SRH: కమిన్స్ కాదు.. ఆ ప్లేయరే SRH కొత్త కెప్టెన్.? అతడిపై కావ్య పాప కోట్లు కురిపించడం ఖాయం.!

ఐపీఎల్ 2025 సీజన్‌కి ముందుగా మెగా వేలం జరగనున్న సంగతి తెలిసిందే. లోకల్ ప్లేయర్స్ మాత్రమే కాదు.. దిగ్గజ క్రికెటర్లయిన హేమాహేమీలు కూడా ఈ ఆక్షన్‌లోకి రానున్నారు. ఇప్పటివరకు అందుతున్న సమాచారం బట్టి.. ప్రతీ ఫ్రాంచైజీ నలుగురు ఆటగాళ్లను అట్టిపెట్టుకునే ఛాన్స్ ఉంది. ఆ వివరాలు ఇలా..

SRH: కమిన్స్ కాదు.. ఆ ప్లేయరే SRH కొత్త కెప్టెన్.? అతడిపై కావ్య పాప కోట్లు కురిపించడం ఖాయం.!
Srh
Follow us
Ravi Kiran

|

Updated on: Jun 06, 2024 | 1:29 PM

ఐపీఎల్ 2025 సీజన్‌కి ముందుగా మెగా వేలం జరగనున్న సంగతి తెలిసిందే. లోకల్ ప్లేయర్స్ మాత్రమే కాదు.. దిగ్గజ క్రికెటర్లయిన హేమాహేమీలు కూడా ఈ ఆక్షన్‌లోకి రానున్నారు. ఇప్పటివరకు అందుతున్న సమాచారం బట్టి.. ప్రతీ ఫ్రాంచైజీ నలుగురు ఆటగాళ్లను అట్టిపెట్టుకునే ఛాన్స్ ఉంది. అందులో ఇద్దరు దేశీ ప్లేయర్లు ఉండగా.. ఇద్దరు విదేశీ ప్లేయర్లు ఉంటారు. ఇక ఐపీఎల్ 2024లో సన్‌రైజర్స్ హైదరాబాద్ మునుపెన్నడూ లేనంతగా విజృంభించింది. ప్యాట్ కమిన్స్ సారధ్యంలోని హైదరాబాద్.. మిగతా ఫ్రాంచైజీలను భయపెడుతూ.. తమ దూకుడైన ఆటతీరుతో ఆకట్టుకుంది. అయితే వచ్చే సీజన్‌కు ముందుగా మళ్లీ స్ట్రాంగ్ టీంను బిల్డ్ చేసుకునే క్రమంలో పలువురు సీనియర్ ప్లేయర్స్‌ను హైదరాబాద్ ఫ్రాంచైజీ వేలంలోకి వదులుకోవాల్సి ఉంది.

ప్యాట్ కమిన్స్, ఐడెన్ మార్క్‌రమ్, గ్లెన్ ఫిలిప్స్, భువనేశ్వర్ కుమార్ లాంటి సీనియర్లను వేలంలోకి విడిచిపెట్టి.. మళ్లీ చేజిక్కించుకోవాలని సన్‌రైజర్స్ యాజమాన్యం సీఈఓ కావ్య మారన్ భావిస్తోందట. అలాగే రిటైన్ లిస్టులో కొన్ని మార్పులు కూడా జరిగే అవకాశం ఉంది. గతంలో అట్టిపెట్టుకున్న ఉమ్రాన్ మాలిక్, అబ్దుల్ సమద్‌లకు ఈసారి చోటు దక్కే అవకాశం లేదు.

రిటైన్ లిస్టులో అభిషేక్ శర్మ, నితీష్ రెడ్డి, హెన్రిచ్ క్లాసన్, నటరాజన్ పేర్లు గట్టిగా వినిపిస్తున్నాయి. ఒకవేళ ఇదే నిజమైతే.. SRH సీఈఓ కావ్య మారన్ తన విన్నింగ్ ప్లేయర్స్ అయిన.. కమిన్స్, హెడ్, ఫిలిప్స్, భువనేశ్వర్ కుమార్, షాబాజ్ అహ్మద్‌లను మళ్లీ తక్కువ ధరకు తీసుకోవడమే కాకుండా.. ఈసారి జట్టులో స్పిన్ గట్టిగా ఉండేలా ఎక్కువ స్పిన్నర్లను మెగా వేలంలో దక్కించుకోవాలి. ఇక అటు హిట్‌మ్యాన్ రోహిత్ శర్మ కూడా వేలంలోకి వచ్చే అవకాశాలు ఉండటంతో.. కావ్య పాప.. మన ఇండియన్ కెప్టెన్‌ను కూడా దక్కించుకోవాలని చూస్తోంది. ఒకవేళ రోహిత్ శర్మ SRHలోకి వస్తే మాత్రం.. కమిన్స్ స్థానంలో హిట్‌మ్యాన్‌కే కెప్టెన్సీ పగ్గాలు దక్కుతాయి.

ఇవి కూడా చదవండి

ఇది చదవండి: చేపల వల బరువెక్కడంతో జాలర్లు సంబరపడ్డారు.. తీరా పైకి లాగి చూడగా.!

ఎలాగో డెక్కన్ ఛార్జర్స్‌కు ఒకప్పుడు రోహిత్ ప్రాతినిధ్యం వహించాడు కాబట్టి.. ఇప్పుడు SRHకి కెప్టెన్ అయితే.. వరుసగా రెండో హైదరాబాదీ ఫ్రాంచైజీకి ప్రాతినిధ్యం వహించిన క్రికెటర్‌గా రోహిత్ శర్మ అరుదైన ఫీట్ సొంతం చేసుకోనున్నాడు. ఇవన్నీ కేవలం అంచనాలే అయినప్పటికీ.. ఫ్యాన్స్ మాత్రం ఇప్పటికే తమ లెక్కలు తాము వేసుకుంటున్నారు. రోహిత్, కమిన్స్‌తో పాటు ఈ సీజన్ విన్నింగ్ టీంను మళ్లీ SRH సొంతం చేసుకుంటే.. వచ్చే ఏడాది కప్ మనదే అంటూ కామెంట్స్ పెడుతున్నారు.

ఇది చదవండి: SRH‌కి హిట్‌మ్యాన్.. RCBకి రాహుల్.. మెగా వేలంలోకి హేమాహేమీలు.! రిటైన్ లిస్టు ఇదిగో..

మరిన్ని క్రికెట్ వార్తలు ఇక్కడ క్లిక్ చేయండి..