Ravindra Jadeja: పొలిటికల్ ఇన్నింగ్స్ ప్రారంభించిన క్రికెటర్ రవీంద్ర జడేజా.. ఏ పార్టీలో చేరాడో తెలుసా?

టీమిండియా స్టార్ క్రికెటర్ రవీంద్ర జడేజా రాజకీయాల్లో కొత్త ఇన్నింగ్స్ ప్రారంభించాడు. టీ20 ప్రపంచకప్ గెలిచిన భారత జట్టులో సభ్యునిగా ఉన్నఈ స్టార్ ఆల్ రౌండర్ ఆ వెంటనే పొట్టి ఫార్మాట్ కు వీడ్కోలు పలికాడు. కేవలం టెస్టులు, వన్డేలు మాత్రమే ఆడతానంటూ ప్రకటించాడు. అయితే అనూహ్యంగా పొలిటికల్ ఇన్నింగ్స్ ను షురూ చేశాడీ టీమిండియా మేటి క్రికెటర్.

Ravindra Jadeja: పొలిటికల్ ఇన్నింగ్స్ ప్రారంభించిన క్రికెటర్ రవీంద్ర జడేజా.. ఏ పార్టీలో చేరాడో తెలుసా?
Ravindra Jadeja
Follow us
Basha Shek

|

Updated on: Sep 05, 2024 | 6:22 PM

టీమిండియా స్టార్ క్రికెటర్ రవీంద్ర జడేజా రాజకీయాల్లో కొత్త ఇన్నింగ్స్ ప్రారంభించాడు. టీ20 ప్రపంచకప్ గెలిచిన భారత జట్టులో సభ్యునిగా ఉన్నఈ స్టార్ ఆల్ రౌండర్ ఆ వెంటనే పొట్టి ఫార్మాట్ కు వీడ్కోలు పలికాడు. కేవలం టెస్టులు, వన్డేలు మాత్రమే ఆడతానంటూ ప్రకటించాడు. అయితే అనూహ్యంగా పొలిటికల్ ఇన్నింగ్స్ ను షురూ చేశాడీ టీమిండియా మేటి క్రికెటర్. నిజానికి రవీంద్ర జడేజా భార్య రివాబా జ‌డేజా ఇప్పటికే బీజేపీలో ఉన్నారు. గుజరాత్‌లోని జామ్‌నగర్ ఉత్తర నియోజకవర్గం నుంచి ఆమె ఎమ్మెల్యేగా కూడా గెలుపొందారు. ఇప్పుడు జడ్డూ కూడా బీజేపీలో చేరాడు. ఈ విషయాన్ని రివాబా జడేజా సోషల్ మీడియా ద్వారా షేర్ చేసింది. కేంద్రంలో అధికారంలో ఉన్నబీజేపీ దేశవ్యాప్తంగా పార్టీ సభ్యత్వ నమోదు కార్యక్రమాలను చేపడుతోంది. ఇందులో భాగంగానే గుజరాత్ లో కూడా ఈ కార్యక్రమం విస్తృతంగా నిర్వహిస్తున్నారు.ఇందులో భాగంగానే జడేజా కూడా బీజేపీలో చేరాడు. రివాబా తన ట్విట్టర్ ఖాతాలో రవీంద్ర జడేజా బీజేపీ సభ్యత్వ ధ్రువీకరణ పత్రాల ఫోటోలను పోస్ట్ చేసిది రవీంద్ర జడేజా గతంలో 2022 గుజరాత్ ఎన్నికల సమయంలో తన భార్య తరఫున విస్తృంగా ప్రచారం చేశాడు.

గత జూన్‌లో జరిగిన T20 ప్రపంచ కప్‌లో భారతదేశానికి అందించిన తర్వాత జడేజా పొట్టి ఫార్మాట్ నుండి రిటైర్మెంట్ ప్రకటించాడు. అప్పటి నుంచి క్రికెట్ కు దూరంగా ఉన్నాడు జడేజా. గత నెలలో శ్రీలంక పర్యటనలో వన్డే సిరీస్‌కు కూడా కూడా జట్టులోకి రాలేదు. గురువారం అంటే ఈరోజు నుంచి ప్రారంభమైన దులీప్ ట్రోఫీ టోర్నీకి జట్టులోకి ఎంపికైన అతడు టోర్నీ ప్రారంభానికి వారం రోజుల ముందు టోర్నీ నుంచి తన పేరును ఉపసంహరించుకున్నాడు. సెలక్షన్ కమిటీ కూడా అతని అభ్యర్థనను అంగీకరించింది.

ఇవి కూడా చదవండి

ప్రస్తుతం రాజకీయాల్లోకి అడుగుపెట్టిన రవీంద్ర జడేజా.. ఈ నెలలో ప్రారంభం కానున్న టెస్టు సిరీస్‌ నుంచి మళ్లీ భారత జట్టులోకి రానున్నాడు. సెప్టెంబర్ 19న భారత్, బంగ్లాదేశ్ మధ్య రెండు టెస్టుల సిరీస్ ప్రారంభం కానుంది, ఇందులో జడేజా జట్టులో కీలక పాత్ర పోషిస్తాడు. ఈ సిరీస్‌లోనే కాదు.. ఆ తర్వాత జరగనున్న న్యూజిలాండ్ సిరీస్‌లోనూ అతడి పాత్ర పెద్దదే. జడేజా ఇప్పటివరకు 72 టెస్టు మ్యాచ్‌లు ఆడాడు, అందులో 294 వికెట్లతో పాటు 3036 పరుగులు చేశాడు.

రవీంద్ర జడేజా బీజేపీ సభ్యత్వ నమోదు పత్రాలు..

మరిన్ని క్రీడా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.