Watch Video: కోహ్లీ అభిమానా.. మజాకా.. అనర్గలంగా హిందీలో దంచేసిన చైనా వ్యక్తి.. వింటే ఆశ్చర్యపోతారంతే..
చైనాకు చెందిన ఓ విరాట్ కోహ్లీ అభిమాని వీడియో ఒకటి సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. అతను అనర్గళంగా హిందీలో మాట్లాడుతూ.. తన అభిమానాన్ని పంచుకున్నాడు.
టీ20 ప్రపంచకప్‌లో భారత్-బంగ్లాదేశ్ మధ్య మ్యాచ్‌కు ముందు ఓ వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. ఈ వైరల్ క్లిప్‌లో, టీమిండియా మాజీ కెప్టెన్ విరాట్ కోహ్లీకి చెందిన చైనా అభిమాని కోట్లాది మంది భారతీయుల హృదయాలను గెలుచుకున్నాడు. ఈ వీడియోలో చైనా నుంచి వచ్చిన కోహ్లీ అభిమాని తనకు భారత్ అంటే చాలా ఇష్టమని, కోహ్లీ కోసమే ఈ మ్యాచ్‌ని చూసేందుకు వచ్చానని చెప్పడం వినిపిస్తోంది. తమాషా ఏంటంటే ఈ చైనీస్ అనర్గళంగా హిందీలో మాట్లాడుతుండడం విశేషం.
విరాట్ కోహ్లీ అభిమాని అయిన ఈ చైనీస్ మ్యాన్ అడిలైడ్ విశ్వవిద్యాలయంలో చదువుతున్నాడంట. అతను భారతీయ సంస్కృతిని చాలా ఇష్టపడతాడంట. ఈ ప్రేమ కారణంగా అతను తనంతట తానుగా హిందీ నేర్చుకుంటున్నాడంట. వైరల్ క్లిప్‌లో, కోహ్లి అభిమాని తన మాటలను అనర్గళంగా హిందీలో వ్యక్తం చేస్తున్నాడు. నేను టీమ్ ఇండియాకు పెద్ద భక్తుడిని అని చెప్పుకొచ్చాడు. నాకు భారతీయ సంస్కృతి అంటే ఇష్టం. ఆ తర్వాత, టీమ్ ఇండియాలో ఎవరు ఎక్కువ ఇష్టమని అడిగినప్పుడు, అతను కోహ్లీ పేరును చెప్పుకొచ్చాడు. అప్పుడు బంగ్లాదేశ్‌ను భారత జట్టు సులువుగా ఓడించడం ఖాయమని తెలిపాడు. ఈ క్లిప్‌ని చూసి అందరూ చైనీస్ అభిమాని ఉత్సాహానికి సెల్యూట్ చేస్తున్నారు.
కోహ్లీ చైనా అభిమాని వీడియోను ఇక్కడ చూడండి..
विराट कोहली के इस चाइनीज़ फैन की ज़बरदस्त हिंदी आपको दंग कर देगी#ViratKohli? #IndianCricket #ViralVideo pic.twitter.com/bOCODhTXbW
— Dr. Vivek Bindra (@DrVivekBindra) November 2, 2022
ఈ వీడియో సోషల్ మీడియాలో వివిధ ప్లాట్‌ఫారమ్‌లలో విపరీతంగా వైరల్ అవుతోంది. @DrVivekBindra పేరుతో ట్విటర్‌లో ఈ వీడియోను షేర్ చేస్తూ, ‘విరాట్ కోహ్లీ ఈ చైనీస్ అభిమాని హిందీ మిమ్మల్ని దిగ్భ్రాంతికి గురి చేస్తుంది’ అని క్యాప్షన్‌తో పంచుకున్నారు. ఈ 41 సెకన్ల క్లిప్ ఇంటర్నెట్‌లో భయాందోళనలను సృష్టిస్తోంది. ఈ వీడియోను ఇప్పటివరకు 1 లక్షా 81 వేలకు పైగా వీక్షించగా, 12 వేల మందికి పైగా లైక్ చేశారు. అదే సమయంలో, చాలా మంది వీడియోపై కామెంట్లు కూడా చేశారు.