ఇన్నింగ్స్‌లలో 47.25 సగటుతో 189 పరుగులు చేశాడు. ఇందులో ఒక సెంచరీ కూడా ఉంది. ఇప్పుడు విలియమ్సన్ 2027 వన్డే ప్రపంచ కప్ వరకు న్యూజిలాండ్ తరపున ఆడాలని కోరుకుంటున్నాడు.
మరిన్ని క్రీడా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..