CSK: ఏం స్కెచ్ ‘తలా’.. CSKకి తిరిగొచ్చేస్తున్న ధోని ఫ్రెండ్.. ఇక మోత మోగాల్సిందే.!

ఇండియన్ ప్రీమియర్ లీగ్ సీజన్ 18 మెగా వేలానికి ముందు ఒక పెద్ద అప్‌డేట్ వచ్చేసింది. రాజస్థాన్ రాయల్స్ కీ బౌలర్ రవిచంద్రన్ అశ్విన్ వచ్చే ఐపీఎల్ 2025 సీజన్‌ను చెన్నై సూపర్ కింగ్స్ తరపున ఆడే అవకాశం కనిపిస్తోంది. ఇందుకు కారణం లేకపోలేదు. ఆ వివరాలు ఇలా ఉన్నాయి.. అదేంటంటే.?

CSK: ఏం స్కెచ్ 'తలా'.. CSKకి తిరిగొచ్చేస్తున్న ధోని ఫ్రెండ్.. ఇక మోత మోగాల్సిందే.!
Chennai Super Kings
Follow us
Ravi Kiran

|

Updated on: Jun 06, 2024 | 7:20 PM

ఇండియన్ ప్రీమియర్ లీగ్ సీజన్ 18 మెగా వేలానికి ముందు ఒక పెద్ద అప్‌డేట్ వచ్చేసింది. రాజస్థాన్ రాయల్స్ కీ బౌలర్ రవిచంద్రన్ అశ్విన్ వచ్చే ఐపీఎల్ 2025 సీజన్‌ను చెన్నై సూపర్ కింగ్స్ తరపున ఆడే అవకాశం కనిపిస్తోంది. ఇందుకు కారణం లేకపోలేదు. ఇటీవల చెన్నై సూపర్ కింగ్స్ ఫ్రాంచైజీ(ఇండియా సిమెంట్స్ గ్రూప్) రవిచంద్రన్ అశ్విన్‌కి CSK హై పెర్ఫార్మెన్స్ సెంటర్ బాధ్యతను అప్పగించింది. అంటే CSK జట్టుకు చెందిన క్రికెట్ అకాడమీ సహా ముఖ్యమైన కేంద్రాలను ఇకపై అశ్విన్ చూసుకోనున్నాడు.

ఇది చదవండి: కమిన్స్ కాదు.. ఆ ప్లేయరే SRH కొత్త కెప్టెన్.? అతడిపై కావ్య పాప కోట్లు కురిపించడం ఖాయం.!

CSK ఆటగాళ్ల శిక్షణ కోసం చెన్నై సూపర్ కింగ్స్ హై పెర్ఫార్మెన్స్ సెంటర్‌ను ప్రారంభించబడింది. ఈ క్రికెట్ సెంటర్‌లో శిక్షణ పొందుతున్న ఆటగాళ్లకు సలహాలు ఇవ్వడంతో పాటు ఎలాంటి శిక్షణ ఇవ్వాలో నిర్ణయించే బాధ్యతలను అశ్విన్‌ అఫీషియల్‌గా చూసుకుంటాడు. ఈ క్రమంలోనే వచ్చే సీజన్‌లో అశ్విన్ సీఎస్‌కే తరపున ఆడే అవకాశం ఉన్నట్టు ఓ వార్త సోషల్ మీడియా వేదికగా తెగ హల్చల్ చేస్తోంది.

ఇవి కూడా చదవండి

డిసెంబర్‌లో జరగనున్న ఐపీఎల్ మెగా వేలంలోకి అశ్విన్ దాదాపుగా రావడం ఖాయమైంది. ఇక అశ్విన్‌కు CSK ఫ్రాంచైజీ ఇటీవల హై పెర్ఫార్మెన్స్ సెంటర్‌లో ముఖ్యమైన పదవిని ఇచ్చినందున, అతన్ని వేలంలో కొనుగోలు చేయడం పక్కా. టీమిండియా, తమిళనాడుకు చెందిన గొప్ప క్రికెటర్లలో అశ్విన్ ఒకడు. అతని ఉన్నత పనితీరు మా అకాడమీలకు పెద్ద ప్రోత్సాహకరంగా ఉంటుందని CSK CEO కాశీ విశ్వనాథన్ అన్నారు. అతడు సూపర్ కింగ్స్ వెంచర్స్, హై-పెర్ఫార్మెన్స్ సెంటర్‌లో ప్రధాన పాత్ర పోషిస్తాడు. దీన్ని బట్టే ఐపీఎల్ 2025లో చెన్నై సూపర్ కింగ్స్ జట్టులో రవిచంద్రన్ అశ్విన్ సభ్యుడిగా ఉంటాడనడంలో సందేహం లేదు.

ఇది చదవండి: వర్షాకాలంలో పాములు ఇంట్లోకి వస్తున్నాయా.? ఈ వంటింటి చిట్కాలతో ఈజీగా తరిమేయండి..

మరిన్ని క్రికెట్ వార్తలు ఇక్కడ క్లిక్ చేయండి..