AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

RCB vs KKR : 10వ సెంచరీతో చరిత్ర సృష్టించిన కింగ్ కోహ్లీ.. కేకేఆర్‌పై ఆర్‌సీబీ రికార్డు విజయం

RCB vs KKR : ఐపీఎల్ 2026లో ఆర్‌సీబీ రికార్డు విజయం సాధించింది. విరాట్ కోహ్లీ 10వ టీ20 సెంచరీతో చరిత్ర సృష్టించగా, కేకేఆర్‌పై 193 పరుగుల లక్ష్యాన్ని బెంగళూరు ఛేజ్ చేసింది. రాయ్‌పూర్ స్టేడియం చరిత్రలోనే అత్యధిక పరుగుల ఛేజింగ్ రికార్డును నెలకొల్పింది.

RCB vs KKR : 10వ సెంచరీతో చరిత్ర సృష్టించిన కింగ్ కోహ్లీ..  కేకేఆర్‌పై ఆర్‌సీబీ రికార్డు విజయం
Virat Kohli
Rakesh
|

Updated on: May 14, 2026 | 6:58 AM

Share

RCB vs KKR : ఐపీఎల్ 2026లో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు (RCB) సంచలనం సృష్టించింది. బుధవారం రాయ్‌పూర్‌లోని షహీద్ వీర్ నారాయణ్ సింగ్ స్టేడియంలో జరిగిన ఉత్కంఠ పోరులో కోల్‌కతా నైట్ రైడర్స్ (KKR)పై ఆర్‌సీబీ ఘనవిజయం సాధించింది. కింగ్ కోహ్లీ (105*) ఆకాశమే హద్దుగా చెలరేగి సెంచరీ బాదడంతో, కేకేఆర్ విసిరిన 193 పరుగుల భారీ లక్ష్యాన్ని బెంగళూరు అలవోకగా ఛేదించింది. ఈ విజయంతో ఆర్‌సీబీ పాయింట్ల పట్టికలో అగ్రస్థానానికి చేరుకోవడమే కాకుండా, రాయ్‌పూర్ స్టేడియం చరిత్రలోనే అత్యధిక పరుగుల ఛేజింగ్ రికార్డును నెలకొల్పింది.

అభిషేక్ శర్మ రికార్డు బద్దలు

ఈ మ్యాచ్‌ విరాట్ కోహ్లీ కెరీర్‌లో ఒక మైలురాయిగా నిలిచిపోతుంది. కేవలం 58 బంతుల్లోనే సెంచరీ పూర్తి చేసిన కోహ్లీ, టీ20 క్రికెట్ చరిత్రలో అత్యధిక సెంచరీలు బాదిన భారతీయ బ్యాటర్‌గా నిలిచాడు. కోహ్లీకి ఇది 10వ టీ20 సెంచరీ. ఇంతకుముందు ఈ రికార్డు 9 సెంచరీలతో ఉన్న అభిషేక్ శర్మ పేరిట ఉండేది. ఇప్పుడు ఆ రికార్డును విరాట్ అధిగమించాడు. ఐపీఎల్‌లో ఇది విరాట్‌కు 9వ సెంచరీ కావడం విశేషం. కేఎల్ రాహుల్, రోహిత్ శర్మ, సంజు శామ్సన్ చెరో 8 సెంచరీలతో ఈ జాబితాలో కోహ్లీ వెనుక ఉన్నారు.

రాయ్‌పూర్‌లో ఆర్‌సీబీ రికార్డు

రాయ్‌పూర్ మైదానంలో ఐపీఎల్ చరిత్రలోనే ఇది అతిపెద్ద రన్ చేజ్. విశేషమేమిటంటే, అంతకుముందు ఇదే సీజన్‌లో ముంబై ఇండియన్స్‌పై 167 పరుగులు ఛేజ్ చేసి ఆర్‌సీబీ నెలకొల్పిన రికార్డును, ఇప్పుడు మళ్ళీ ఆర్‌సీబీనే 193 పరుగులు ఛేజ్ చేసి బద్దలు కొట్టింది. విరాట్ కోహ్లీ ఇన్నింగ్స్‌లో 11 ఫోర్లు, 3 సిక్సర్లు ఉండగా, ఆర్‌సీబీ బ్యాటర్లు కేకేఆర్ బౌలర్లను ముప్పుతిప్పలు పెట్టారు. వరుసగా రెండు మ్యాచుల్లో సున్నాకే అవుట్ అయిన కోహ్లీ, ఈసారి సెంచరీతో సమాధానం చెప్పడం అభిమానులకు కనువిందు చేసింది.

ప్లే ఆఫ్స్ లెక్కలేంటి?

ఈ విజయంతో ఆర్‌సీబీ 16 పాయింట్లతో టేబుల్ టాప్‌లోకి వెళ్ళింది. అయితే టెక్నికల్‌గా ఆర్‌సీబీ ఇంకా ప్లే ఆఫ్స్ బెర్తును అధికారికంగా ఖరారు చేసుకోలేదు, కానీ దాదాపుగా చేరుకున్నట్లే. మరోవైపు కేకేఆర్ పరిస్థితి ఆందోళనకరంగా ఉన్నప్పటికీ, ఆ జట్టు ఇంకా రేసులో ఉంది. కోల్‌కతా తన మిగిలిన మూడు మ్యాచుల్లోనూ భారీ తేడాతో గెలిస్తే 15 పాయింట్లతో ప్లే ఆఫ్స్ చేరే అవకాశం ఉంది. ఈ మ్యాచ్‌లో ఓడిపోయినప్పటికీ కేకేఆర్ బ్యాటర్ రఘువంశీ (71) ప్రదర్శన జట్టుకు ఆశలు కల్పిస్తోంది.

మరిన్ని క్రీడా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

Follow Us