16 ఏళ్లకు అరంగేట్రం.. 43 ఏళ్లకు టీ20 ప్రపంచకప్ రికార్డు.. బుమ్రా కంటే తోపు ఈ బౌలర్.. ఎవరంటే.?
T20 ప్రపంచకప్ 2024 చాలా ప్రత్యేకమైనది అని చెప్పాలి. ఎందుకంటే ఈసారి 20 జట్లు పాల్గొంటున్నాయి. 2007లో ప్రారంభమైన ఈ ఐసీసీ టోర్నీ చరిత్రలో తొలిసారి ఇన్ని జట్లు తలపడటం విశేషం. క్రికెట్‌ను ప్రపంచ స్థాయికి తీసుకెళ్లే క్రమంలో.. ఈ ప్రపంచకప్‌ను వెస్టిండీస్‌తో కలిసి హోస్ట్ చేస్తోంది అమెరికా. ఆ వివరాలు ఇలా..
T20 ప్రపంచకప్ 2024 చాలా ప్రత్యేకమైనది అని చెప్పాలి. ఎందుకంటే ఈసారి 20 జట్లు పాల్గొంటున్నాయి. 2007లో ప్రారంభమైన ఈ ఐసీసీ టోర్నీ చరిత్రలో తొలిసారి ఇన్ని జట్లు తలపడటం విశేషం. క్రికెట్‌ను ప్రపంచ స్థాయికి తీసుకెళ్లే క్రమంలో.. ఈ ప్రపంచకప్‌ను వెస్టిండీస్‌తో కలిసి హోస్ట్ చేస్తోంది అమెరికా. ఇక జూన్ 6న ఉగాండా, పాపువా న్యూగినియా మధ్య జరిగిన మ్యాచ్‌లో ఓ అరుదైన రికార్డు నమోదైంది. ఈ మ్యాచ్‌లో ఉగాండాకు చెందిన ఓ బౌలర్ తన అద్భుతమైన ఆటతీరుతో అందరినీ ఆశ్చర్యపరిచాడు. అతడు సాధించిన ఫీట్.. ప్రస్తుతం అత్యుత్తమ ఫాస్ట్ బౌలర్‌గా పేరుగాంచిన జస్ప్రీత్ బుమ్రాకు సాధ్యం కాలేదంటే మీరు నమ్మగలరా.?
ఫ్రాంక్ న్సుబుగా.. యుగాండాకు చెందిన ఈ ఆల్ రౌండర్.. బుమ్రా లాంటి ఫాస్ట్ బౌలర్ కాదు. ఓ ఆఫ్ స్పిన్నర్. అతని స్పిన్ మాయజాలంతో PNG బ్యాట్స్‌మెన్‌లకు చెమటలు పట్టించాడు. ఈ టోర్నమెంట్ చరిత్రలోనే న్సుబుగా అత్యంత అరుదైన 4 ఓవర్ల స్పెల్‌ను వేసి.. తన పేరిట ఓ రికార్డును లిఖించుకున్నాడు. న్సుబుగా 4 ఓవర్ల స్పెల్‌లో 20 డాట్ బాల్స్ వేశాడు. 1.00 ఎకానమీతో కేవలం 4 పరుగులు మాత్రమే ఇచ్చి 2 వికెట్లు పడగొట్టాడు. ఐర్లాండ్‌పై బుమ్రా 3 ఓవర్ల బౌలింగ్ స్పెల్ వేశాడు. అందులో అతడు 2 ఎకానమీతో 6 పరుగులు ఇచ్చి 2 వికెట్లు తీశాడు.
ఇది చదవండి: కమిన్స్ కాదు.. ఆ ప్లేయరే SRH కొత్త కెప్టెన్.? అతడిపై కావ్య పాప కోట్లు కురిపించడం ఖాయం.!
యుగాండా ఆటగాడు ఫ్రాంక్ న్సుబుగా ఈ మ్యాచ్‌లోనే కాకుండా టీ20 అంతర్జాతీయ మ్యాచ్‌లలో మెయిడిన్ల విషయంలో కూడా జస్ప్రీత్ బుమ్రా కంటే ముందున్నాడు. టీ20 ఇంటర్నేషనల్‌లో అత్యధిక మెయిడిన్ ఓవర్లు వేసిన ఆటగాడిగా న్సుబుగా రికార్డు సృష్టించాడు. అతను 55 మ్యాచ్‌ల్లో 17 మెయిడిన్లు బౌలింగ్ చేశాడు. ఈ జాబితాలో బుమ్రా మూడో స్థానంలో ఉన్నాడు. బుమ్రా 63 మ్యాచ్‌లలో మొత్తం 12 మెయిడిన్ ఓవర్లు బౌలింగ్ చేశాడు.
T20 ప్రపంచకప్ 2024లో ఫ్రాంక్ న్సుబుగా అత్యంత పెద్ద వయస్కుడైన ఆటగాడు(43 సంవత్సరాల 282 రోజులు). ఇది మాత్రమే కాదు, 43 ఏళ్ల న్సుబుగా టీ20 ప్రపంచకప్ చరిత్రలో రెండవ పెద్ద వయస్కుడైన ఆటగాడిగా పేరొందాడు. అతనికి ముందు, ర్యాన్ క్యాంప్‌బెల్ 2016లో 44 సంవత్సరాల 34 రోజుల వయస్సులో హాంకాంగ్ తరపున T20 ప్రపంచకప్ ఆడాడు. దాదాపు మూడు దశాబ్దాలుగా న్సుబుగా క్రికెట్ ఆడుతున్నాడు. అతడు కేవలం 16 సంవత్సరాల వయస్సులోనే 1997లో తూర్పు మధ్య ఆఫ్రికా కోసం అంతర్జాతీయ క్రికెట్ అరంగేట్రం చేసాడు. కానీ అతని 27 ఏళ్ల కెరీర్ అంత సులభం కాదు. నేటికీ, అతడు తన ఇంటిని నడపడానికి ఒక ప్రైవేటు కంపెనీలో పని చేయాల్సి వస్తోంది.
ఇది చదవండి: వర్షాకాలంలో పాములు ఇంట్లోకి వస్తున్నాయా.? ఈ వంటింటి చిట్కాలతో ఈజీగా తరిమేయండి..
మరిన్ని క్రికెట్ వార్తలు ఇక్కడ క్లిక్ చేయండి..