Team India: ఐసీసీ క్రికెటర్ ఆఫ్ ది ఇయర్ రేసులో టీమిండియా ప్లేయర్లు.. గట్టిపోటీ ఇస్తోన్న ఆసీస్ ఆటగాళ్లు..
Virat Kohli and Ravindra Jadeja: పురుషుల క్రికెటర్ ఆఫ్ ద ఇయర్ అవార్డుకు ఎంపికైన ఆటగాళ్లను ఐసీసీ ప్రకటించింది. నలుగురు ఆటగాళ్లలో ఇద్దరు భారతీయులు ఉన్నారు. అదే సమయంలో టెస్టు క్రికెటర్ ఆఫ్ ద ఇయర్ అవార్డుకు భారత దిగ్గజ ఆటగాడి పేరు ఎంపికైంది. కాగా, ఆస్ట్రేలియా నుంచి కూడా ఇద్దరు ఆటగాళ్లు ఎంపికయ్యారు. దీంతో పోటీ రసవత్తరంగా మారింది.
ICC Cricketer of The Year: భారత స్టార్ బ్యాట్స్‌మెన్ విరాట్ కోహ్లి, టాప్ ఆల్ రౌండర్ రవీంద్ర జడేజా ఇంటర్నేషనల్ క్రికెట్ కౌన్సిల్ (ఐసీసీ) బెస్ట్ మేల్ క్రికెటర్ ఆఫ్ ద ఇయర్‌కి నామినేట్ అయ్యారు. అదే సమయంలో, వెటరన్ ఆఫ్ స్పిన్నర్ రవిచంద్రన్ అశ్విన్ ఉత్తమ టెస్ట్ క్రికెటర్ ఆఫ్ ది ఇయర్‌గా నామినేట్ అయ్యాడు. సర్ గార్ఫీల్డ్ సోబర్స్ ట్రోఫీకి ఆస్ట్రేలియా కెప్టెన్ పాట్ కమిన్స్, అతని సహచరుడు ట్రావిస్ హెడ్ నుంచి కోహ్లి, జడేజా సవాలును ఎదుర్కోనున్నారు.
అశ్విన్, హెడ్, అతని ఆస్ట్రేలియా సహచరుడు ఉస్మాన్ ఖవాజాతో పాటు, ఇంగ్లండ్ సీనియర్ బ్యాట్స్‌మెన్ జో రూట్ కూడా టెస్ట్ క్రికెటర్ ఆఫ్ ద ఇయర్‌గా నామినేట్ అయ్యారని ఐసీసీ శుక్రవారం తెలిపింది. కోహ్లి 2023లో టెస్ట్, ODIలో 35 మ్యాచ్‌లలో 2048 పరుగులు చేశాడు. ఇందులో ప్రపంచ కప్‌లో అతని 50వ ODI సెంచరీ కూడా ఉంది. దిగ్గజ బ్యాట్స్‌మెన్ సచిన్ టెండూల్కర్‌ను అధిగమించాడు.
జడేజా 35 మ్యాచుల్లో 613 పరుగులు చేయడమే కాకుండా 66 వికెట్లు తీశాడు. గతేడాది ప్రారంభంలో బోర్డర్-గవాస్కర్ ట్రోఫీలో ఆస్ట్రేలియాపై 22 వికెట్లు తీశాడు.
పాట్ కమిన్స్ 24 మ్యాచ్‌ల్లో 422 పరుగులు చేసి 59 వికెట్లు తీశాడు. అతని నాయకత్వంలో ఆస్ట్రేలియా యాషెస్, ప్రపంచ టెస్ట్ ఛాంపియన్‌షిప్ (WTC) ఫైనల్, ODI ప్రపంచ కప్ టైటిల్‌ను గెలుచుకుంది.
Three batting stars and the #CWC23 leading wicket-taker 🔥
Who will claim ICC Men’s ODI Cricketer of the Year?
More: https://t.co/sJElLIPNC8 pic.twitter.com/ytjO0PxZGU
— ICC (@ICC) January 5, 2024
2023లో హెడ్ బ్యాట్‌తో బలమైన ఫామ్‌లో ఉన్నాడు. అతను 31 మ్యాచ్‌లలో 1698 పరుగులు చేశాడు. ఇందులో భారత్‌పై WTC ఫైనల్, ODI వరల్డ్ కప్ ఫైనల్‌లో సెంచరీలు కూడా ఉన్నాయి. ఇదిలా ఉంటే, భారత దిగ్గజ ఆఫ్ స్పిన్నర్ అశ్విన్ ఐసీసీ ర్యాంకింగ్స్‌లో టాప్ టెస్ట్ బౌలర్‌గా ఈ సంవత్సరాన్ని ముగించాడు. అతను 17.02 అద్భుతమైన సగటుతో 41 వికెట్లు తీశాడు. ఈ కాలంలో, అతను ఒక ఇన్నింగ్స్‌లో ఐదు లేదా అంతకంటే ఎక్కువ వికెట్లు నాలుగు సార్లు తీసుకున్నాడు. అశ్విన్ 8 టెస్టు మ్యాచ్‌ల్లో 65.58 సగటుతో 787 పరుగులు చేశాడు.
గతేడాది టెస్టు క్రికెట్‌లో అత్యధిక పరుగులు చేసిన ఆటగాళ్ల జాబితాలో ఆస్ట్రేలియా ఓపెనింగ్ బ్యాట్స్‌మెన్ ఖవాజా అగ్రస్థానంలో నిలిచాడు. అతను 52.60 సగటుతో 1210 పరుగులు చేశాడు. ఇందులో మూడు సెంచరీలు ఉన్నాయి.
మరిన్ని క్రీడా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..