Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

SRH in IPL 2025: రూ. 39.25 కోట్లు ఖర్చు చేస్తే.. కావ్య పాపను నిండా ముంచేసిన ముగ్గురు..

Sunrisers Hyderabad: ఐపీఎల్ 2025 సీజన్ కు ముందు సన్‌రైజర్స్ హైదరాబాద్ యజమాని కావ్య మారన్ ముగ్గురు ఆటగాళ్ల కోసం రూ.39.25 కోట్లు ఖర్చు చేసింది. వీరి వల్ల జట్టుకు ప్రయోజనం కలుగుతుందని ఆమె ఆశించింది. కానీ ఐపీఎల్ 2025 సీజన్ ప్రారంభమైన తర్వాత, ఆమె నిర్ణయం తప్పుగా నిరూపితమైంది.

SRH in IPL 2025: రూ. 39.25 కోట్లు ఖర్చు చేస్తే.. కావ్య పాపను నిండా ముంచేసిన ముగ్గురు..
Srh
Follow us
Venkata Chari

|

Updated on: Apr 07, 2025 | 7:05 AM

Sunrisers Hyderabad: ఐపీఎల్‌లోని ప్రతి ఫ్రాంచైజీ యజమాని తాము ఎంత డబ్బు ఖర్చు చేసినా, అది తమ జట్టుకు ప్రయోజనం చేకూర్చేలా ఉండాలని కోరుకుంటారు. అదే క్రమంలో ఖర్చుకు వెనకాడకుండా ప్లేయర్లను కొనుగోలు చేస్తుంటారు. కానీ, సన్‌రైజర్స్ హైదరాబాద్ యజమాని కావ్య మారన్ ఖర్చు చేసిన డబ్బుకు భారీ నష్టాలను ఎదుర్కొంటున్నట్లు తెలుస్తోంది. ఏకంగా రూ.39.25 కోట్ల నష్టం వాటిల్లినట్లు తెలుస్తోంది. హైదరాబాద్ యజమాని రూ. 39.25 కోట్లు ఖర్చు చేసి కొనుగోలు చేసిన ముగ్గురు ఆటగాళ్లు.. ఫ్రాంచైజీ ఆశించిన స్థాయిలో ఆడకపోవడంతో, కావ్య మారన్‌కు పెద్ద తలనొప్పి మొదలైంది.

ముగ్గురు ఆటగాళ్లపై 39.25 కోట్లు ఖర్చు..

గత ఐపీఎల్ సీజన్‌లో సన్‌రైజర్స్ హైదరాబాద్ ఫైనల్స్‌కు చేరుకుంది. అయితే, ఫైనల్‌లో కావ్య మారన్ జట్టు ఓడిపోయింది. అయితే, హైదరాబాద్ జట్టు ప్రదర్శనతో అభిమానుల హృదయాలను గెలుచుకుంది. అదే సమయంలో ప్రత్యర్థి జట్ల మనస్సుల్లోనూ ఓ భయాన్ని కలిగించింది. ఇటువంటి పరిస్థితిలో, కొత్త సీజన్‌లో కూడా ఈ జట్టు నుంచి ఇలాంటి ప్రదర్శనను ఆశించారు. కానీ, ఈ సీజన్‌లో తొలి మ్యాచ్ తప్ప, మిగతా మ్యాచ్‌ల్లో దారుణంగా విఫలమైంది. దీనికి ప్రధాన కారణం జట్టు బ్యాటింగ్ లైనప్. అంచనాలు అందుకోవడంతో ఈ ముగ్గురు ఆటగాళ్లు విఫలమయ్యారు.

ఇందులో ముఖ్యంగా కావ్య మారన్ భారీ మొత్తంలో డబ్బు ఖర్చు చేసిన ఆ ముగ్గురు ఆటగాళ్ళు ఎక్కువగా నిరాశపరిచారు. ఇందులో ఆస్ట్రేలియా స్టార్ బ్యాట్స్‌మన్ ట్రావిస్ హెడ్, భారత యువ ఓపెనర్ అభిషేక్ శర్మ, వికెట్ కీపర్ బ్యాట్స్‌మన్ ఇషాన్ కిషన్ ఉన్నారు. గత సీజన్ ప్రదర్శనను పరిగణనలోకి తీసుకుంటే, హెడ్, అభిషేక్‌లను రూ.28 కోట్లకు రిటైన్ చేసుకుంది. వారిద్దరికీ చెరో రూ.14 కోట్లు ఇవ్వాలని కావ్య మారన్ నిర్ణయం తీసుకున్నారు. అదే సమయంలో, మెగా వేలంలో ఇషాన్ కిషన్ పై రూ.11.25 కోట్లు ఖర్చు చేశారు.

ఒప్పందం విఫలయ్యేనా..

సీజన్‌లో మొదటి మ్యాచ్ తప్ప ఈ ముగ్గురు బ్యాట్స్‌మెన్స్ వరుసగా విఫలమవుతూనే ఉన్నారు. తొలి మ్యాచ్‌లో హైదరాబాద్ 286 పరుగుల భారీ స్కోరు చేసింది. ఇందులో ఇషాన్ 106 పరుగుల తుఫాన్ ఇన్నింగ్స్ ఆడాడు. హెడ్ ​​67 పరుగులు చేయగా, అభిషేక్ కూడా త్వరగా 24 పరుగులు చేశాడు. ఆ తరువాత, ముగ్గురు బ్యాట్స్‌మెన్‌లు తరువాతి 4 మ్యాచ్‌లలో దారుణంగా విఫలమయ్యారు. తరువాతి 4 ఇన్నింగ్స్‌లలో హెడ్ కేవలం 81 పరుగులు మాత్రమే చేశాడు. అభిషేక్, ఇషాన్ పరిస్థితి మరింత దారుణంగా ఉంది. ఈ 4 ఇన్నింగ్స్‌లలో అభిషేక్ 27 పరుగులు చేయగా, ఇషాన్ కేవలం 21 పరుగులు మాత్రమే చేశాడు. ఇటువంటి పరిస్థితిలో కావ్యా మారన్ రూ. 39.25 కోట్లు వృథాగా మారాయని ఫ్యాన్స్ కామెంట్లు చేస్తున్నారు.

మరిన్ని ఐపీఎల్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..