IPL: కోట్లు కురవాల్సిందే.. మెగా వేలంలోకి హిట్‌మ్యాన్, రాహుల్.! కన్నేసిన ఆ 3 ఫ్రాంచైజీలు..

ఐపీఎల్ 2025లో టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మ.. అలాగే మిడిలార్డర్ బ్యాటర్.. వారివారి ఫ్రాంచైజీల తరపున బరిలోకి దిగే అవకాశాలు కనిపించట్లేదు. ముంబై ఇండియన్స్ జట్టును ఐదుసార్లు ఐపీఎల్ ఛాంపియన్‌గా నిలిపిన రోహిత్ శర్మ.. ఆ ఫ్రాంచైజీ ఈ సీజన్‌లో కెప్టెన్సీ నుంచి తప్పించి.. హార్దిక్ పాండ్యాకు అప్పగించిన సంగతి తెలిసిందే.

IPL: కోట్లు కురవాల్సిందే.. మెగా వేలంలోకి హిట్‌మ్యాన్, రాహుల్.! కన్నేసిన ఆ 3 ఫ్రాంచైజీలు..
Ipl
Follow us
Ravi Kiran

|

Updated on: Jun 06, 2024 | 9:28 PM

ఐపీఎల్ 2025లో టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మ.. అలాగే మిడిలార్డర్ బ్యాటర్.. వారివారి ఫ్రాంచైజీల తరపున బరిలోకి దిగే అవకాశాలు కనిపించట్లేదు. ముంబై ఇండియన్స్ జట్టును ఐదుసార్లు ఐపీఎల్ ఛాంపియన్‌గా నిలిపిన రోహిత్ శర్మ.. ఆ ఫ్రాంచైజీ ఈ సీజన్‌లో కెప్టెన్సీ నుంచి తప్పించి.. హార్దిక్ పాండ్యాకు అప్పగించిన సంగతి తెలిసిందే. దీనిపై తీవ్ర అసంతృప్తితో ఉన్న రోహిత్ శర్మ.. వచ్చే సీజన్‌లో ముంబై తరపున ఆడట్లేదని గతంలో కేకేఆర్ అసిస్టెంట్ కోచ్ అభిషేక్ నాయర్‌తో జరిపిన చిట్‌చాట్ వీడియోలో చెప్పకనే చెప్పాడు. ఈ నేపధ్యంలో ఒకవేళ రోహిత్ శర్మ మెగా వేలంలోకి వస్తే అతన్ని కొనుగోలు చేసేందుకు ఇతర ఫ్రాంచైజీలు కాయలు కాసేలా కాచుకుని కూర్చున్నాయి. బీసీసీఐ గత రూల్స్ ప్రకారమే ఐపీఎల్ 2025 మెగా వేలం జరగనుంది. ఈ క్రమంలోనే రోహిత్ శర్మపై కాసులు కురిపించేందుకు మూడు ఫ్రాంచైజీలు సిద్దంగా ఉన్నాయి.

ఇది చదవండి: కమిన్స్ కాదు.. ఆ ప్లేయరే SRH కొత్త కెప్టెన్.? అతడిపై కావ్య పాప కోట్లు కురిపించడం ఖాయం.!

పంజాబ్ కింగ్స్, ఢిల్లీ క్యాపిటల్స్, గుజరాత్ టైటాన్స్ ఫ్రాంచైజీలు రోహిత్ శర్మను కొనుగోలు చేసేందుకు మొగ్గు చూపుతున్నాయి. ఆయా జట్లకు కెప్టెన్సీ కష్టాలు కొట్టేచ్చేలా కనిపిస్తున్నాయి. ధావన్, పంత్, గిల్.. ఆ ఫ్రాంచైజీలకు ఈ సీజన్‌లో సరైన కెప్టెన్సీ బాధ్యతలను నిర్వర్తించలేకపోయారు. ఎలాగో వారంతా మెగా వేలంలోకి వచ్చే అవకాశం ఉండటంతో.. అనుభవమున్న రోహిత్ శర్మను కెప్టెన్‌గా తీసుకుంటే.. తమ ఫ్రాంచైజీలు మళ్ళీ విజయపధంలోకి వెళ్తాయని భావిస్తున్నారు.

ఇవి కూడా చదవండి

అటు కెఎల్ రాహుల్ కూడా మెగా వేలంలోకి వచ్చే అవకాశం ఉంది. లక్నో సూపర్ జెయింట్స్ ఫ్రాంచైజీ సీఈఓ హర్ష గోయంకాతో రాహుల్‌కి సత్సంబంధాలు తెగిపోయాయి. ఈ సీజన్‌ ఎండింగ్‌లో జరిగిన పలు మ్యాచ్‌లలోనే దానిపై క్లారిటీ వచ్చేసింది. దీంతో అతడు వేలంలోకి వస్తే.. రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు, సన్‌రైజర్స్ హైదరాబాద్, చెన్నై సూపర్ కింగ్స్ కొనుగోలు చేయాలని భావిస్తున్నారు. గతంలో ఆర్సీబీకే ప్రాతినిధ్యం వహించాడు రాహుల్. ఇక ఈసారి కూడా కోహ్లి టీం.. రాహుల్‌‌ని దక్కించుకోవాలని చూస్తోంది.

ఇది చదవండి: వర్షాకాలంలో పాములు ఇంట్లోకి వస్తున్నాయా.? ఈ వంటింటి చిట్కాలతో ఈజీగా తరిమేయండి..

మరిన్ని క్రికెట్ వార్తలు ఇక్కడ క్లిక్ చేయండి..