Ranji Trophy 2024: రంజీ మ్యాచ్ ఆడేందుకు బీహార్ నుంచి బరిలోకి రెండు జట్లు.. వివాదంలో అసలు ట్విస్ట్ ఏంటంటే..
Bihar vs Mumbai, Ranji Trophy: బీహార్ క్రికెట్ అసోసియేషన్‌లో తీవ్ర కలకలం రేగింది. రంజీ ట్రోఫీ 2023-24 ప్రారంభ మ్యాచ్‌లో, ముంబైతో మ్యాచ్ ఆడేందుకు బీహార్ నుంచి రెండు జట్లు స్టేడియానికి చేరుకున్నాయి. దీంతో వివాదం మొదలైంది. ఈ వ్యవహారంపై బీసీఏ అధికారులు మాటకుమాట బదులిస్తూ.. ఒకరిపై ఒకరు విమర్శలు గుప్పించుకుంటున్నారు. అసలు వివాదం ఏంటో ఇప్పుడు తెలుసుకుందాం..
Bihar Cricket Association: రంజీ ట్రోఫీ 2023-24 ప్రారంభమైంది. పాట్నాలోని మొయినుల్ స్టేడియంలో బీహార్, ముంబై జట్ల మధ్య మ్యాచ్ జరుగుతోంది. ఈ మ్యాచ్‌కు ముందు వివాదం నెలకొంది. బీహార్‌కు చెందిన రెండు జట్లు మ్యాచ్ ఆడేందుకు స్టేడియానికి చేరుకున్నాయి. ఆ తర్వాత బీహార్ క్రికెట్ సంఘంలో కలకలం రేగింది. బీహార్ క్రికెట్ అసోసియేషన్ (బీసీఏ) అధ్యక్షుడు రాకేష్ తివారీ ఒక జట్టును విడుదల చేశారు. కాగా, సెక్రటరీ అమిత్ కుమార్ రెండో టీమ్ సస్పెన్షన్‌ను జారీ చేశారు. అయితే ప్రెసిడెంట్ ఎంపిక చేసిన జట్టు మ్యాచ్ ఆడేందుకు వచ్చింది. ఈ ఘటన తర్వాత బీసీఏలో వివాదం చెలరేగింది. కొందరు గుర్తు తెలియని వ్యక్తులు బీసీఏ అధికారిపై అసభ్యకరంగా కామెంట్లు చేస్తున్నారు. సోషల్ మీడియాలో ఫొటోలు వైరల్ అవుతున్నాయి.
ఆడేందుకు వచ్చిన అధ్యక్ష-కార్యదర్శి బృందాలు..
ముంబైతో రంజీ మ్యాచ్‌లో ఆడేందుకు రెండు జట్లు స్టేడియం వెలుపలకు చేరుకోవడంతో బీసీఏ (బీహార్ క్రికెట్ అసోసియేషన్)లో కలకలం రేగింది. అయితే, స్టేడియం వెలుపల ఉన్న పోలీసులు సెక్రటరీ బృందాన్ని వెనక్కి పంపారు. ఈ మ్యాచ్‌లో బీసీఏ అధ్యక్షుడు రాకేష్ తివారీ జారీ చేసిన జాబితాలోని జట్టు ఆడేందుకు వచ్చింది.
బీసీఏ ప్రెసిడెంట్ రాకేష్ తివారీ ది ఇండియన్ ఎక్స్‌ప్రెస్‌తో మాట్లాడుతూ, ‘మేం ప్రతిభ ఆధారంగా జట్టును ఎంపిక చేశాం. ఇది సరైన జట్టు. బీహార్ నుంచి వస్తున్న ప్రతిభను మీరు చూస్తారు. ఐపీఎల్‌లో ఎంపికైన క్రికెటర్ (సాకిబ్ హుస్సేన్) మా వద్ద ఉన్నాడు. మన దగ్గర 12 ఏళ్ల ప్రతిభావంతుడైన ఆటగాడు అరంగేట్రం చేస్తున్నాడు. మరొక టీంను సస్పెండ్ చేసిన కార్యదర్శి ఎంపిక చేస్తున్నారు. కాబట్టి అది సరైన జట్టు కాదు. అంతేకాకుండా, ఈ గందరగోళానికి 2013 స్పాట్ ఫిక్సింగ్ కేసులో పిటిషనర్ ఆదిత్య వర్మ కారణమని బీసీఏ అధ్యక్షుడు ఆరోపించారు. బీహార్ ప్రతిష్టను దిగజార్చడమే ఆయన పని అని అన్నారు. కొడుకు ఎంపిక కాకపోవడంతో రచ్చ సృష్టిస్తున్నాడు. అతను మాపై ఒత్తిడి తెచ్చేందుకు ప్రయత్నిస్తాడు. కానీ మేం అతని మాట వినలేం. ఎందుకంటే మేం మెరిట్ ప్రకారం జట్లను ఎంచుకుంటాం అంటూ తేల్చి చెప్పాడు.
కార్యదర్శి ఏమన్నారంటే..
BCA సెక్రటరీ అమిత్ తివారీ మాట్లాడుతూ, ‘మొదట, నేను ఎన్నికల్లో గెలిచాను. నేను BCA అధికారిక కార్యదర్శిని. మీరు సెక్రటరీని సస్పెండ్ చేయలేరు. రెండవది, అధ్యక్షుడు జట్టును ఎలా ఎంపిక చేసుకుంటాడు? బీసీసీఐ అధ్యక్షుడు రోజర్ బిన్నీ జట్టును ప్రకటించడం ఎప్పుడైనా చూశారా? మీరు ఎల్లప్పుడూ సెక్రటరీ జై షా సంతకాన్ని చూస్తారు. బీసీఏ సెక్రటరీ కూడా అంతే అంటూ విమర్శలను తిప్పికొట్టారు. అలాగే, కార్యదర్శికి అధికారం లేని ఏకైక సంఘం BCA అంటూ బదులిచ్చారు.
మరిన్ని క్రీడా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..